1948, సెప్టెంబర్ 17న
తెలంగాణభారతదేశంలో విలీనమయిన రోజును
తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో
జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర రావు ప్రసంగించారు.
తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు పడేందుకు
జరిగిన తెలంగాణ పోరాటానికి సారధ్యం వహించానని చెప్పుకుంటూ 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం
సాకారమైందని అన్నారు.
"తమ నేతృత్వంలో తెలంగాణ ఏ విధంగా ఉండాలని ప్రజలు
కోరుకున్నారో అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమన
దిశలో నడుస్తోంది" అని అన్నారు.
"ఎనిమిదేళ్లుగా ప్రగతి బాటలో ప్రయాణిస్తున్న
రాష్ట్రంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమవికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి"
అని కేసీఆర్ ఆరోపించారు.
"ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన
చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి
చెడులను అర్ధం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి" అని సూచించారు.
"హక్కుల కోసం, అస్తిత్వం
కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు
సుడులు తిరుగుతాయి" అని అన్నారు. .
దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయి.
తమ సంకుచిత ప్రయోజనాల కోసం విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి.
మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదు" అని అన్నారు.
"జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ
రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి".
"ఆనాటి చరిత్రతో, పరిణామాలతో ఎటువంటి సంబంధంలేని అవకాశవాదులు చిల్లర రాజకీయాలతో
ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకుప్రయత్నం చేస్తున్నాయి" అని ఆరోపించారు.
"జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి. ఈ
విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని
మరోమారు హెచ్చరిస్తున్నాను" అని అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ కోసం పోరాడిన రాజకీయ నాయకులు, పోరాట యోధులు, సాహిత్యకారులు చేసిన సేవలను గుర్తు
చేసుకున్నారు.