You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
మీమ్ టు మూవ్మెంట్: జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏం జరిగింది?
ఒక చిన్న సెటైరికల్ మీమ్‌గా మొదలై.. దిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) కథేంటి? పరీక్షల లీకేజీలపై విద్యార్థి గళమై, కేంద్ర మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తున్న ఈ సరికొత్త ఉద్యమం పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారబోతోందా? ఇంతకీ దిల్లీలో నేడు ఏం జరిగింది?
భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ: సూర్యకుమార్‌కు దక్కని చోటు, కెప్టెన్‌గా శ్రేయస్
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్ 2026 కోసం శనివారం బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఈ యువ ఆటగాడికి తొలిసారిగా చోటు దక్కింది.
మైక్రో డ్రామా: షార్ట్ సిరీస్‌లలో అశ్లీలత, హింస, విలాసాల ప్రదర్శనపై చైనా ఆంక్షలు
వైరల్ మైక్రో డ్రామాల్లో సాఫ్ట్ పోర్నోగ్రఫీ, మితిమీరిన హింస, ధనవ్యామోహంపై చైనా కఠినంగా వ్యవహరిస్తోంది. షార్ట్ సిరీస్‌లలో అశ్లీలత, విలాసాల ప్రదర్శనను అడ్డుకుంటూ.. యువతలో నిరాశావాదాన్ని నిరోధించేందుకు బీజింగ్ సరికొత్త ఆంక్షలు తీసుకొచ్చింది.
దిల్లీ అగ్ని ప్రమాదం: వైద్యం కోసం విదేశీయులు ఇండియాకు ఎందుకు వస్తున్నారు?
2025లో అత్యధికంగా బంగ్లాదేశ్, ఇరాక్ నుంచి వైద్య చికిత్సల కోసం ఇండియా వచ్చారు. వైద్యం కోసం 2025లో ఇండియాకు వచ్చిన విదేశీ పౌరుల్లో బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా మూడు లక్షల మందికి పైగా ఉన్నారు. తర్వాతి స్థానాల్లో ఇరాక్ నుంచి 30,989 మంది, ఉజ్బెకిస్తాన్ నుంచి 13,699 మంది, సోమాలియా నుంచి 11,506 మంది, తుర్కెమెనిస్తాన్ నుంచి 10,231 మంది, ఒమన్ నుంచి 9,738 మంది, కెన్యా నుంచి 9,357 మంది వచ్చారని ప్రెస్ ఇన్ఫర్మెషన్ బ్యూరో ఈ ఏడాది మే నెలలో విడుదల చేసిన డాక్యుమెంట్లో వెల్లడించింది.
పాములా బుస కొట్టే బొద్దింకలు.. వీటిని ఎందుకు పెంచుతున్నారు?
ఆస్ట్రేలియాలో అరచేతి పరిమాణంలో ఉంటూ, బుసకొట్టే విదేశీ బొద్దింకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెంపుడు సరీసృపాల ఆహారం కోసం రూ.1.35 కోట్ల విలువైన ఈ కీటకాలను అక్రమంగా పెంచుతున్నారని అధికారులు చెప్పారు.
అమ్నియోసెంటెసిస్: 35 ఏళ్ల తరువాత గర్భం దాల్చిన మహిళలు ఈ ప్రత్యేక పరీక్ష చేయించుకోవాలా?
"అల్ట్రాసౌండ్ సాయంతో సూదిని అత్యంత జాగ్రత్తగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టి, శిశువు అవయవాలు లేదా ఇతర ముఖ్య శరీర భాగాలకు హాని కలగకుండా ఉండే ప్రాంతం నుంచి కొద్దిపాటి ద్రవాన్ని తీస్తారు. ఈ ద్రవాన్ని పరీక్షకు పంపుతారు. ఈ ద్రవంలో ఉండే కణాలను జన్యు, క్రోమోజోమ్ లోపాలు తెలుసుకోవడానికి పరీక్షిస్తారు’’
ఏఐ సాయంతో వ్యాక్సిన్ తయారీ, ఇకపై వైరస్ ‘వేషాల’కు చెక్ పెట్టొచ్చా?
''మనం ఎప్పుడూ వైరస్‌లకంటే ఒకడుగు వెనకపడే ఉంటాం. దాన్ని అధిగమించేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. కొత్తగా వృద్ధిచెందే వైరస్‌లను, భవిష్యత్ మహమ్మారుల నుంచి రక్షించగల వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం''
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్: 15 లక్షల కోట్ల ‘నకిలీ ఆదాయం’ చూపిందని సెబీ ఆరోపిస్తున్న కంపెనీలో ఎల్ఐసీ భారీ పెట్టుబడులు ఎందుకు పెట్టింది?
మార్చి 2026 నాటి కంపెనీ గణాంకాల ప్రకారం రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఎల్ఐసీ 10.80 శాతం వాటాను కలిగి ఉంది. వాటాదారుల నమూనాను పరిశీలిస్తే ఆ కంపెనీలో ఎల్ఐసీ మాత్రమే ఏకైక ప్రధాన దేశీయ సంస్థాగత పెట్టుబడిదారు అని కూడా అర్ధమవుతుంది. మార్చి 2017లో ఎల్ఐసీ వాటా 1.19 శాతంగా ఉండగా పదేళ్లలో అది 10.80 శాతానికి పెరిగింది.
తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలకు ఎక్కువ అర్హత ఉన్నవారు ఎంపికైతే.. బ్యాంక్ అటెండెంట్ కేసులో సుప్రీంకోర్ట్ ఏం చెప్పింది?
‘ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం తక్కువ విద్యార్హతలు ఉన్న వారికి నిర్దేశించినప్పుడు ఆ ఉద్యోగాన్ని ఉన్నత విద్యార్హతలున్న వారికి ఇవ్వడమంటే అర్హులైన వారి అవకాశాలను నిరాకరించడమే’ అని సుప్రీంకోర్టు ఇటీవల ఓ కేసు విషయంలో జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
ది గ్రేట్ గామా : జీవితంలో ఓటమెరుగని మల్లయోధుడి కథ, 'రోజుకు ఆరు కోళ్లు తిని, 20 లీటర్ల పాలు తాగేవారు..'
జాన్ బుల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు 1910లో, గామాను లండన్ పంపించారు. కానీ గామా పొట్టిగా ఉండడంతో ఆయన్ను అనర్హుడిని చేశారు. కానీ అక్కడే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం బరిలోకి దిగిన గామా లండన్‌లోని ప్రపంచ స్థాయి రెజ్లర్లకు సవాల్ విసిరారు. 5 నిమిషాల పాటు తన చేతిని పట్టుకోగలిగిన వారికి 5 పౌండ్లు ఇస్తానని ప్రకటించారు.
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.