You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. పట్టుదలే ఆమెను జీవితంలో ముందుకు నడిపిస్తోంది

  2. తెలంగాణ హై కోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం

    తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు.

    రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు.

    ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

    గతంలో బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన ఆయన 2021లో తెలంగాణ హై కోర్టుకు బదిలీ మీద వచ్చారు.

    సుమారు ఎనిమిది నెలల తరువాత కేసీఆర్ తొలిసారి రాజ్‌భవన్‌కు వెళ్లారు. కొంత కాలంగా కేసీఆర్, తమిళిసై మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి.

    బీజేపీతో కయ్యానికి దిగుతున్న కేసీఆర్, కొంత కాలంగా గవర్నర్‌ను దూరం పెడుతూ వస్తున్నారు. ఆయా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమెను దూరంగా ఉంచడం, అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి గవర్నర్‌ను పిలవకపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

  3. ఇతర మహిళలపై తనలో పుట్టే ఆకర్షణని ఆమె ఎప్పుడు తెలుసుకున్నారు?

  4. యుక్రెయిన్: షాపింగ్ మాల్ మీద ‘రష్యా’ మిసైల్ దాడి... 16 మంది మృతి

  5. అమెరికా: కంటైనర్ ట్రక్కులో 40 మృత దేహాలు

    అమెరికాలోని ఒక కంటైనర్ ట్రక్కులో భారీ సంఖ్యలో మృత దేహాలు లభించాయి.

    టెక్సస్‌లోని శాన్ ఆంటోనియో శివార్లలో ఆ లారీని పోలీసులు గుర్తించారు. సుమారు 16 మంది అందులో ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

    ఘటనాల స్థలంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

    శాన్ ఆంటోనియోలోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఆ ట్రక్కు ఉన్నట్లు కేశాట్ టీవీ వెల్లడించింది.

    అమెరికా-మెక్సికో సరిహద్దుకు శాన్ ఆంటోనియో సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందువల్ల అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వచ్చే ప్రయత్నంలో వీరు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

    అయితే చనిపోయిన వారు ఎవరు? ఏ దేశస్థులు? చనిపోవడానికి కారణాలు ఏంటి? అనే విషయాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

    ఇక పరారీలో ఉన్న టక్కు డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

  6. జీ-7 దేశాల నాయకులు రష్యా, చైనా, ఇరాన్‌ల గురించి ఏమన్నారు?

  7. ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వాలు జీవోలను ఎందుకు బయటకు రానివ్వడం లేదు, జగన్మోహన్ రెడ్డి సర్కారు మరింత రహస్యంగా వ్యవహరిస్తోందా?

  8. చంద్రకాంత్ పండిత్: దేశవాళీ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్ కథేంటో తెలుసుకోండి

  9. నిజాం నవాబులు ఈ దూద్ బాయి నీళ్ళే తెప్పించుకుని తాగేవారట...

  10. సౌండ్ ఎఫెక్ఠ్‌ల కోసం బైకులకు సైలెన్సర్లు మార్చుకుంటే... ఇలా జరుగుతుంది

  11. కర్ణాటక: హిందూ ఆలయంలో అరటి పండ్ల ముస్లిం వ్యాపారిపై ఏమిటీ వివాదం, అసలేం జరుగుతోంది?

  12. శ్రీలంక సంక్షోభం: తినడానికి ఏమీ లేక సముద్రం నీటిని తాగి స్పృహ తప్పి పడిపోయిన వృద్ధ జంట

  13. రాష్ట్రపతి ఎన్నికలు: నామినేషన్ వేసిన యశ్వంత్ సిన్హా

    ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు.

    కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర విపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేటప్పుడు కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. ఆయన కుమారుడు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీ రామా రావు కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరు అయ్యారు.

    జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించింది.

  14. కర్నాటక: ‘కేంద్ర మంత్రిని ప్రశ్నించిన టీచర్ సస్పెండ్’

    కేంద్ర మంత్రిని ఎరువుల కొరత గురించి ప్రశ్నించిన ఘటనలో బీదర్‌కు చెందిన ఒక టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లుగా వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    ఎరువుల కొరత గురించి మాట్లాడేందుకు కుషాల్ పాటిల్ అనే టీచర్, కేంద్ర రసాయనాలు-ఎరువుల సహాయక మంత్రి భగవంత్ ఖుబాకు ఫోన్ చేశారు.

    ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    ‘వ్యవసాయం చేసుకునే కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఎరువుల గురించి అడిగాను. దానికే నా మీద వేటు వేశారు. పోయిన సీజన్‌లో ఎరువుల కొరతతో చాలా ఇబ్బందులు పడ్డాను. అందుకే ఈసారి పరిస్థితి కనుక్కుందామని కేంద్ర మంత్రికి ఫోన్ చేశాను.’ అని కుషాల్ పాటిల్ ఏఎన్‌ఐతో అన్నారు.

  15. కండోమ్ వాడకంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పురుషులు ఏమంటున్నారు?

  16. మహారాష్ట్ర: శివసేన రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీం కోర్టులో విచారణ

    మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

    కాసేపట్లో ఈ పిటీషన్ మీద విచారణ ప్రారంభం కానుంది.

    బాల్ ఠాక్రే హిందుత్వ సిద్ధాంతాలకు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన దూరంగా జరిగిందని ఆరోపిస్తూ కొద్ది రోజుల కిందట ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు చేశారు. సుమారు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు ఆయన శిబిరంలో చేరారు.

    అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల ఉమ్మడి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు.

  17. కులాంతర వివాహం: ‘ఏడాది తరువాత అల్లుడిని చంపించిన అత్త’

    అనంతపురం జిల్లా రాప్తాడులో కులాంతర వివాహం చేసుకున్నందుకు ఏడాది తర్వాత అల్లుడిని చంపించిన అత్త కేసులో అసలేం జరిగింది. బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్...

  18. రాష్ట్రపతి ఎన్నికలు: నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్

    ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే వంటి ప్రతిపక్షాలు ఆయనను అభ్యర్థిగా నిలబెట్టిన విషయం తెలిసిందే.

    మమతా బెనర్జీ, మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేశ్, శరద్ పవార్ వంటి నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.

    విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేటప్పుడు కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. ఆయన కుమారుడు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీ రామా రావు కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

    జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించింది.

  19. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.