హిమాచల్ లోని కులు వ్యాలీలో వ్యాన్ లోయలోపడి ఏడుగురి మృతి, పలువురికి గాయాలు
హిమాచల్ ప్రదేశ్ లోని కులు లో ఆదివారం రాత్రి వ్యాను లోయలో పడి ఏడుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.
వీరంతా టెంపోలో ప్రయాణిస్తున్నారు. టెంపో అదుపు తప్పి లోయలో పడిపోయింది.
సోమవారం ఉదయం స్థానిక బీజేపీ ఎంఎల్ ఏ సురేంద్ర సౌరి ఘటనా స్థలానికి చెందిన వీడియోను అప్ లోడ్ చేశారు.
ఈ ప్రమాదం కులులోని బంజర్ తాలూకాలో జరిగినట్లు తెలిపారు.
ప్రమాదంలో గాయపడినవారికి ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరంతా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా, దిల్లీకి చెందిన పర్యాటకులని బంజర్ ఎంఎల్ ఏ చెప్పారు.
రక్షణ చర్యలు కొనసాగించేందుకు పోలీసులకు స్థానికులు సహాయం చేసారు.
"బంజరు వ్యాలీలో ఘియాగి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గాయాలైన ఐదుగురిని కులు జోనల్ ఆస్పత్రిలో చేర్చారు. ఐదుగురికి బంజర్ లోనే చికిత్సను అందిస్తున్నారు" అని కులు జిల్లా ఎస్ పీ గురుదేవ్ సింగ్ చెప్పారు.