You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. వర్షాలు, వరదలతో పాకిస్తాన్ అతలాకుతలం.. ఆరు వారాల్లో 500 మందికి పైగా మృతి

  2. మహారాష్ట్ర: ఏక్‌నాథ్ షిండే సీఎం అయిన 38 రోజులకు మంత్రివర్గ విస్తరణ

    మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం నేడు మంత్రివర్గాన్ని విస్తరించింది. అందులో భాగంగా 18 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    తొలుత రాధాకృష్ణ విఖే పాటిల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న విఖే పాటిల్, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

    బీజేపీ సీనియర్ నేత సుధీర్ ముంగ్తివార్ మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బల్లార్‌పూర్ నుంచి ఎమ్మెల్యే అయిన ముంగ్తివార్ గత ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.

    బీజేపీ నేతలు చంద్రకాంత్ పాటిల్, గిరీశ్ మహాజన్, శివసేన నేత గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్, మిరాజ్ ఎమ్మెల్యే సురేష్ ఖాడే, సందీపన్ బుమ్రే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

    ప్రభుత్వం ఏర్పాటు చేసిన 38 రోజుల తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది.

    ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో ఒక్క మహిళ కూడా లేరు.

  3. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన చెంచులు, ఆదివాసీలను స్వాతంత్ర్య సమరయోధులుగా ఎందుకు గుర్తించలేదు?

  4. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు.. ‘ఒక బీరువాను బలవంతంగా తెరిచారు’

    ఫ్లోరిడాలోని తన నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు చేసిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తెలిపారు. ఇంట్లోని ఒక బీరువాను కూడా వారు బలవంతంగా తెరిచారని చెప్పారు.

    'పామ్ బీచ్‌లోని నా నివాసం మార్ ఎ లాగోను పెద్ద సంఖ్యలో ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారు' అంటూ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు.

    అధికారిక పత్రాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఎఫ్‌బీఐ ఈ సోదాలు చేసినట్లు చెబుతున్నరు.

    2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయడానికి ట్రంప్ సిద్ధమవుతున్న తరుణంలో ఆయనపై చట్టాన్ని ఉపయోగించడం పెరుగుతోంది.

    సోమవారం ఫ్లోరిడాలో ఈ సోదాలు జరిగే సమయానికి ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఉన్నారని సీబీఎస్ న్యూస్ తెలిపింది.

  5. హర్ ఘర్ తిరంగా: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌కు చెందిన మహిళా సైన్యం ప్రత్యేక గస్తీ

    ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కి చెందిన మహిళా సైన్యం జెండాలు పట్టుకుని 17,000 అడుగుల గస్తీ పూర్తి చేశారు.

    ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఈ ప్రత్యేక గస్తీని నిర్వహించారు.

  6. బిహార్: నేడు నితీశ్ కుమార్ పార్టీ కీలక సమావేశం

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈరోజు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. బీజేపీ, జేడీయూ కుమ్ములాటల నేపథ్యంలో, ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ఇది కాకుండా, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌ కూడా సమావేశం కానున్నాయి

    ఒకవేళ నితీశ్ బీజేపీని వీడితే, మళ్లీ మహాకూటమికి సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ఇదివరకే సూచించాయి.

    ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ కుమార్ గైర్హాజరు కావడం, ఇరు పార్టీల మధ్య సయొధ్య చెడిందనేదానికి సంకేతమని పలువురు భావిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

    కాగా, ఆదివారం నితీశ్ కుమార్ బిహార్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేలు అవసరం. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా, బీజేపీ, జేడీయూ ప్రభుత్వంలో భాగస్వాములు.

    ఎన్డీఏకు మొత్తం 126 + 1 స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉంది.

    ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇటీవల కేసు కారణంగా తన శాసనసభ సభ్యత్వాన్నికోల్పోయారు.

    ఒకవేళ బీజేపీ, జేడీయూ దారులు వేరైతే, ప్రభుత్వంలో కొనసాగేందుకు జేడీయూకి 77 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, బీజేపీకి 45 మంది ఎమ్మెల్యేలు అవసరం.

  7. హిరోషిమా, నాగాసాకి: అణుబాంబు నేలను తాకినప్పుడు ఏం జరిగింది?

  8. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు.. ‘ఒక బీరువాను బలవంతంగా తెరిచారు’

  9. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మొత్తం 61 పతకాలు.. స్వదేశానికి చేరుకున్న క్రీడాకారులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం

    బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వదేశానికి తిరిగొచ్చిన ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది.

    ఆగస్ట్ 8 సోమవారం కామన్వెల్త్ గేమ్స్‌ ముగిశాయి. భారత్ మొత్తం 61 పతకాలు సాధించింది. వాటిలో 22 స్వర్ణం కాగా 16 రజతం, 23 కాంస్య పతకాలు.

    సోమవారం రాత్రి దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న క్రీడాకారులకు ప్రజలు పూల మాలలు వేసి స్వాగతం పలికారు. కొంతమంది ఆటగాళ్లతో సెల్ఫీలు దిగారు.

    కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన సాక్షి మాలిక్‌, కాంస్య పతక విజేత పూజా సిహాగ్‌, పూజా గెహ్లాట్‌ల కోసం ప్రజలు పుష్పగుచ్ఛాలతో నిరీక్షించారు. కొందరు వాళ్ల మెడలో నోట్ల దండ కూడా వేశారు.

    తరువాత, సాక్షి మీడియాతో మాట్లాడుతూ, "స్వర్ణం సాధించిన ఘనత దేశానికే దక్కుతుంది. ఒలింపిక్ తరువాత కామన్వెల్త్‌లో పతకం సాధించడం ఆనందంగా ఉంది" అని అన్నారు.

    పూజా సిహాగ్ తన పతకం క్రెడిట్‌ తన కోచ్‌కే దక్కుతుందని చెప్పారు.

    రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన దిల్లీ రెజ్లర్ దివ్య కక్రాన్‌కు బాజాలు వాయిస్తూ స్వాగతం పలికారు.

    అథ్లెట్లు సందీప్ కుమార్, అల్డోస్ పాల్, అవినాష్ సాబ్లే, అబ్దుల్లా అబూబకర్ కూడా స్వదేశానికి చేరుకున్నారు. 10,000 మీటర్ల రేస్ వాక్‌లో అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్య పతకం సాధించాడు.

    కామన్వెల్ట్ గేమ్స్ చివరి రోజు భారత్ నాలు 4 స్వర్ణాలు సాధించింది. దాంతో, మొత్తం 22 స్వర్ణాలు భారత్ ఖాతాలో పడ్డాయి.

    చివరిరోజు, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ భారత్‌కు స్వర్ణాలు అందించి విజయ పతాక ఎగురవేశారు.

    బ్యాడ్మింటన్‌లోనే పురుషుల డబుల్స్‌లో సాత్విక్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా స్వర్ణం సాధించారు. అలాగే, 16 ఏళ్ల తర్వాత టేబుల్‌ టెన్నిస్‌లో ఆచంట శరత్‌ కమల్‌ సింగిల్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు.

    వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లాన్ బాల్ మొదలుకొని అథ్లెటిక్స్ వరకు భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది.

    బర్మింగ్‌హామ్‌లో భారత్ 22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలతో సహా మొత్తం 61 పతకాలు సాధించింది.

  10. చైనా మా దేశాన్ని ఆక్రమించబోతోంది: తైవాన్ విదేశాంగ మంత్రి

  11. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు ఒప్పుకొన్నారు? ఇప్పుడు ఏం చేస్తారు?

  12. చిరుతలు విదేశాల నుంచి భారత్‌కు వచ్చేస్తున్నాయిలా...

  13. సెక్స్ లైఫ్‌ను ఆసక్తికరంగా మార్చుకునేందుకు 7 చిట్కాలు

  14. ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి

  15. కామన్వెల్త్ గేమ్స్: బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్, టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో ఇండియాకు స్వర్ణాలు

    బ్యాడ్మింటన్‌లో మెన్స్ డబుల్స్ విభాగంలో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జంట స్వర్ణ పతకం గెలుచుకుంది.

    టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్ ఫైనల్స్ లో ఆచంట శరత్ కమల్ గోల్డ్ సాధించారు.

  16. వారెన్ బఫెట్, రాకేశ్ ఝుంఝున్‌వాలా ఎలా స్టాక్ మార్కెట్స్‌లో కోట్లు సంపాదించారు?

  17. కామన్వెల్త్ గేమ్స్: బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం

    కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో భారత్ ‌కు చెందిన లక్ష్యా సేన్ స్వర్ణపతకం సాధించారు.

    మలేషియాకు చెందిన ఎన్జీ జే యాంగ్ పై లక్ష్యా సేన్ 19-21, 21-9, 21-16 స్కోరుతో విజయం సాధించారు.

    ఈ స్వర్ణ పతకంలో భారత్ బంగారు పతకాల సంఖ్య 20కి చేరింది.

  18. మిమ్మల్ని దోమ కుట్టిందంటే.. అది కచ్చితంగా ఆడదోమే..ఎందుకు ఆడదోమలే రక్తం పీలుస్తాయి?

  19. పాప్ స్మియర్: లక్షలాది మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడే ఈ టెస్ట్ వెనుక ప్రేమ కథ మీకు తెలుసా?

    "అమెరికన్ మహిళల ఆరోగ్యానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల స్వస్థతకు సహకరించే ఈ శతాబ్దపు అతిగొప్ప ఆవిష్కరణ ఇది. మన కాలంలో క్యాన్సర్‌ను నిరోధించేందుకు అత్యంత ముఖ్యమైన, ఆచరణాత్మకమైన, ఉపయోగకరమైన ఆవిష్కరణ."

    1957లో అమెరికాలోని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ వుమెన్స్ క్లబ్స్ ప్రత్యేక సమావేశంలో చెప్పిన మాటలవి. పాప్ స్మియర్ పరీక్షను అభివృద్ధి చేసిన డాక్టర్ జార్జ్ పాపానికోలౌ గౌరవార్థం ఏర్పాటు చేసిన సమావేశం అది. ఆయన పేరు మీదే ఈ టెస్ట్ ఉనికిలోకి వచ్చింది.

    గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు చికిత్స పొందిన మహిళగా, ఈ టెస్ట్ వెనుక కథ తెలుసుకోవాలనుకున్నా.

    దీని వెనుక పెద్ద కథే ఉంది. గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఉపయోగపడే పాప్ స్మియర్ టెస్ట్ ప్రపంచం అంగీకారం పొందేందుకు చాలా సమయం పట్టింది.

  20. బ్రేకింగ్ న్యూస్, కామన్వెల్త్ గేమ్స్‌:మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌లకు స్వర్ణాలు

    కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్స్‌లో కెనడాకు చెందిన మిచెల్ లీని 21-15, 21-13తో స్కోరుతో ఓడించింది.

    ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు కనిపించలేదు. ఎడమకాలికి పట్టీ ఉంది. గేమ్ ప్రారంభంలో సింధు కాస్త తడబడినట్టు అనిపించినా, ఆమె అనుభవం ఆమెకు ఉపయోగపడింది. మళ్లీ గేమ్‌లోకి దూసుకొచ్చింది.

    కామన్వెల్త్ గేమ్స్‌లో సింధుకి ఇదే తొలి స్వర్ణం. 2018లో గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు రజతం సాధించింది. కానీ, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం సాధించింది. అందులో సింధు భాగం పంచుకున్నారు.

    2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు కాంస్య పతకాన్ని అందుకుంది.

    మెన్స్ సింగిల్స్ లోనూ భారత్‌కు స్వర్ణం

    మరోవైపు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత్ ‌కు చెందిన లక్ష్య సేన్ స్వర్ణపతకం సాధించారు.

    మలేషియాకు చెందిన ఎన్జీ జే యాంగ్ పై లక్ష్యా సేన్ 19-21, 21-9, 21-16 స్కోరుతో విజయం సాధించారు.

    ఈ స్వర్ణ పతకంలో భారత్ బంగారు పతకాల సంఖ్య 20కి చేరింది.