You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
SCO సదస్సు: భారత్-రష్యా సంబంధాల బలోపేతంపై పుతిన్‌తో చర్చించిన ప్రధాని మోదీ
ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సమర్‌కండ్ చేరుకున్నారు. ఆయనకు భారత దౌత్యాధికారులు స్వాగతం పలికారు.
లైవ్ కవరేజీ
ఆకలిని తగ్గించే ఆహార పదార్థాలు ఏవి?
పర్యావరణ మార్పుల వల్ల పట్టణాలు, నగరాల్లోని చెట్లు అంతరించిపోతాయా? - తాజా పరిశోధన ఏం చెబుతోంది
ఉత్తరాఖండ్‌లోని రిసార్టులో రిసెప్షనిస్టు హత్య. బీజేపీ నేత కుమారుడు అరెస్టు
ఉత్తరాఖండ్‌లోని ఒక రిసార్టులో పని చేస్తున్న రిసెప్షనిస్టు హత్యకు గురయ్యారు. ఈ రిసెప్షనిస్టు హత్యకు సంబంధించి బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు పులకిత్ ఆర్యను అరెస్టు చేశారు.
ఉత్తరాఖండ్ పోలీసులు శనివారం ఉదయం అంకిత భండారీ అనే అమ్మాయి మృతదేహాన్ని రిషికేష్ లోని చీలా కాలువ నుంచి వెలికితీశారు.
ఈ ఘటన పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అపరాధులను క్షమించేది లేదని స్పష్టం చేశారు.
ఇదే ట్వీట్‌లో, "ఈ ఉదయం అంకిత మృతదేహం లభించింది. గుండెను పగిల్చే ఈ సంఘటనతో మనసంతా దుఃఖంగా అయిపొయింది. పోలీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పీ. రేణుక దేవి నేతృత్వంలో నియమించిన సిట్ కమిటీ ఈ కేసును విచారించి అపరాధులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తుంది" అని ట్వీట్ చేశారు.
అత్యున్నత స్థాయి విచారణ కమిటీని నియమించి ఈ కేసును విచారించాలని ఆదేశించారు. నిందితులు చట్టవ్యతిరేకంగా నిర్వహిస్తున్న రిసార్టును కూల్చేందుకు బుల్ డోజర్లను పంపినట్లు తెలిపారు. ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టేది లేదని ట్వీట్ చేశారు.
ఆరు రోజుల తర్వాత లభించిన మృత దేహం
అంకిత హత్యకు సంబంధించిపోలీసులు పులకిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తను శుక్రవారం అరెస్టు చేశారు.
హత్య చేసిన తర్వాత అంకితను చీలా కాలువలోకి విసిరేసినట్లు విచారణలో తెలిసినట్లు పోలీసులు చెప్పారు.
విచారణ చేస్తుండగా మొదట పోలీసులను తప్పు దారి పట్టించాలని చూసారని, కానీ, గట్టిగా ప్రశ్నించేసరికి నిజం చెప్పారని ఏ ఎస్ పీ శేఖర్ చంద్ర సూయల్ చెప్పారు.
సోమవారం అంకిత ఇంట్లో కనిపించకపోయేసరికి, కుటుంబ సభ్యులు ఆమె తప్పిపోయినట్లు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పులకిత్ ఆర్య తండ్రి వినోద్ ఆర్య బీజేపీ ప్రభుత్వంలో గతంలో కేబినెట్ ర్యాంక్‌లో పనిచేశారు. ఆయన ఉత్తరాఖండ్ మాటీకళ బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని రిసార్టులను తనిఖీ చేయమని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న అన్ని రిసార్టుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.
పౌరి జిల్లాలో యమకేశ్వర్ బ్లాకులో నిర్మించిన బీజేపీ నేత రిసార్టునుశుక్రవారం బుల్ డోజర్లతో కూల్చివేశారు. ఈ రిసార్టును పులకిత్ ఆర్య నిర్వహిస్తున్నారు.
ఝులన్ గోస్వామి: మహిళల వన్ డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక వికెట్లను తీసుకున్న స్టార్ ప్లేయర్‌కు ఆఖరి మ్యాచ్
ఆపరేషన్ ఆక్టోపస్-పీఎఫ్ఐ కార్యాలయాలలో సోదాలకు ఎన్ఐఏ పెట్టిన పేరు ఇది
దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాపై జరగుతున్న దాడులకు ఆపరేషన్ ఆక్టోపస్ అని కేంద్రం దర్యాప్తు సంస్థ పేరు పెట్టింది.
పలు నగరాలలో ఈ సంస్థకు చెందిన కార్యాలయాలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ, పలు డాక్యుమెంట్లును, డబ్బును, కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలో అరెస్టైన పీఎఫ్ఐ కార్యకర్తలను విచారించేందుకు 7 రోజుల కస్టడీకి దిల్లీలోని ఈడీ కోర్టు అనుమతించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యాలయాలు, నేతలపై జరిపిన దాడుల్లో చాలా అభ్యంతరకరమైన అంశాలు దొరికాయని జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది.
పీటీఐ ప్రకారం, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈ కేసుకు సంబంధించిన 10 మందిని ఎన్ఐఏ కస్టడీకి కోరింది.
దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసులలో పేర్కొన్న ప్రకారం, లష్కరే తోయిబా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)లో చేరడానికి యువతను పీఎఫ్ఐ ప్రేరేపిస్తోంది.
"భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు కుట్ర"
హింసాత్మక జిహాద్, తీవ్రవాద కార్యకలాపాల ద్వారా భారతదేశంలో ఇస్లామిక్ పాలనను తెచ్చేందుకు ఈ సంస్థ కుట్ర పన్నిందని సెప్టెంబర్ 22న సమర్పించిన నివేదిక పేర్కొంది.
"ప్రభుత్వ విధానాలను సమాజంలోని ఒక వర్గానికి తప్పుగా అన్వయించి, భారతదేశానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టడానికి పీఎఫ్‌ఐ ప్రయత్నించింది. దేశంపట్ల, ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేసింది" అని ఆ నివేదిక పేర్కొంది.
"ఎఫ్‌ఐఆర్ నమోదైన వ్యక్తులు నిరంతరం వ్యవస్థీకృత నేరాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని, సమాజంలోని ఇతర మత వర్గాలను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశ్యంతో ఉన్నారని దర్యాప్తులో రికవరీ చేసిన అంశాల ద్వారా తేలింది" అని నివేదిక పేర్కొంది.
నిందితులను ఎన్ఐఏ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ దాడుల్లో కేరళ నుంచి 22మంది, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 20, తమిళనాడు నుంచి 10, అస్సాం నుంచి 9, ఉత్తరప్రదేశ్ నుంచి 8, ఆంధ్రప్రదేశ్ నుంచి 5, మధ్యప్రదేశ్ నుంచి 4, పుదుచ్చేరి, దిల్లీల నుంచి ముగ్గురిని, రాజస్థాన్ నుంచి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ముకేశ్ అంబానీ: ఆస్తుల పంపకాల్లో కొడుకులతో సమానంగా కూతురికీ ప్రాధ్యాన్యమిస్తున్నారా?
బంగ్లాదేశ్: "రోహింజ్యాల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ, పర్యావరణం, దేశ భద్రత,సామాజిక, రాజకీయ సుస్థిరత పై తీవ్రమైన ప్రభావం పడుతోంది" -షేక్ హసీనా
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా రోహింజ్యాల అంశం గురించి మాట్లాడారు.
తమ దేశంలో రోహింజ్యాలు చాలా కాలంగా ఉండిపోవడం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ, పర్యావరణం, దేశ భద్రత,సామాజిక, రాజకీయ సుస్థిరత పై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని అన్నారు.
"వీరిని తరలించే విషయం పై నెలకొన్న అనిశ్చితి వల్ల విసుగు, సీమాంతర వ్యవస్థీకృత నేరాలకు దారి తీస్తున్నాయి" అని ఆమె అన్నారు.
ఆమె ఇటీవల భారత్ పర్యటన సందర్భంగా ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహింజ్యాల అంశం గురించి ప్రస్తావించారు. రోహింజ్యాలు తమ దేశానికి పెను భారంగా మారుతున్నారని అంటూ ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ సహాయం చేయాలని కోరారు.
హలో! గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
ఉత్తరాఖండ్ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్ హత్య, బీజేపీ నేత కుమారుడి అరెస్ట్
ఆపరేషన్ ఆక్టోపస్: పీఎఫ్ఐ ఆఫీసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు సోదాలు చేస్తున్నాయి
యుక్రెయిన్‌తో యుద్దాన్ని వ్యతిరేకిస్తే జైలుపాలే అంటున్న రష్యా
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
బ్లాక్ వాటర్: టాలీవుడ్, బాలీవుడ్ అందగత్తెలు తాగే ఈ నీటి ప్రత్యేకత ఏమిటి
ఆంధ్రప్రదేశ్: వాట్సాప్‌లో పోస్టుకు సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్, సీఐడీ కుట్ర కేసు ఎందుకు పెట్టింది
నూపుర్ శర్మ కేసులో నావికా కుమార్‌కు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో టైమ్స్ నౌ యాంకర్ నావికా కుమార్‌పై కూడా పలు రాష్ట్రాల నుంచి కేసులు నమోదయ్యాయి.
తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ క్లబ్ చేయాలని కోరుతూ నావికా కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది.
నావికా కుమార్‌పై ఉన్న "అన్ని ఎఫ్ఐఆర్‌లను దిల్లీ పోలీస్‌కు చెందిన ఐఎఫ్ఎస్ఓ యూనిట్‌కు తరలించాలని" సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
దిల్లీ పోలీసు ఐఎఫ్ఎస్ఓ యూనిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌నే ప్రధాన కేసుగా తీసుకోవాలని తెలిపింది.
అంతే కాకుండా, వచ్చే ఎనిమిది వారాల పాటు ప్రస్తుత ఎఫ్‌ఐఆర్‌లు లేదా భవిష్యత్తులో నమోదయ్యే ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి నావికా కుమార్‌పై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోకూడదని వెల్లడించింది.
జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పులో, “నావికా కుమార్ తనపై దాఖలైన ప్రధాన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయమని కోరుతూ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉంది" అని వెల్లడించారు.
నావికా కుమార్ నిర్వహించిన కార్యక్రమంలోనే నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
యుక్రెయిన్‌లో ఏడుగురు శ్రీలంక బందీల విడుదల
మరింత క్షీణించిన రూపాయి విలువ.. డాలరుకు రూ. 81.27
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణత కొనసాగుతోంది.
శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ మరింత పడిపోయి, కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది.
డాలర్‌తో రూపాయి మారకంలో ఇదే కనిష్ట స్థాయి. అంటే, మీరు ఇప్పుడు ఒక డాలర్ కొనాలనుకుంటే, దానికి రూ. 81. 27 చెల్లించాల్సి ఉంటుంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్లు పెరగడమే రూపాయి పతనానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.
రూపాయి విలువ నిరంతరం పతనం కావడం భారత ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశమే. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వడ్డీ రేట్లు విదేశీ పెట్టుబడులపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి. అలాగే, చమురు దిగుమతులు భారమవుతాయి.
పీఎఫ్ఐపై ఎన్ఐఏ సోదాలకు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు .. కేరళలో నేడు బంద్
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సోదాలకు నిరసనగా కేరళలో నేడు బంద్‌కు పిలుపునిచ్చారు.
బంద్ సందర్భంగా, కొల్లం జిల్లాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు పీఎఫ్ఐ మద్దతుదారులు అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారని ఏఎన్ఐ వెల్లడించింది.
నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వడంతో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు గాయపడ్డారు. చాలా చోట్ల బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) గురువారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. పోలీను శాఖ, ఈడీలతో కలిసి దేశంలోని 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో దాడులు చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బిహార్, మణిపూర్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ మొత్తం 45 మందిని అరెస్ట్ చేసింది.
ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు, శిక్షణ ఇస్తున్నట్ల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీఎఫ్ఐ కార్యాలయాలతోపాటు కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన అయిదుగురితో పాటు కేరళలో 19 మందిని, తమిళనాడులో 11 మందిని, కర్ణాటకలో ఏడుగురిని, రాజస్తాన్‌లో ఇద్దరిని, ఉత్తరప్రదేశ్‌లో ఒకరిని అరెస్ట్ చేసింది.
ఎన్‌ఐఏ సోదాలకు నిరసనగా కోయింబత్తూర్‌లో బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ నింపిన బాటిల్ విసిరారు.
'కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా' - రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు. నామినేషన్ తేదీని త్వరలో నిర్ణయిస్తానని తెలిపారు.
"దేశ పరిస్థితులు చూస్తుంటే ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది" అని అశోక్ గహ్లోత్ అన్నట్టు ఏఎన్ఐ తెలిపింది.