You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

SCO సదస్సు: భారత్-రష్యా సంబంధాల బలోపేతంపై పుతిన్‌తో చర్చించిన ప్రధాని మోదీ

ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సమర్‌కండ్ చేరుకున్నారు. ఆయనకు భారత దౌత్యాధికారులు స్వాగతం పలికారు.

లైవ్ కవరేజీ

  1. ఖర్జూరం సాగు: ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడి’

  2. రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: రూ.25 కోట్ల నకిలీ నోట్లు.. అన్నీ 2000 రూపాయల నోట్లే..

  3. 'ఈరోజు శానిటరీ ప్యాడ్స్ అడుగుతారు.. రేపు కండోమ్స్ అడుగుతారు' అన్న వ్యాఖ్యలపై బిహార్ ఐఏఎస్ ఆఫీసర్ విచారం

  4. యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం.. అధికారిక పత్రాలపై సంతకం చేసిన పుతిన్

    యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం కాబోతున్న సందర్భంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు మాస్కోలోని క్రెమ్లిన్‌లో ప్రసగించారు.

    "రష్యాలో విలీనం చేయాలనుకున్న నాలుగు ప్రాంతాల ప్రజలు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఫలితాలు అందరికీ బాగా తెలుసు. ప్రజలు తమ ఉద్దేశాన్ని, కోరికను తెలియజెప్పారు" అని పుతిన్ అన్నారు.

    యుక్రెయిన్‌లోని దోన్యస్క్, లుహాస్క్, ఖేర్సన్, జపోరిజ్జియాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ నాలుగు ప్రాంతాల ప్రజలు రష్యాలో విలీనం కావాలనుకుంటునట్లు ఫలితాలలో తేలింది.

    "రిఫరెండం అక్రమమని పశ్చిమ దేశాలు గగ్గోలు పెట్టాయి. కానీ, ఫలితాలు లక్షలాది ప్రజల సంకల్పాన్ని తెలియజేస్తున్నాయి" అని పుతిన్ అన్నారు. ఈ ప్రాంతాలలో రష్యా పునర్నిర్మాణాలు చేపడుతుందని, వాటిని అభివృద్ధిపరుస్తుందని ఆయన అన్నారు.

    "రష్యాలో విలీనం కాబోతున్న నాలుగు కొత్త ప్రాంతాలకు ఫెడరల్ అసెంబ్లీ మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇది కొన్ని లక్షల మంది ప్రజల కోరిక. ఫలితాలు ప్రజల నిజమైన హక్కును తెలియజేస్తున్నాయి" అంటూ పుతిన్ ప్రసంగించారు.

    ప్రసంగం తరువాత, పుతిన్ సహా నాలుగు కొత్త ప్రాంతాలకు నియమించిన రష్యన్ నాయకులు అధికారిక పత్రాలపై సంతకం చేశారు.

    కాగా, పుతిన్ పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా నిరాధారమైన వాదనలు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా "హైబ్రిడ్ వార్" చేస్తున్నాయని, దాన్ని వలస రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్టు పుతిన్ ఆరోపించారు.

    అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడానికి రష్యా కారణం కాదని పుతిన్ అన్నారు. "అనేక సంవత్సరాల తప్పుడు విధానాల ఫలితమిది" అని అన్నారు.

  5. మాగ్నస్ కార్ల్‌సన్-హాన్స్ నీమాన్: 19 ఏళ్ల కుర్రాడిపై చెస్ ప్రపంచ చాంపియన్ ఆరోపణలు ఎందుకు?

  6. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?

  7. ఆంధ్రప్రదేశ్‌లో 'పేదలందరికీ ఇళ్లు' నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?

  8. పొన్నియ‌న్ సెల్వ‌న్ 1 రివ్యూ: మ‌ణిర‌త్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?

  9. దేశద్రోహం కేసులో జేఎన్‌యూ విద్యార్థి షార్జీల్ ఇమామ్‌కు బెయిల్, సుచిత్ర మొహంతి, బీబీసీ హిందీ కోసం

    2019 నాటి దేశద్రోహం కేసులో జేఎన్‌యూ విద్యార్థి షార్జీల్ ఇమామ్‌కు శుక్రవారం దిల్లీ సాకేత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేశారని, ఫలితంగా జామియానగర్‌లో హింస చెలరేగిందని ఆరోపిస్తూ ఆయనపై ఈ కేసు నమోదైంది.

    షార్జీల్‌కు అదనపు సెషన్స్ జడ్జి అనుజ్ అగర్వాల్, బెయిల్ మంజూరు చేశారు. అయినప్పటికీ ఆయన ఇప్పుడు జైలు నుంచి బయటకు రాలేరు.

    దిల్లీ అల్లర్లకు సంబంధించిన ఆయనపై నమోదైన ఇతర కేసులు పెండింగ్‌లో ఉండటమే ఇందుకు కారణం. 2020 దిల్లీ అల్లర్లలో యూఏపీఏ కింద సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అల్లర్ల వెనుక కుట్రలో ఆయన హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి.

    2019 డిసెంబర్నాటి కేసులో షార్జీల్‌కు ఇప్పుడు బెయిల్ లభించింది.

  10. సైనికుల భార్యలను అవమానించేలా అభ్యంతరకర దృశ్యాలు.. ఏక్తా కపూర్‌పై అరెస్ట్ వారెంట్

  11. ‘పస్తులైనా ఉందాం ఆ పనికి మాత్రం వెళ్లొద్దని కాళ్ల మీద పడ్డాం.. ఇప్పుడు మాకెవరు దిక్కు’

  12. భారత్ జోడో యాత్ర: కర్ణాటకలో రాహుల్ గాంధీకి స్వాగతం

    కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర నేడు కర్ణాటకకు చేరింది.

    అక్కడ రాహుల్ గాంధీకి, ఆయనతో పాటు యాత్ర చేస్తోన్న వారికి స్వాగతం లభించింది. చామరాజనగర్‌లోని ఊటీ-కాలికట్ జంక్షన్ నుంచి కర్ణాటకలో యాత్ర కొనసాగనుంది.

    గురువారంతో కేరళలో రాహుల్ యాత్ర ముగిసింది. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇప్పటివరకు 532 కి.మీ పాదయాత్ర చేశారు. ఇంకా 3,038 కి.మీ చేయాల్సి ఉంది.

  13. యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం.. అధికారిక పత్రాలపై సంతకం చేసిన పుతిన్

  14. ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడులు’ - ఖర్జూరం పండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతులు

  15. Gas flaring: చమురు వెలికితీసే సంస్థలు గ్యాస్‌కు మంట పెడుతున్నాయి ఎందుకు

  16. జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

    36వ జాతీయ క్రీడలు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి.

    దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ ఆరంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రీడలను ప్రారంభించినట్లు ప్రకటించారు.

    సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు గుజరాత్‌లోని ఆరు నగరాల్లో వీటిని నిర్వహిస్తారు.

    దాదాపు 7 వేల మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. మొత్తం 36 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి.

    రెండేళ్లకు ఒకసారి జాతీయ క్రీడలు జరుగుతాయి.

    చివరిసారిగా 2015లో కేరళలో ఈ క్రీడలను నిర్వహించారు.

  17. ఈ నగలు ఇంత చౌకగా ఎందుకు అమ్ముతారో తెలుసా?

  18. 2023 అక్టోబర్ నుంచి కార్లలో 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి

    ప్రయాణీకుల కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

    2023 అక్టోబర్ 1నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు.

    ప్రజలందరి భద్రతే తమకు ప్రాధాన్యం అని గడ్కారీ అన్నారు.

    వాహనాల ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా 2023 అక్టోబర్ నుంచి ప్యాసింజర్ కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

  19. కొడుకు కళ్ల ముందే తిరుగుతున్నాడు, కానీ బతికి ఉన్నట్లు సర్టిఫికెట్ లేదు, మరి ఆ తల్లి ఏం చేసింది?

  20. లాటరీకి భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆమోదం, కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఎందుకు