"శ్రీనగర్‌లో ప్రతి శుక్రవారం జామియా మసీదును ఎందుకు తెరవడం లేదు?" - అసదుద్దీన్ ఒవైసీ
కశ్మీర్ లెఫ్టినేట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం కశ్మీర్‌లో మల్టీప్లెక్స్ తెరిచారు. వీటిని కశ్మీర్ యువతకు అంకితమిస్తున్నట్లు మనోజ్ సిన్హా ప్రకటించారు.
మల్టీప్లెక్స్‌లను తెరవడం పై ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్ వేదికగా స్పందించారు.
ట్విటర్ ద్వారా ఆయన మనోజ్ సిన్హాను ప్రశ్నించారు.
"షోపియన్, పుల్వామాలో సినిమా హాళ్లు తెరిచారు. కానీ,ప్రతి శుక్రవారం శ్రీనగర్‌లోని జామియా మసీదును ఎందుకు మూసేస్తున్నారు? అని ప్రశ్నించారు. కనీసం శుక్రవారం మ్యాటినీ షో వేస్తున్న సమయంలోనైనా మసీదును మూయకండి" అని ట్వీట్ చేశారు.