You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. ఆజాద్ కపూర్, కార్గిల్ ప్రభు, ఎమర్జెన్సీ యాదవ్... ఎవరు వీరంతా? వీరి పేర్ల వెనుక చరిత్ర ఏమిటి

  2. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా షేర్ మార్కెట్‌పై పట్టు ఎలా సాధించారు

  3. కశ్మీర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు సన్నద్ధం

    75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకునేందుకు కశ్మీర్‌ సన్నద్ధమవుతోంది.

    ఇందు కోసం తగిన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు.

    డ్రోన్లను ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ కొనసాగుతోంది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతాయని ఆశిస్తున్నాం అని బారాముల్లా ఎస్ఎస్పీ రేస్ భట్ చెప్పారు.

  4. ప్రేమలో విఫలమయ్యారా? ఆ బాధ నుంచి కోలుకోవడం ఎలా

  5. రాకేష్ ఝన్‌ఝున్‌వాలా మృతి - సంతాపం తెలిపిన మోదీ

    రాకేష్ ఝన్‌ఝున్‌వాలా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

    "రాకేష్ ఝన్‌ఝున్‌వాలా తిరుగులేని వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ, జీవం ఉట్టిపడుతూ దూరదృష్టితో ఉండేవారు. ఆయన ఆర్ధిక రంగానికి తిరుగులేని సేవలను అందించారు. భారత్ అభివృద్ధి గురించి ఆయన చాలా ఆసక్తితో ఉండేవారు. ఆయన మృతి విచారకరం. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం తెలియచేస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

  6. Rakesh Jhunjunwala: బిలియనీర్, షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతి

    భారత్‌లో పేరుమోసిన షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరణించారు.

    హంగామా మీడియా, ఆప్టెక్ వంటి సంస్థలకు చైర్మన్‌గా... వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రొవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా ఉన్న ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు.

    ఆయన వయసు 62 సంవత్సరాలు.

  7. చర్చిలో అగ్నిప్రమాదం... కనీసం 41 మందికి పైగా మృతి

  8. భారత్, పాకిస్తాన్ రెండు దేశాల్లోనూ హాస్పిటల్స్ కట్టించిన ఇంజినీర్

  9. ఫ్రాన్స్‌: వేల ఎకరాల్లో తగలబడుతున్న అడవులు.. ఎండిపోతున్న నదులు

  10. లాక్‌డౌన్ కక్కండి, సునామీ రాయ్, కార్గిల్ ప్రభు, ఎమర్జెన్సీ యాదవ్.. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోని సంఘటనలే వీళ్ల పేర్లు..

  11. ప్రధాన మంత్రి పదవికి నితీశ్ కుమార్ బరిలో ఉన్నారా? ఆయన సొంత ఊరి ప్రజలు ఏం అంటున్నారు?

  12. దువ్వూరి సుబ్బమ్మ: స్వాతంత్ర్య పోరాటంలో జైలు పాలయిన తొలి తెలుగు నాయకురాలు

  13. చీనాబ్ నదిపై 'గోల్డెన్ జాయింట్' రైల్వే వంతెన నిర్మాణం పూర్తి

    చీనాబ్ నదిపై 'గోల్డెన్ జాయింట్' రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఇది. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన వర్కర్లు ఈరోజు జాతీయ జెండా ఎగురవేసి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

    "ఇదొక సుదీర్ఘ ప్రయాణం. 'గోల్డెన్ జాయింట్' అనే పదాన్ని సివిల్ ఇంజనీర్లు సృష్టించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన" అని కొంకణ్ రైల్వే చైర్మన్, ఎండీ సంజయ్ గుప్తా చెప్పినట్టు ఏఎన్ఐ తెలిపింది.

  14. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వహణకు కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు ఎందుకు కోరుతున్నారు?

  15. విశాఖపట్నం: “ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు.. పానీపూరీ వ్యాపారంతో సక్సెస్ అయ్యా”

  16. కార్తికేయ 2 రివ్యూ: శ్రీకృష్ణుడి కాలి కడియం కథను నమ్ముకున్న నిఖిల్ సీక్వెల్ సినిమా హిట్టవుతుందా?

  17. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు కోవిడ్ పాజిటివ్

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరోసారి కరోనా సోకింది. ఆమెకు జూన్ నెల మొదట్లో కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

    పార్లమెంటు సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియచేశారు.

    ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్ కు అనుగుణంగా ఆమె ఐసోలేషన్ లో ఉంటారని తెలిపారు.

    జూన్‌లో సోనియాకు కరోనా సోకి ఆస్పత్రిలో కూడా చేరాల్సి వచ్చింది.

    ఈ వారంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

    రెండు నెలల వ్యవధిలో ఆమెకు కరోనా రావడం ఇది రెండవ సారి.

    అనారోగ్యం వల్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా గత వారం ఆల్వార్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

  18. భారత్‌లో ఎయిడ్స్ మందుల కొరత

  19. పదో తరగతి చదువుతూనే వ్యాపారవేత్తగా మారిన విద్యార్థి కథ

  20. డార్లింగ్స్: ఈ సినిమా చూశాక భర్తలంతా భార్యను చూసి వణుకుతున్నారా