You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
SCO సదస్సు: భారత్-రష్యా సంబంధాల బలోపేతంపై పుతిన్‌తో చర్చించిన ప్రధాని మోదీ
ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సమర్‌కండ్ చేరుకున్నారు. ఆయనకు భారత దౌత్యాధికారులు స్వాగతం పలికారు.
లైవ్ కవరేజీ
INd vs SA: రాహుల్, సూర్యకుమార్ అర్ధసెంచరీలు.. తొలి టీ20లో దక్షిణాఫ్రికాపై 8 వికెట్లతో భారత్ గెలుపు
PFI: ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ను నిషేధించిన కేంద్రం
‘ఖలిస్థాన్ రిఫరెండం’ ఎంత తీవ్రమైనది? కెనడాలో స్థిరపడిన భారతీయులు ఏమంటున్నారు
కౌన్ బనేగా కరోడ్‌పతి: మొట్టమొదట కోటి రూపాయలు గెలిచిన వ్యక్తి ఎవరు... ఇప్పుడు ఏం చేస్తున్నారు
‘ఆయుధాలు కొనడమనేది పూర్తిగా మా ఇష్టం’
ఆయుధాలు కొనడమనేది పూర్తిగా భారత ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ మంత్ర ఎస్.జైశంకర్ అన్నారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అమెరికా, భారత్ బంధాల బలోపేతానికి కలిసి పని చేస్తామని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంలో ఎదుర్కోవడంలో అమెరికా నుంచి భారత్‌కు మంచి మద్దతు లభించందని అందుకు ధన్యవాదాలు తెలిపారు.
నటి ఆశాపరేఖ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
Mushroom Farming: ‘తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే చేసుకునే బిజినెస్ ఇది, ఆదాయానికి ఢోకా లేదు’
మేడిన్ ఇండియా ఐఫోన్లు: చైనా నుంచి భారత్‌కు మారిన కొత్త ఐఫోన్ల తయారీ.. యాపిల్ ప్రకటన
గుజరాత్: ఆవులను ప్రభుత్వ కార్యాలయాల్లోకి తోలుతున్నారు.. వాటి మూత్రం, పేడను ఆఫీసుల్లో వేస్తున్నారు.. ఎందుకు?
షింజో అబే అంత్యక్రియలకు హాజరైన మోదీ.. అధికారికంగా అంత్యక్రియలను జపాన్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
మన జీవితం వేరొకరి గేమ్‌లో భాగమా, ఆ గేమ్‌ను మనం ఎప్పటికీ ఆపలేమా?
ఎడ్వర్డ్ స్నోడెన్: అమెరికా నిఘా రహస్యాలు బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగికి రష్యా పౌరసత్వం – ఎవరీ స్నోడెన్?
జపాన్: షింజో అబే అంత్యక్రియలకు హాజరైన ప్రధాని మోదీ
ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజోఅబే అంత్యక్రియల్లో పాల్గొనటానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యో చేరుకున్నారు.
షింజో అబేకు నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ ఫొటోను విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్విటర్‌లో షేర్ చేశారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్, ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రులు టోనీ అబాట్, జాన్ హోవార్డ్, మాల్కమ్ టర్న్‌బుల్, ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని ఆంథొని అల్బనీస్ సహా వివిధ దేశాల నేతలు కూడా షింజో అబే అంత్యక్రియలకు హాజరయ్యారు.
‘నాన్న వదిలేశాడు. మా అమ్మ లివర్ ఫెయిల్ కావడంతో నాది డొనేట్ చేశాను. కానీ, మా అమ్మ.. ’
రష్యాలో దారుణం: స్కూలులో దుండగుడి కాల్పులు 11 మంది చిన్నారులు సహా 17 మంది మృతి
రష్యాలోని ఒక స్కూలులో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపిన దారుణంలో 11 మంది చిన్నారులు సహా 17 మంది చనిపోయారు. మరో 24 మంది గాయపడ్డారని రష్యా అధికారులు చెప్పారు.
ఇజెవెస్క్ నగరంలోని స్కూలులో ఈ దారుణం చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన దుండగుడు స్కూలు మాజీ విద్యార్థి అని, ఘటనా స్థలంలోనే అతడు కూడా తుపాకీతో కాల్చుకుని చనిపోయాడని తెలిపారు.
కాల్పులు జరిగిన స్కూలులో విద్యార్థులు భయభ్రాంతులై ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న వీడియో దృశ్యాలు ఆన్‌లైన్‌లో పోస్టయ్యాయి.
కొన్ని వీడియోల్లో తరగతి గదిలో నేల మీద రక్తం, కిటికీకి బులెట్ వల్ల ఏర్పడిన రంధ్రం, బల్లల కింద దాక్కుని ఉన్న పిల్లలు కనిపిస్తున్నారు.
ఈ దారుణంలో 11 మంది చిన్నారులు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు టీచర్లు సహా 17 మంది చనిపోయినట్లు రష్యా దర్యాప్తు సంస్థ చెప్పింది. గాయపడిన 24 మందిలో ఇద్దరు మినహా మిగతా అందరూ చిన్నారులే.
సీనియర్ నటి ఆశా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్
ప్రముఖ నటి ఆశాపరేఖ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ విషయాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా కూడా ఆమె కళారంగానికి సేవలందించారు.
1942లో గుజరాత్ లో జన్మించిన ఆశా పరేఖ్ హిందీ సినిమాలలో తనదైన ముద్ర వేశారు.
పదేళ్ల వయసు నుంచే బాల నటిగా కెరీర్ ప్రారంభించిన ఆశా, 1960,70 ల నాటికి కెరియర్‌లో అత్యుతన్న దశను చూశారు.
1992లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.
సుప్రీంకోర్టు విచారణలు లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం
సుప్రీంకోర్టులో విచారణలు ఇవాళ్టి నుంచి లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. రాజ్యాంగ ధర్మాసనంలో జరగనున్న విచారణకు సంబంధించిన ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి.
ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కోసం వెబ్‌సైట్, యూట్యూబ్‌లను సుప్రీంకోర్టు ఉపయోగిస్తుంది.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, మహారాష్ట్రలో శివసేన వివాదం సహా అనేక ఇతర అంశాలు రాజ్యాంగ ధర్మాసనంలో మంగళవారం నాడు విచారణకు వస్తున్నాయి.
రాజ్యాంగ ధర్మాసనం విచారణలకు సంబంధించి మూడు కోర్టుల నుంచి ప్రత్యేక వెబ్‌కాస్ట్ ఉంటుంది.
దీని బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించారు. ఆన్‌లైన్ విచారణను చూడటానికి https://webcast.gov.in/scindia/ ని సందర్శించవచ్చు.
NICకి చెందిన YouTube చానెల్‌లలో కూడా ఈ విచారణలను చూడవచ్చు.
కరోనా సమయం నుండి ఆన్‌లైన్ ప్రయత్నాలు
కరోనా మహమ్మారి తర్వాత సుప్రీంకోర్టు పిటిషన్ల కోసం ఇ-ఫైలింగ్‌ను ప్రారంభించింది. ఈ-ఫైలింగ్‌ను రోజులో 24 గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు.
అలాగే సుప్రీంకోర్టుకు చెల్లించాల్సిన ఫీజులను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో పోలీసు, ఏటీఎస్ సోదాలు.. పీఎఫ్ఐ అనుమానితుల అరెస్టులు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసు విభాగాలు, వాటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మీద సోదాలు నిర్వహిస్తున్నాయి.
ఏఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, దిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో పలుచోట్ల పెద్ద ఎత్తున అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారు.
దిల్లీలోని నిజాముద్దీన్, షాహీన్ బాగ్ సహా రాజధానిలోని పలు ప్రాంతాల నుంచి 30 మందిని అరెస్ట్ చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.
ఔరంగాబాద్‌లో 13 మందిని, మాలెగావ్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతోందని మహారాష్ట్ర ఏటీఎస్ చెప్పింది.
ఉత్తరప్రదేశ్‌లో 12 మందికి పైగా పీఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. అస్సాంలోనూ పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు.
జైశంకర్: ఆయుధాలు ఎవరి దగ్గర కొనాలనేది పూర్తిగా మా ఇష్టం... మా ప్రయోజనాలే ముఖ్యం