You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. వరల్డ్ బ్లడ్ డోనర్ డే: అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఏవి? అత్యవసర పరిస్థితుల్లో అలాంటి రక్తం ఎక్కడ దొరుకుతుంది?

  2. సచిన్ అంతు చూడాలనుకున్న షోయబ్ అఖ్తర్ ఆ రోజు ఏం చేశారంటే....

  3. వర్షం వస్తే బస్సు కూడా రాని ఊరు నుంచి వరల్డ్ చాంపియన్‌గా

  4. సావర్కర్‌కు బ్రిటిష్ పాలకులు నెలకు రూ. 60 పెన్షన్ ఎందుకు ఇచ్చేవారు... వారితో ఆయన కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి?

  5. చికెన్‌: కోడి మాంసాన్ని షాపు నుంచి తెచ్చాక కడగకూడదా? వాష్ చేస్తే ప్రమాదమా? మరి ఎలా వండాలి?

  6. చరిత్ర: ‘అంకెల్లో చెప్పలేనంత సంపద కలిగిన’ 10 మంది కుబేరులు

  7. చేపలు తినేవారి మెదడు పెద్దగా ఉంటుందా... చెరువు, సముద్రం చేపల్లో ఏవి మంచివి?

  8. 5జీ సేవల ప్రారంభం: ఇక 4జీ మనుగడ ఎలా ఉండనుంది

  9. వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?

  10. నేడు చైనా నౌక శ్రీలంక హంబన్‌తోట ఓడరేవు చేరనుంది

    చైనాకు చెందిన యువాన్ వాంగ్-5 నౌక నేడు అంటే ఆగస్టు 16న శ్రీలంకలోని హంబన్‌తోట ఓడరేవుకు చేరుకుంటుంది. ఈ నౌక వచ్చే ఆరు రోజుల పాటు హంబన్‌తోటలోనే ఉంటుంది.

    అంతకుముందు ఈ నౌక ఆగస్టు 11న హంబన్‌తోట చేరాల్సి ఉండగా, దీని రాకపోకలపై భారత్ ఆందోళనలు వ్యక్తం చేసింది. చైనా ఈ నౌకాశ్రయాన్ని సైనిక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చని భారత్ భయపడుతోంది.

    కాగా, ఇంధనం నింపుకోడానికే చైనా నౌక హంబన్‌తోటలో ఆగుతోందని శ్రీలంక వివరణ ఇచ్చింది.

    భారతదేశం అభ్యంతరాలు వ్యక్తం చేసిన తరువాత, ఈ నౌక రాకను వాయిదా వేయాలని శ్రీలంక కోరింది. దాంతో, యువాన్ వాంగ్ 5 నౌక శ్రీలంకలో హాల్ట్ అయే తేదీలు సమయం వాయిదా పడ్డాయి.

    చివరకు, ఆగస్టు 16 నుంచి 22 వరకు హంబన్‌తోట ఓడరేవులో పోర్ట్ చేయడానికి ఆమోదించామని శ్రీలంక విదేశాంగ శాఖ గత శుక్రవారం ధృవీకరించింది.

    యువాన్ వాంగ్ 5 నౌక అంతర్జాతీయ షిప్పింగ్, పరిశోధన-సర్వే నౌక అని చైనా చెబుతోంది. అయితే, ద్వంద్వ ప్రయోజనాలను నెరవేర్చే ఈ నౌకను ’గూఢచారి నౌక’ అని కూడా పిలుస్తున్నారు.

    1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,944 కోట్లు) విలువ గల హంబన్‌తోట నౌకాశ్రయం ఆసియా, యూరప్‌ మధ్య ప్రధాన నౌకా మార్గానికి సమీపంలో ఉంది.

    శ్రీలంకలోని ఈ ప్రాంతం తమిళనాడుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున, జాఫ్నాలో చైనా ఉనికి భారతదేశానికి ముప్పుగా పరిణమించవచ్చని భావిస్తున్నారు.

  11. పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?

  12. పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో హింసాత్మక నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?

  13. భారత ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సస్పెండ్ చేసిన ఫిఫా.. అండర్-17 మహిళల ప్రపంచ కప్ ఆతిథ్యం రద్దు

    అంతర్జాతీయ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా (FIFA) భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసింది.

    "థర్డ్ పార్టీ జోక్యం" ఉందన్న కారణంగా భారత ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సస్పెండ్ చేయాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది.

    థర్డ్ పార్టీ జోక్యం ఫిఫా నియమాల తీవ్ర ఉల్లంఘన అని కూడా స్పష్టం చేసింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.

    ఈ సస్పెన్షన్ వల్ల భారత్‌లో అక్టోబర్ 11న ప్రారంభం కానున్న అండర్-17 మహిళల వరల్డ్ కప్ రద్దవుతుంది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగాల్సి ఉంది.

    ఈ ఏడాది మేలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని రద్దు చేసింది. ఈ క్రీడను నియంత్రించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. అయితే, ఫిఫా సభ్యులు చట్టపరమైన, రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలన్నది నియమం.

    ఈ నెల ప్రారంభంలో ఫిఫా, భారత ఫుట్‌బాల్‌ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. ఏఐఎఫ్ఎఫ్, నిర్వహణ అధికారం కలిగిన కమిటీని ఏర్పాటు చేసిన తరువాతే సస్పెన్షన్ ఎత్తివేస్తామని చెప్పింది.

    వార్తా సంస్థ ఏఎఫ్‌పీ అందించిన ప్రకారం, ఇప్పటివరకు ఏఐఎఫ్ఎఫ్ ఒక కమిటీ ద్వారా నడుస్తోంది. మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ పదవీకాలం ముగిసినా, ఎన్నికలు లేకుండా ఆ పదవిలో కొనసాగుతున్నారు.

  14. మహారాష్ట్ర: బండరాళ్లపై ప్రముఖుల చిత్రాలు.. స్టోన్ ఆర్ట్‌తో ఆకట్టుకుంటున్న యువకుడు

  15. స్టాలిన్: ‘నేను దిల్లీ వెళ్లేది చేతులు కట్టుకొని కూర్చోవడానికి కాదు’

  16. మొబైల్ ఫోన్ రీపేర్‌ను ఉపాధిగా మార్చుకుంటున్న మహిళలు

  17. ‘నువ్వొక బాంబర్‌వి’ అంటూ ఆ యువకుడికి వచ్చిన మెసేజ్‌తో విమానం ఆరుగంటలు ఆగిపోయింది...

  18. సల్మాన్ రష్దీ: ‘సైతాన్ ఒక కన్ను పోగొట్టుకుంది’- రష్దీ మీద దాడిపై ఇరాన్ మీడియాలో కథనాలు

  19. ఇండియా@75: స్వతంత్ర భారత్‌లో 15 కీలక ఘట్టాలు

  20. భారతదేశంలో తయారైన మైకుకు ‘చికాగో రేడియో’ అని ఎందుకు పేరు పెట్టారు, గాంధీ దాన్ని ఎందుకు ఉపయోగించారు