You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
SCO సదస్సు: భారత్-రష్యా సంబంధాల బలోపేతంపై పుతిన్‌తో చర్చించిన ప్రధాని మోదీ
ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సమర్‌కండ్ చేరుకున్నారు. ఆయనకు భారత దౌత్యాధికారులు స్వాగతం పలికారు.
లైవ్ కవరేజీ
విమెన్ టీ20 ఆసియాకప్‌కు ఎంపికైన తెలుగు అమ్మాయి
విమెన్ టీ20 ఆసియా కప్‌కు టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన సబ్బినేని మేఘన తుది జట్టులో స్థానం దక్కించుకుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధన(వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగ్యూస్, సబ్బినేని మేఘన, రీచ ఘోష్(వికెట్ కీపర్), స్నేహ రాణ, దయాలన్ హేమలత, మేఘన సింగ్, రేణుక ఠాకుర్, పూజ వస్త్రకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధ యాదవ్, కేపీ నవ్గిరే
స్టాండ్ బై ప్లేయర్స్: తానియా సప్న భాటియా, సిమ్రన్ దిల్ బహుదూర్
కాకినాడ: ‘గర్బిణి అని నమ్మించారు, తొమ్మిది నెలల తర్వాత డెలివరీకి వెళితే గర్భంలో శిశువు లేదన్నారు’.. ప్రైవేటు ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు
‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
పుతిన్: ‘అణ్వాయుధాలు చూపి మమ్మల్ని భయపెడుతున్నారు... మా వద్దా తగిన ఆయుధాలున్నాయి’
రష్యా సైన్యంలోకి 3 లక్షల మంది ‘రిజర్విస్టు’లను తిరిగి పిలవనున్నట్లు ఆ దేశ రక్షణశాఖ మంత్రి తెలిపారు.
గతంలో సైన్యంలో పని చేసి ప్రస్తుతం పౌర జీవితంలో ఉన్నవారిని ‘రిజర్విస్టులు’ అంటారు.
వీరి సేవలు యుక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించుకోనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
యుక్రెయిన్‌లోని దోన్బస్ రీజియన్‌లో గల తమవారిని రక్షించుకోవడం రష్యా బాధ్యతని పుతిన్ అన్నారు.
అలాగే దేశంలో ఆయుధాల ఉత్పత్తిని పెంచేందుకు నిధుల కేటాయింపును పెంచారు.
యుక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలోని గల భూభాగాల్లోని ప్రజలు ‘నియో నాజీల పాలనలో ఉండాలని కోరుకోవడం లేదు’ అని పుతిన్ అన్నట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
పశ్చిమ దేశాలను తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని పుతిన్ అన్నారు. కానీ ఆ బెదిరింపులను ఎదుర్కొనే ఆయుధ సంపత్తి తమ వద్ద ఉందని స్పష్టం చేశారు.
అణ్వాయుధాలను చూపిస్తూ తమను పశ్చిమ దేశాలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని, అయితే వారికి సమాధానం చెప్పడానికి ‘మా వద్ద చాలా ఆయుధాలున్నాయి’ అని ఆయన హెచ్చరించారు.
నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని తాజాగా టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్ వ్యాఖ్యానించారు.
ఇంతలో పుతిన్ యుక్రెయిన్‌కు అదనంగా బలగాలు పంపుతున్నట్లు ప్రకటించారు.
అన్నం, చపాతి తినకూడదంటే ఏం తినాలి, పిండిపదార్థాలతో ఆరోగ్యానికి ప్రమాదమా
బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ మృతి
బాలీవుడ్ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ(58) చనిపోయారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
1980ల నుంచి రాజు శ్రీవాస్తవ సినిమాల్లో నటిస్తున్నారు. 2005లో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్’తో ఆయనకు బాగా పేరు వచ్చింది.
ఆయన ఉత్తర్ ప్రదేశ్ ఫిలిం డెవల్మెంట్ కౌన్సిల్ చైర్మన్‌గా కూడా పని చేశారు.
‘బాజీగర్’, ‘మైనే ప్యార్ కియా’ వంటి సినిమాల్లో ఆయన నటించారు.
రాజు శ్రీవాస్తవ మృతి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విచారం వ్యక్తం చేశారు.
సౌత్ ఇండియాతో నార్త్ ఇండియా అభివృద్ధిలో పోటీ పడలేకపోతుందా
‘ఆ సినిమా హిందూ దేవతలను కించపరిచేలా ఉంది... బ్యాన్ చేయండి’
అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘థ్యాంక్ గాడ్’ సినిమా చుట్టూ వివాదం అలుముకుంటోంది.
ఈ సినిమాలో హిందూ దేవతలను కించపరిచేలా చూపించారని, అందువల్ల ఆ సినిమాను బ్యాన్ చేయాలంటూ మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్‌కు లేఖ రాశారు.
‘థ్యాంక్ గాడ్’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ చిత్రగుప్తునిగా నటించారు.
ప్రధాని మోదీని ప్రశంసించిన మేక్రాన్
‘ఇది యుద్ధాలు చేయడానికి సరైన సమయం కాదు’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అన్నారు.
ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల మీద మేక్రాన్ ఇలా స్పందించారు.
‘ఇది యుద్ధాలు చేసే శకం కాదు. దీని గురించి మీతో ఫోనులో కూడా మాట్లాడాను. శాంతి కోసం మనం ముందుకు ఎలా వెళ్లాలో మాట్లాడుకునేందుకు ఈ రోజు అవకాశం లభించింది. కొన్ని దశాబ్దాలు భారత్, రష్యా కలిసిమెలిసి ముందుకు సాగుతున్నాయి’ అని మోదీ ఎస్‌సీఓ సమిట్ సందర్భంగా అన్నారు.
నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను అమెరికా కూడా ఆహ్వానించింది.
వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు - ఎన్నికల సంఘం
యుక్రెయిన్‌లో శ్రీలంక తమిళులపై చిత్రహింసలు: కాలి వేళ్ల గోళ్లు పీకేశారు, కడుపులో పిడిగుద్దులు గుద్దారు
ఆస్కార్స్ 2023: ఆర్ఆర్ఆర్‌కు నిరాశ.. భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’
2023వ సంవత్సరానికి గాను ఆస్కార్స్ బరిలో భారతదేశం తరపునుంచి గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ పోటీపడుతోంది.
ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుందని పీటీఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
95వ అకాడెమీ అవార్డులకు భారత్ నుంచి తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ బరిలో నిలుస్తుందని ప్రచారం జరిగింది. రాజమౌళి తీసిన ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఛెల్లో షో అంటే చివరి సినిమా షో అని అర్థం. పాన్ నలిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీన అకాడెమీ అవార్డు విజేతల పేర్లను ప్రకటిస్తారు. 2023 మార్చి 12వ తేదీన లాస్ ఏంజెలెస్‌లో 95వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.
యుక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత భూభాగాల్లో రెఫరెండం
తూర్పు యుక్రెయిన్‌లోని లుహాన్స్‌క్‌లో రష్యా అధికారులు ప్రజాభిప్రాయసేకరణ చేపడుతున్నారు.
శుక్రవారం ఓటింగ్ మొదలు కానుంది. రష్యా బలగాలు ఆక్రమించుకున్న యుక్రెయిన్ భూభాగాలను రష్యాలో కలపడం మీద రెఫరెండం చేపట్టనున్నారు.
దొనెత్స్‌క్, ఖేర్సన్‌లోనూ ఇలాగే రెఫరెండం చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా అధీనంలో ఉన్న ఈ ప్రాంతాల్లో త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామంటూ రష్యా అపాయింట్ చేసిన అధికారులు తెలిపారు.
తమ స్వీయ రక్షణ కోసం ఇది అవసరమని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదెవ్ చెప్పారు.
అయితే తమ భూభాగాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని యుక్రెయిన్ తెలిపింది.
యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారు: టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్
చైనా, యూరప్, అమెరికాలో దుర్భిక్షం: 2022 చరిత్రలో అత్యంత కరవు సంవత్సరమా?
బీబీసీ తెలుగు కార్టూన్
ముంబయి ఐఐటీ: అమ్మాయిల స్నానపు గదుల్లోకి తొంగి చూసిన క్యాంటీన్ ఉద్యోగి అరెస్టు.
ఐఐటీ ముంబయిలోని ఒక హాస్టల్ లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా దొంగచాటుగా చూసేందుకు ప్రయత్నించిన 22 ఏళ్ల క్యాంటీన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.
అమ్మాయిలను చూసేందుకు పైపు ద్వారా గోడ పైకి చేరినట్లు పోలీసులు తెలిపారు. నిందితుని పై ఐపీసీ లోని సెక్షన్ 354 కింద కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు.
బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తారు.
అమ్మాయిల భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.
క్రికెట్ రూల్స్ మార్చిన ఐసీసీ.. ఈ 8 కొత్త నిబంధనలతో లాభం బౌలర్‌కా లేక బ్యాటర్‌కా?
"తల పై పైట కప్పుకోవడం, హిజాబ్ ఒకటే" - కర్ణాటక జనతా దళ్ (ఎస్) అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తల పై పైట కప్పుకునేవారు. భారత రాష్ట్రపతి కూడా పైట కప్పుకుంటారు. ఇది భారతీయ సంస్కృతి.
"గూంఘట్" (తలను కొంగుతో కప్పుకోవడం) పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) చేస్తున్న కుట్రా? హిజాబ్ అయినా, పైట అయినా ఒకటే" అని కర్ణాటక జనతా దళ్ (ఎస్) అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం అన్నారు.
కర్ణాటకలో విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడం పై నిషేధాన్ని సమర్ధిస్తూ కర్ణాటక హై కోర్టు తీర్పు నిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ముస్లిం విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ మంగళవారం ఈ కేసు విచారణను చేపట్టింది.
విద్యాసంస్థలు విడుదల చేసిన సర్క్యులర్ మతపరమైన తటస్థతతో కూడుకుని ఉందని కర్ణాటక ప్రభుత్వం తరుపున వాదిస్తున్న సాలిసిటర్ జనరల్ ఎస్ జీ మెహతా అన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థులందరూ ఒకే రకమైన యూనిఫామ్ ధరించడాన్ని అమలు చేయాలని అన్నారు.
ఈ విచారణను సుప్రీం కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.