You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

SCO సదస్సు: భారత్-రష్యా సంబంధాల బలోపేతంపై పుతిన్‌తో చర్చించిన ప్రధాని మోదీ

ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సమర్‌కండ్ చేరుకున్నారు. ఆయనకు భారత దౌత్యాధికారులు స్వాగతం పలికారు.

లైవ్ కవరేజీ

  1. INDvsAUS T20: నేనే తప్పూ చేయలేదు.. నాకేం సంబంధం లేదు- అజారుద్దీన్

  2. టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?

  3. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు... తెలుగు రాష్ట్రాల్లో అయిదుగురి అరెస్ట్

    దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) గురువారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. పోలీస్ శాఖ, ఈడీలతో కలిసి సంయుక్తంగా దేశంలోని 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో దాడులు చేసింది.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బిహార్, మణిపూర్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ మొత్తం 45 మందిని అరెస్ట్ చేసింది.

    ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అయిదుగురు ఉన్నారు. తెలంగాణకు చెందిన అబ్దుల్ వరీస్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్, అబ్దుల్ వహీద్ అలీ, షేక్ జఫ్రుల్లా, రియాజ్ అహ్మద్‌లను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది.

    ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు, శిక్షణ ఇస్తున్నట్ల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో పీఎఫ్ఐ కార్యాలయాలతోపాటు కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.

    తెలుగు రాష్ట్రాలకు చెందిన అయిదుగురితో పాటు కేరళలో 19 మందిని, తమిళనాడులో 11 మందిని, కర్ణాటకలో ఏడుగురిని, రాజస్తాన్‌లో ఇద్దరిని, ఉత్తరప్రదేశ్‌లో ఒకరిని అరెస్ట్ చేసింది.

  4. ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్

  5. బ్రేక్‌డాన్స్‌ ఓ క్రీడ అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా?

  6. ఆంధ్రప్రదేశ్: నవంబర్ 1నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. నవంబర్‌ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది.

    తాజా ఉత్తర్వుల ప్రకారం ఏపిలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతికి అనుమతి ఉండదని తెలిపింది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శన పైనా నిషేధం విధించింది.

    ఈ నిషేధం అమలు చేయాల్సిన బాధ్యతలు కూడా నిర్దేశించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించింది. గ్రామాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. నిషేధం అమలు పర్యవేక్షణ బాధ్యత పోలీస్‌, రవాణా, జీఎస్టీ శాఖలు తీసుకోవాలని తెలిపింది.

    ప్లాస్టిక్‌కు బదులుగా కాటన్‌, నేత వస్త్రాలు వాడాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని పేర్కొంది.

  7. అల్జీమర్స్‌ లక్షణాలు ఏంటి? దీని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  8. రూపాయి ఎందుకు పడిపోతోంది?

  9. ఆంధ్రప్రదేశ్: హెల్త్ యూనివర్సిటీకి మూడోసారి పేరు మార్పు.. అభ్యంతరాలు ఎందుకు? ఇబ్బందులు ఏంటి?

  10. డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?

  11. నార్త్ వెస్ట్రన్ రైల్వేలో సేవలందిస్తున్న మహిళా పైలట్ నీలమ్ రాథల్

  12. శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?

  13. నీరా రాడియ టేపుల కేసులో ‘నేరం’ జరగలేదు:సీబీఐ

    సుమారు 12 ఏళ్ల కిందట 2జీ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీరా రాడియా టేపుల కేసులో ఎటువంటి నేరం జరగలేదని సుప్రీం కోర్టుకు సీబీఐ తెలిపింది.

    టేపుల్లోని సంభాషణలను తాము విచారించామని వాటికి సంబంధించి ఎటువంటి నేరపూరిత కార్యకలాపాలు జరగలేదని వెల్లడించింది.

    ఈమేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ విన్నవించారు.

    గత యూపీఏ ప్రభుత్వ హాయంలో కార్పొరేట్ లాబీలు చేసే నీరా రాడియాతో నాటి కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, సీనియర్ జర్నలిస్టులు జరిపిన సంభాషణలు మీడియాకు లీక్ అయ్యాయి.

    మనీలాండరింగ్‌కు సంబంధించి 2008-09లో ఆదాయపు పన్ను శాఖ నీరా రాడియా ఫోన్‌ను ట్యాప్ చేసింది.

    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి కూతురు కనిమొళి, డీఎంకే నేత ఎ.రాజా, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, సీనియర్ జర్నలిస్టు బర్ఖా దత్, రతన్ టాటా వంటి వారి పేర్లు ప్రధానంగా ఈ కేసులో వినిపించాయి.

  14. వడ్డీ రేట్లు పెంచిన ఫెడరల్ రిజర్వ్... మరింత పడిపోయిన రూపాయి

    అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచిన తరుణంలో రూపాయి విలువ పడిపోయింది.

    డాలరుతో పోలిస్తే రూపాయి విలువ జీవిత కాల కనిష్టం 80.45ని తాకి ఆ తరువాత కాస్త కోలుకుని 80.25 వద్ద ట్రేడ్ అవుతోంది.

    అమెరికా వడ్డీ రేట్లను 3-3.25శాతం రేంజ్‌కు పెంచుతూ ఫెడరల్ రిజ్వర్ నిర్ణయం తీసుకుంది.

  15. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాల మీద ఎన్ఐఏ దాడులు

    దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యాలయాల మీద నేషనల్ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఈడీ ఏక కాలంలో దాడులు చేశాయి.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు సుమారు 10 రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి.

    100 మందికిపైగా పీఎఫ్ఐ నేతలను అరెస్టు చేశారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో దాడులకు నిరసనగా పీఎఫ్ఐ కార్యకర్తలు నిరసనలకు దిగారు.

  16. కేటీఆర్: ‘నేను ఇంత వరకు ఓట్ల కోసం చుక్క మందు పంచలేదు... పైసా డబ్బులు ఇవ్వలేదు’

  17. RRR- ఛెల్లో షో : భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ సినిమా కథ ఏంటి, దీని ముందు ‘RRR' ఎందుకు వెనుకబడింది?

  18. యుక్రెయిన్ యుద్ధం ఆపాలని కోరుతున్న ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు

  19. వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు - ఎన్నికల సంఘం, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ని ఎన్నుకోవడం చెల్లదని తెలిపింది. ఈ మేరకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.

    జూలై 8,9 తేదీలలో మంగళగిరి సమీపంలో ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఆ సందర్భంగా రెండో రోజు నిర్వహించిన సమావేశాల్లో పార్టీ రాజ్యాంగం సవరిస్తున్నట్టు తీర్మానం చేశారు. ఆ వెంటనే ఈ ఎన్నిక జరిగింది.

    వైఎస్ జగన్ ని పార్టీ శాశ్వత అధ్యక్ష హోదాలో ఎన్నుకుంటూ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్లీనరీలో ఆమోదించారు. అదే నెల 22న ఈసీకి ఈ వివరాలు తెలియజేశారు. కానీ వివరణ కోరుతూ ఆగష్టు 1, 5, తేదీలలో ఎన్నికల సంఘం లేఖలు రాసినా ఆపార్టీ నుంచి తగిన స్పందన లేదని తెలిపింది. ఆగష్టు 23నాడు పార్టీ తరుపున అందిన లేఖలో అంశాలు చెల్లవని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

    ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కూడా నిర్ధిష్ట కాలపరిమితిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. శాశ్వత అధ్యక్షుడు అన్నది ప్రజాస్వామ్య విరుద్దం అంటూ ప్రస్తావించింది. పార్టీలకు తరచూ ఎన్నికలు జరగాలని తెలిపింది.

    శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఎన్నికల సంఘం నియమాలకు విరుద్దం అని స్పష్టం చేసింది.

    వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న వైసీపీ..

    వైసీపీ నాయకత్వం ఈసీకి తెలియజేసిన అంశాలు ఆసక్తిగా ఉన్నాయి. తమ పార్టీ రాజ్యాంగాన్ని ఫిబ్రవరిలో సవరించినట్టు పేర్కొనడం విశేషం. దానిపై మీడియాలో కథనాలు వచ్చాయని తెలిపినట్టు ఈసీ ప్రస్తావించడం ఆసక్తిగా కనిపిస్తోంది. ఆ కథనాలపై విచారణ చేస్తున్నామని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానమని వైసీపీ పేర్కోన్నట్టు ఈసీలో లేఖలో ఉండడం చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ వాదనను తోసిపుచ్చుతూ ఈసీ స్పష్టత కోరింది.

    పార్టీ అంతర్గత విచారణ చేసి వెంటనే స్పందించాలని కోరింది. త్వరగా దీనిపై స్పష్టతనిస్తూ బహిరంగ ప్రకటన చేయాలని ఆదేశించింది. అస్సష్టత తొలగించేలా చర్యలుండాలని ఎన్నికల సంఘం తెలిపింది.

    శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక అనేది సమంజసం కాదని, ఇలాంటివాటిపై స్పష్టత ఇవ్వకపోతే ఇతర పార్టీల్లో గందరగోళం నెలకొంటుందని, దీనిని మిగతా పార్టీలు కూడా అనుసరించే ప్రమాదం ఉంటుందని పేర్కొంది.

    జగన్ మోహన్ రెడ్డి ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న తీరు మీద సమాధానం కోరినా స్పందించకపోవడం పట్ల ఈసీ సీరియస్ అయ్యింది. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికను అంగీకరించడమా లేదా తిరస్కరించడమా అన్నది తేల్చుకుండా తాత్సార్యం చేయడాన్ని నిలదీసింది. ఈసీ లేఖలోని అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించి, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని వైసీపీ పేర్కొనడం గమనార్హం.

  20. రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, మైదానంలో ప్రవర్తన గురించి చర్చ ఎందుకు?