You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. యుక్రెయిన్‌లోని జాఫోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ పై జరిగిన దాడి పట్ల విచారం వ్యక్తం చేసిన భారత్

    యుక్రెయిన్ లోని జాఫోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌లో ఇంధన స్టోరేజీ కేంద్రం పై జరిగిన బాంబు దాడి పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. న్యూక్లియర్ కేంద్రాలకు ప్రమాదం వాటిల్లకుండా ఇరు దేశాలు చూడాలని ఐక్యరాజ్యసమితి భారత్ రాయబారి రుచిర కాంభోజ్ కోరారు.

    ఆమె భద్రతా మండలి సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

    యుక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితి పట్ల భారత్ విచారం వ్యక్తం చేస్తోంది. ఈ పోరు మొదలైనప్పటి నుంచి యుద్ధానికి అంతం పలకమని భారత్ పిలుపునిస్తూ వస్తోంది. ఈ పోరును అంతం చేసేందుకు జరుగుతున్న అన్ని దౌత్యపరమైన చర్యలన్నిటినీ భారత్ సమర్ధిస్తోందని రుచిర చెప్పారు.

    జాఫోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ పై గురువారం జరిగిన దాడికి యుక్రెయిన్రష్యాను నిందించింది.

    మరో వైపు, రష్యా ఈ దాడికి యుక్రెయిన్‌లోని నిందించింది.

    జాఫోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ యూరప్‌లో విద్యుత్తును ఉత్పత్తి చేసే అతి పెద్ద పవర్ ప్లాంట్.

    ఈ ప్లాంటుకు సంబంధించిన ఆఫిసును, ఫైర్ స్టేషన్ పై ఇప్పటి వరకు 10 సార్లు దాడి చేసినట్లు ఇరు పక్షాలు చెప్పాయి.

    ఈ దాడి పట్ల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా విచారం వ్యక్తం చేసింది. ఇదొక దారుణమైన సమయమని వర్ణించింది.

    ఈ దాడులు విధ్వంసానికి దారి తీయవచ్చని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటియెరెజ్ అన్నారు.

    "యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ ఈ పోరును, హింసను అంతం చేయాలని పిలుపునిస్తూనే వస్తోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోరును అంతం చేసేందుకు జరుగుతున్న దౌత్యపరమైన చర్యలన్నిటినీ సమర్థిస్తామని చెబుతోంది.

  2. జాన్సన్ & జాన్సన్: జాన్సన్స్ బేబీ టాల్కమ్ పౌడర్ అమ్మకాలు ఉండవు.. మొక్కజొన్న పిండితో పౌడర్ తయారీకి నిర్ణయం

  3. రాయచోటిలో కోడలిని చంపిన అత్త

    అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో రామాపురానికి చెందిన వసుంధర హత్యకు గురయ్యారు. వసుంధర చిన్న అత్తగారు గురువారం ఈ హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

    వసుంధర భర్త పదేళ్ల క్రితం ఒక ప్రమాదంలో మరణించారు.

    వసుంధర తన ఇద్దరి పిల్లలతో కలిసి రెండంతస్తుల భవనంలో ఉంటున్నారు. అదే ఇంట్లో ఒక అంతస్తులో ఆమె చిన్నత్త సుబ్బమ్మ కూడా ఉంటున్నారు. ఈమె వసుంధర అత్తగారికి చెల్లెలు.

    వసుంధర వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వల్లే సుబ్బమ్మ వసుంధరను నరికి చంపారని పోలీసులకు చెప్పినట్లు తెలిపారు.

    వసుంధర అవతలి వ్యక్తితో కలిసి తన మనవరాళ్ళకు ఆస్తి దక్కకుండా చేస్తుందేమోననే భయంతోనే ఈ హత్య చేసినట్లు సుబ్బమ్మ మీడియాకు చెప్పారు.

    వసుంధర సంబంధం గురించి ప్రశ్నించినప్పుడు ఆమె పై దాడికి పాల్పడినట్లు చెప్పారు. దీంతో, తనను చంపేస్తారేమోననే భయంతోఆమె తలను నరికి పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు.

    ఈ సంఘటన సినిమాల్లో దృశ్యాన్ని తలపించే విధంగా ఉంది.

    సుబ్బమ్మ కోడలి తలను నరికి కత్తితో నడుచుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్ ముందు నిల్చున్నారు. పోలీసులు ఈ హత్యను దర్యాపు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

    హత్య జరిగిన సమయంలో వసుంధర కూతుర్లు ఇద్దరు స్కూలులో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.

    తల్లి హత్య పట్ల పిల్లలు రోదిస్తున్నారు.

    ఆస్తి తగాదాల వల్లే ఈ హత్య చోటు చేసుకున్నట్లురాయచోటిడీఎస్పీ శ్రీధర్ మీడియాతోచెప్పారు.

  4. రణ్‌వీర్ సింగ్: న్యూడ్ ఫొటోల వివాదంలో సమన్లు ఇవ్వనున్న ముంబయి పోలీసులు

  5. రైల్వేవాళ్లు ఇరవై రూపాయలు ఎక్కువ చార్జి చేశారని కోర్టుకెళ్లాడు, 22 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది

  6. 10 లక్షల రూపాయల రాఖీ: ఇవి ఎక్కడ తయారవుతున్నాయి? ఎవరు కొంటున్నారు? ఎందుకు కొంటున్నారు?

  7. దేశంలో నిరుద్యోగిత పెరుగుతోందా? ఎందుకు

  8. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా ఎలా ఉంది?

  9. అరవింద్ కేజ్రీవాల్: ‘ఉచితాలు రద్దు చేయాలంటున్నారు.. కేంద్రం దగ్గర డబ్బంతా ఎటు పోయింది?’

    కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసే పన్నులతో తమ స్నేహితుల రుణాలను మాఫీ చేస్తోందని.. మరోవైపు ప్రజలకు ఉచితంగా ఏమీ ఇవ్వవద్దని అంటోందని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు.

    ‘‘దేశంలో గత 75 ఏళ్లలో ఎన్నడూ ప్రభుత్వం కనీస ఆహార ధాన్యాల మీద పన్ను విధించలేదు. పెట్రోల్, డీజిల్‌ల మీద పన్ను 1000 కోట్ల రూపాయలు దాటింది. వాళ్లు ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేవాటినన్నిటినీ ఆపేయాలని అంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో ఫీజులు వసూలు చేయాలని అంటున్నారు. ఉచిత రేషన్లు ఆపేయాలని అంటున్నారు’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    కేంద్రం తన దగ్గర డబ్బులు లేవని పదే పదే చెప్తోందని, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన డబ్బులను తగ్గిస్తోందని కేజ్రీవాల్ అన్నారు. 2014తో పోలిస్తే చాలా ఎక్కువగా పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

    ‘‘కేంద్ర ప్రభుత్వం దగ్గరి డబ్బులన్నీ ఎటు పోయాయి? వాళ్లు ఈ ప్రభుత్వ డబ్బుతో తమ స్నేహితుల రుణాలు మాఫీ చేస్తున్నారు. వాళ్లు తమ బిలియనీర్ స్నేహితులకు పన్నులు కూడా మాఫీ చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ విమర్శించినట్లు ఏఎన్ఐ చెప్పింది.

    కేజ్రీవాల్ వక్రీకరించి మాట్లాడుతున్నారు: నిర్మలా సీతారామన్

    కేజ్రీవాల్ విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ..ఆరోగ్యం, విద్య అంశాలపై ఆయన వక్రీకరించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

    ‘‘ఇది ప్రజలను భయపెట్టటానికి. ఉచితాల మీద చర్చ జరగాలని మేం కోరుతున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు.

    ఉచిత పంపిణీలు, హామీలు తీవ్రమైన అంశం: సుప్రీంకోర్టు

    ఇదిలావుంటే.. ఎన్నికల సమయంలో ఉచిత పంపిణీలు, ఉచితాల హామీలు ఇవ్వటం ‘‘తీవ్రమైన అంశం’’ అని సుప్రీంకోర్టు బుధవారం నాడు వ్యాఖ్యానించింది. వీటి కోసం ఖర్చు చేసే డబ్బును మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి వాటి కోసం ఖర్చుచేయాలని పేర్కొంది.

    ప్రజల డబ్బు నుంచి ఏవేవో ఉచితంగా ఇస్తామని, పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని, వాటి ఎన్నికల చిహ్నాలను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సుప్రీంకోర్టు గురువారం విచారించింది.

    చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం.. ఆర్థిక వ్యవస్థ డబ్బు కోల్పోతోందని, ప్రజాసంక్షేమానికి, ఆర్థిక వ్యవస్థకు సంతులనం ఉండాలని పేర్కొంది.

    ‘‘అందుకే ఈ చర్చ జరుగుతోంది. ఇది సీరియస్ ఇష్యూ. దీనిని వ్యతిరేకిస్తున్న వారు.. దీనికి తాము పన్నులు కడుతున్నామని అంటున్నారు. వారి డబ్బును మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనుల మీద ఖర్చు చేయాలి కానీ. ప్రజలను విభజించరాదు’’ అని ఈ కేసులో ఇరుపక్షాలకూ సుప్రీంకోర్టు చెప్పింది.

    ఈ అంశంపై మరింత చర్చ జరగాలని పేర్కొంది. ‘‘ఇది కచ్చితంగా ఆందోళనకరమైన విషయమే. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. కానీ పేదరికం ఉన్న భారత్ వంటి దేశంలో ఇటువంటి అంశాన్ని విస్మరించలేం’’ అని వ్యాఖ్యానించింది.

    దిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ పిల్‌ను వ్యతిరేకిస్తూ.. వస్తువుల పంపిణీకి, ప్రజా సంక్షేమం కోసం ఉచిత పథకాలకు తేడా ఉందన్నారు. ఈ కేసులో ఉచితాలు అనే పదాన్ని తప్పుడు అన్వయంతో ఉపయోగించారని పేర్కొన్నారు.

  10. సింగపూర్ జైలులో కాల్పుల నుంచి తప్పించుకున్న తెలుగువాడు, దక్షిణ భారతాన తొలి రాజకీయ ఖైదీ

  11. 'స్నేహానికి దేశాలు, సరిహద్దులు లేవు' - పాక్ మహిళతో స్నేహం గురించి భారతీయ మహిళ షేర్ చేసిన ఫొటోపై సోషల్ మీడియాలో ప్రశంసలు

  12. సంపన్నులు ఎగ్గొట్టిన రుణాల వల్లే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయా, గత 5 ఏళ్లలో రూ.10 లక్షల కోట్లు రైటాఫ్ చేసిన బ్యాంకులు

  13. లాల్ సింగ్ చ‌డ్డా రివ్యూ: సుదీర్ఘంగా సాగిన ఎమోష‌నల్ జ‌ర్నీ

  14. తెలంగాణ: 8 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ కొనేందుకు కేంద్రం అంగీకారం

    తెలంగాణ నుంచి 2021-22 రబీ సీజన్‌కు సంబంధించి 8 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కొనేందుకు అంగీకరించింనట్లు కేంద్ర పౌరసఫరాలశాఖ తెలిపింది.

    ఇప్పటికే 6.05 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కొనేందుకు కేంద్రం అంగీకరించింది.

  15. కర్నాటకలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు... ఇద్దరు మృతి

    కర్నాటకలోని కొప్పల్ జిల్లాలో గల హులిహైదర్ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

    ఈ గొడవల్లో ఇద్దరు చనిపోగా ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

    ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ విధించారు.

    ఇండియా టుడే కథనం ప్రకారం... అక్కడ ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి ప్రేమిస్తున్నాడు. మొహర్రం రోజున ఆ అమ్మాయిని కలవడానికి ఆ అబ్బాయి వెళ్లాడు. గొడవ ఇక్కడి నుంచే మొదలైనట్లుగా తెలుస్తోంది.

  16. చైనాలో కనిపిస్తున్న లాంగ్యా వైరస్ ప్రాణాంతకమా? నిపుణులు ఏమి చెబుతున్నారు?

  17. ఇసుక తవ్వకాలే గోదావరికి చేటు చేస్తున్నాయా?

    గోదావరికి ఈసారి భారీ వరద వచ్చింది.

    వందల గ్రామాలు, వేల ఎకరాల పంట నీట మునిగి చాలామంది నష్టాల పాలయ్యారు. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన కోనసీమ ప్రాంతం ఈ వరదల మూలంగా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.

    గోదావరి వరదలు ఇంతగా ముంచెత్తడానికి కారణం ఏంటి? పరిష్కారం లేదా?

  18. బ్రేకింగ్ న్యూస్, ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖర్ ప్రమాణ స్వీకారం

    వైస్ ప్రెసిడెంట్‌గా జగదీప్ ధన్‌ఖర్ ప్రమాణ స్వీకారం చేశారు.

    ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

    ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

    ఇతర కేంద్ర మంత్రులు, ప్రతిపక్షాల నాయకులు కూడా వచ్చారు.

  19. చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం: హోం లోన్‌ ఈఎంఐలు చెల్లించడం ఆపేసిన ప్రజలు.. ప్రభుత్వం ఏం చేస్తోంది?

  20. వంట గ్యాస్ ధర పెరగడంతో కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారా?

    వంటగదిలో ఉక్కిరిబిక్కిరి చేసే పొగ నుంచి నిరుపేద మహిళలకు విముక్తిని ప్రసాదించే లక్ష్యంతో 2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.

    ఆ పథకం కింద, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, స్టవ్‌లతో పాటు నింపిన గ్యాస్ సిలిండర్ ఇచ్చారు.

    ప్రస్తుతం సిలిండర్ ధర భారీగా పెరిగిన నేపథ్యంలో నిరుపేద కుటుంబాలు ఏం చేస్తున్నాయి?

    మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతంలో ఓ ఆదివాసీ గ్రామం నుంచి బీబీసీ ప్రతినిధి నితేష్ రావుత్ అందిస్తున్న కథనం.