You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’

ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లైవ్ కవరేజీ

  1. PFI: ఐదేళ్ల నిషేధంతో ఈ ఇస్లామిక్ సంస్థ కథ ముగుస్తుందా

  2. ఖర్జూరం సాగు: ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడి’

  3. రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: రూ.25 కోట్ల నకిలీ నోట్లు.. అన్నీ 2000 రూపాయల నోట్లే..

  4. 'ఈరోజు శానిటరీ ప్యాడ్స్ అడుగుతారు.. రేపు కండోమ్స్ అడుగుతారు' అన్న వ్యాఖ్యలపై బిహార్ ఐఏఎస్ ఆఫీసర్ విచారం

  5. మాగ్నస్ కార్ల్‌సన్-హాన్స్ నీమాన్: 19 ఏళ్ల కుర్రాడిపై చెస్ ప్రపంచ చాంపియన్ ఆరోపణలు ఎందుకు?

  6. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?

  7. ఆంధ్రప్రదేశ్‌లో 'పేదలందరికీ ఇళ్లు' నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?

  8. పొన్నియ‌న్ సెల్వ‌న్ 1 రివ్యూ: మ‌ణిర‌త్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?

  9. దేశద్రోహం కేసులో జేఎన్‌యూ విద్యార్థి షార్జీల్ ఇమామ్‌కు బెయిల్, సుచిత్ర మొహంతి, బీబీసీ హిందీ కోసం

    2019 నాటి దేశద్రోహం కేసులో జేఎన్‌యూ విద్యార్థి షార్జీల్ ఇమామ్‌కు శుక్రవారం దిల్లీ సాకేత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేశారని, ఫలితంగా జామియానగర్‌లో హింస చెలరేగిందని ఆరోపిస్తూ ఆయనపై ఈ కేసు నమోదైంది.

    షార్జీల్‌కు అదనపు సెషన్స్ జడ్జి అనుజ్ అగర్వాల్, బెయిల్ మంజూరు చేశారు. అయినప్పటికీ ఆయన ఇప్పుడు జైలు నుంచి బయటకు రాలేరు.

    దిల్లీ అల్లర్లకు సంబంధించిన ఆయనపై నమోదైన ఇతర కేసులు పెండింగ్‌లో ఉండటమే ఇందుకు కారణం. 2020 దిల్లీ అల్లర్లలో యూఏపీఏ కింద సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అల్లర్ల వెనుక కుట్రలో ఆయన హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి.

    2019 డిసెంబర్నాటి కేసులో షార్జీల్‌కు ఇప్పుడు బెయిల్ లభించింది.

  10. అంబులెన్స్ డ్రైవర్‌గా సేవలందిస్తున్న మహిళ

  11. సైనికుల భార్యలను అవమానించేలా అభ్యంతరకర దృశ్యాలు.. ఏక్తా కపూర్‌పై అరెస్ట్ వారెంట్

  12. ‘పస్తులైనా ఉందాం ఆ పనికి మాత్రం వెళ్లొద్దని కాళ్ల మీద పడ్డాం.. ఇప్పుడు మాకెవరు దిక్కు’

  13. భారత్ జోడో యాత్ర: కర్ణాటకలో రాహుల్ గాంధీకి స్వాగతం

    కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర నేడు కర్ణాటకకు చేరింది.

    అక్కడ రాహుల్ గాంధీకి, ఆయనతో పాటు యాత్ర చేస్తోన్న వారికి స్వాగతం లభించింది. చామరాజనగర్‌లోని ఊటీ-కాలికట్ జంక్షన్ నుంచి కర్ణాటకలో యాత్ర కొనసాగనుంది.

    గురువారంతో కేరళలో రాహుల్ యాత్ర ముగిసింది. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇప్పటివరకు 532 కి.మీ పాదయాత్ర చేశారు. ఇంకా 3,038 కి.మీ చేయాల్సి ఉంది.

  14. యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం.. అధికారిక పత్రాలపై సంతకం చేసిన పుతిన్

  15. ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడులు’ - ఖర్జూరం పండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతులు

  16. Gas flaring: చమురు వెలికితీసే సంస్థలు గ్యాస్‌కు మంట పెడుతున్నాయి ఎందుకు

  17. జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

    36వ జాతీయ క్రీడలు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి.

    దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ ఆరంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రీడలను ప్రారంభించినట్లు ప్రకటించారు.

    సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు గుజరాత్‌లోని ఆరు నగరాల్లో వీటిని నిర్వహిస్తారు.

    దాదాపు 7 వేల మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. మొత్తం 36 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి.

    రెండేళ్లకు ఒకసారి జాతీయ క్రీడలు జరుగుతాయి.

    చివరిసారిగా 2015లో కేరళలో ఈ క్రీడలను నిర్వహించారు.

  18. విదేశాలలో బతుకమ్మ సంబరాలు

  19. ఈ నగలు ఇంత చౌకగా ఎందుకు అమ్ముతారో తెలుసా?

  20. 2023 అక్టోబర్ నుంచి కార్లలో 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి

    ప్రయాణీకుల కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

    2023 అక్టోబర్ 1నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు.

    ప్రజలందరి భద్రతే తమకు ప్రాధాన్యం అని గడ్కారీ అన్నారు.

    వాహనాల ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా 2023 అక్టోబర్ నుంచి ప్యాసింజర్ కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.