You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

SCO సదస్సు: భారత్-రష్యా సంబంధాల బలోపేతంపై పుతిన్‌తో చర్చించిన ప్రధాని మోదీ

ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సమర్‌కండ్ చేరుకున్నారు. ఆయనకు భారత దౌత్యాధికారులు స్వాగతం పలికారు.

లైవ్ కవరేజీ

  1. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారత్ విజయం.. టీ20 సిరీస్ కైవసం

    ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ చేజిక్కించుకుంది.

    కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.

    187 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    భారత్ జట్టులో సూర్య కుమార్ యాదవ్ 69, విరాట్ కోహ్లీ 63 పరుగులు సాధించారు.

    అంతకుముందు భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, చాహల్, హర్షల్ పటేల్‌లు తలో వికెట్ తీశారు.

    ఈ మ్యాచ్‌ విజయంతో భారత్ 2-1తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.

  2. అటార్నీ జనరల్ పదవి చేపట్టలేను.. నా పేరు పరిగణనలోకి తీసుకున్నందుకు కేంద్రానికి కృతజ్ఙతలు: ముకుల్ రోహత్గీ

    అటార్నీ జనరల్ పదవి చేపట్టేందుకు తాను సుముఖంగా లేనని సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గా చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. ‘‘కేంద్రం నా ముందు ఉంచిన ప్రతిపాదనకు నేను అంగీకరించడం లేదు. ఈ పదవికి నా పేరు పరిగణనలోకి తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ప్రస్తుతం ఈ పదవి నేను చేపట్టలేను. నా నిస్సహాయతను నేను కేంద్రానికి తెలిపాను’’ అని రోహత్గీ చెప్పారు.

  3. రోగులకు ఉండే 17 రకాల హక్కులేమిటో తెలుసా

  4. యుక్రెయిన్ యుద్ధం: రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగిస్తుందా

  5. అక్టోబరు 16న సీపీసీ సమావేశం... అధ్యక్షునిగా మూడోసారి షీ జిన్ పింగ్?

    అక్టోబరు 16న జరగనున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) సమావేశానికి హాజరయ్యే ప్రతినిధుల ఎన్నిక పూర్తి అయిందని ఆ పార్టీ తెలిపింది.

    ఈ 20వ సమావేశానికి మొత్తం 2,296 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరంతా కలిసి చైనా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

    ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మూడోవసారి ఆ పదవికి ఎన్నిక అయ్యే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు.

    చైనా కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయని, షీ జిన్‌పింగ్‌ను ఇంటిలో నిర్బంధించారనే ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే.

    అయితే ‘సోషలిజం మీద జిన్ పింగ్ ఆలోచనలకు అనుగుణంగానే’ ప్రతినిధుల ఎంపిక జరిగినట్లు పార్టీ ప్రకటించింది.

  6. అఫ్టానిస్తాన్ నుంచి భారత్‌కు 55 మంది సిక్కులు

    అఫ్గానిస్తాన్ నుంచి 55 మంది సిక్కులు భారత్‌కు వచ్చారు.

    కాబుల్ నుంచి బయలు దేరిన ప్రత్యేక విమానం కొద్ది సేపటి కిందట దిల్లీలో ల్యాండ్ అయింది.

    ఇతర దేశాల్లో అణచివేతను ఎదుర్కొంటున్న భారత సంతతి మైనారిటీలను తీసుకురావలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా వీరంతా ఇక్కడకు చేరుకున్నారు.

    ఇందుకోసం అమృత్‌సర్‌లోని శిరోమణి గురుద్వారా ప్రబందక్ కమిటీ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.

    కాబుల్‌లోని గురుద్వారా కర్తే పర్వాన్ మీద దాడి జరిగిన తరువాత ఇప్పటి వరకు సుమారు 68 మంది సిక్కులు, హిందువులు భారత్‌కు చేరుకున్నారు.

  7. డయేరియాతో బాధ పడుతున్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు?

  8. 'కుక్కల కంటే హీనంగా చూశారు'... రష్యా విడుదల చేసిన బ్రిటన్ ఖైదీ

  9. ఒలింపిక్స్‌లో పాల్గొంటానంటున్న భారతీయ బ్రేక్ డాన్సర్

  10. ఐరాస జనరల్ అసెంబ్లీ: చైనా, పాకిస్తాన్‌ల పేరెత్తకుండానే విమర్శలు చేసిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్

  11. హీరోయిన్లు, అందగత్తెలు తాగే బ్లాక్‌వాటర్ అంటే ఏంటి?

  12. "2025 నాటికి భారత్‌లో క్షయ అంతం" - మన్ కీ బాత్‌' లో మోదీ

    ప్రజల సహకారంతో భారత్ 2025 నాటికి క్షయ వ్యాధికి అంతం పలుకుతుందని ప్రధాని మోదీ తన 'మన్ కీ బాత్' లో ప్రకటించారు.

    2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా చెబుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా చిరుధాన్యాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారని అన్నారు. చిరుధాన్యాలకు సంబంధించిన ఈ-బుక్ లేదా పబ్లిక్ ఎన్ సైక్లోపీడియాను తయారు చేయమని సూచించారు.

    పాలిథీన్ వాడకాన్ని తగ్గించి సహజసిద్ధ పదార్ధాలతో తయారు చేసిన సంచులను వాడమని సూచించారు.

    గాంధీ జయంతిని పురస్కరించుకుని "వోకల్ ఫర్ లోకల్" (స్థానిక ఉత్పత్తుల ప్రచారం) ప్రచారాన్ని పెంచేందుకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

    మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగా పని చేస్తుందని ప్రపంచం గుర్తించిందని అన్నారు.

    భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా చీతాలకు, వాటి ప్రచారానికి పేర్లను సూచించమని ప్రజలను కోరారు.

    మరొక ముఖ్యమైన ప్రకటన చేస్తూ చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ ఎయిర్ పోర్టుగా పేరును పెడుతున్నట్లు ప్రకటించారు.

    "సెప్టెంబరు 28న భగత్ సింగ్ జన్మదినోత్సవానికి ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఆయనకు అర్పిస్తున్న నివాళి" అని అన్నారు.

    "ప్రాంతాలు, సంస్థలు, నిర్మాణాలకు అమరుల పేర్లను పెట్టడం ద్వారా ప్రజలను కర్తవ్యం నిర్వహించేలా చేసేందుకు స్ఫూర్తిని కలిగిస్తాయి. కొన్ని రోజుల క్రితమే, దిల్లీలోని కర్తవ్య పథ్ లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు.

  13. భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించిన ఈ అవుట్‌ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఎందుకు రెండుగా చీల్చింది?

  14. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  15. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారత్ విజయం.. టీ20 సిరీస్ కైవసం

  16. మంచి ఉద్యోగం పేరుతో తీసుకెళతారు, సరిగా పని చేయకపోతే అమ్మేసుకుంటారు

  17. ‘ప్రపంచంలో అత్యంత విశాల హృదయం భారత్‌దే’, ఐరాసలో భారత విదేశీ వ్యవహారాల మంత్రితో చెప్పిన మరో దేశ ఫారిన్ మినిష్టర్

    భారతదేశం గత 75 ఏళ్లలో ఆర్థికంగా ఎదిగిన తీరును విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ యూఎన్ జనరల్ అసెంబ్లీలో వివరించారు. సర్వసభ్య సమావేశంలో ఇండియా@75 కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కోవిడ్ సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాక్సీన్లు సరఫరా చేసిన విషయాన్నీ ప్రస్తావించారు.

    ఈ కార్యక్రమంలో ఇతర దేశాల విదేశాంగ మంత్రులు భారత్‌ను ప్రశంసించారని చెప్పారు.

    ‘‘ఇండియా@75 కార్యక్రమంలో ఓ విదేశాంగ మైత్రి వ్యాక్సీన్ మైత్రి గురించి చెప్పారు. మరో విదేశాంగ మంత్రి అయితే.. ఆర్థిక వ్యవస్థల పరంగా భారత్‌ది ప్రపంచంలో అయిదో స్థానం కావొచ్చు కానీ.. అత్యంత విశాల హృదయం ఉన్న దేశం మాత్రం భారతే’ అన్నారు అంటూ ట్వీట్ చేశారు.

  18. ఒకే అడ్రస్‌కు క్యూ కట్టిన క్యాబ్‌లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..

  19. కశ్మీర్‌: 33 ఏళ్ల తర్వాత తిరిగి మొదలైన సూఫీల సంప్రదాయ ‘పడవల యాత్ర’

  20. Shehbaz Sharif: భారత్‌లోని ముస్లింలపై పాకిస్తాన్ ప్రధాని ఐక్యరాజ్య సమితిలో ఏమన్నారు? భారత్ ఏమని సమాధానం ఇచ్చింది?