"భారత్ - చైనాల మధ్య సంబంధాలు సాధారణంగా లేవు" - ఎస్ జైశంకర్
సరిహద్దుల్లో పరిస్థితులు మెరుగుపడకుండా భారత్ -చాలా మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి రావని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఆయన బెంగళూరులో భారత్-చైనా అంశం పై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా సరిహద్దుల్లో శాంతి సామరస్యాలకు భంగం కలిగించాలని చూస్తే, అది ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బ తీస్తుందని అన్నారు.
లైన్ ఆఫ్ కంట్రోల్ కు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి వైదొలగడంలో భారత సేనలు పురోగతి సాధించాయని చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
రెండేళ్ల క్రితం లద్దాఖ్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల తర్వాత భారత్ కుచైనాతో సంబంధాలు దెబ్బ తిన్నాయా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
"నేను 2020, 2021లో ఏమి చెప్పానో, అదే విషయాన్ని 2022లో కూడా చెబుతాను. భారత్ - చైనాల మధ్య సంబంధాలు సాధారణంగా లేవు" అని అన్నారు.