You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’
ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
లైవ్ కవరేజీ
లాటరీకి భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆమోదం, కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఎందుకు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న అశోక్ గెహ్లాట్
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దాదాపు గంటన్నరపాటు దిల్లీలోని 10 జన్‌పథ్‌లో సమావేశమయ్యారు.
తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన రెండు రోజుల క్రితం జరిగిన పరిణామాల పట్ల సోనియాగాంధీకి క్షమాపణ చెప్పానని అన్నారు.
‘‘రెండు రోజుల క్రితం జరిగిన ఘటన మనందరినీ కలిచి వేసింది. ఇది నాకు ఎంత బాధ కలిగించిందో కేవలం నాకు మాత్రమే తెలుసు. నేను ముఖ్యమంత్రిగానే కొనసాగాలని అనుకుంటున్నానని, అందుకే ఇదంతా జరిగినట్లు దేశమంతటా ఒక ప్రచారం జరిగింది. నేను సోనియా గాంధీని క్షమాపణ కోరాను. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నేను ఉంటానా? లేదా? అనే దాన్ని సోనియా గాంధీ, కాంగ్రెస్ నిర్ణయిస్తుంది’’ అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ‘‘ఇలాంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నేను నిర్ణయించుకున్నా. ఇదే నా నిర్ణయం’’ అని ఆయన తెలిపారు.
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ తరహా పాలసీ మంచిదో నిర్ణయించుకోవడం ఎలా?
గర్భం దాల్చిన 24 వారాల వరకు మహిళలకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉంటుంది - సుప్రీంకోర్టు
మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ ప్రయోజనాల రీత్యా మారిటల్ రేప్‌ను కూడా అత్యాచారంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. భర్త బలవంతం చేయడం వలన గర్భం దాల్చితే, అది తీయించుకునే హక్కు భార్యకు ఉంటుందని తెలిపింది.
అలాగే, అవివాహిత మహిళలు గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది.
అవివాహిత మహిళల అబార్షన్‌కు సంబంధించిన ఒక కేసులో తీర్పు వెలువరిస్తూ కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ, "సమాజం మారుతున్న కొద్దీ సమాజంలో నియమాలు కూడా మారుతాయి. కాబట్టి, చట్టం కూడా మారాలి" అన్నారు.
"వ్యక్తిగత హక్కులకు వివాహం ప్రాతిపదిక కాకూడదు. వివాహం తరువాత భర్త బలవంతం చేసినా, అది రేప్ అవుతుంది. అలాంటప్పుడు భార్య గర్భం దాలిస్తే తొలగించుకునే హక్కు ఆమెకు ఉంటుంది. అలాగే అవివాహిత మహిళలకూ గర్భస్రావం చేయించుకునే హక్కు ఉంటుంది" అని పేర్కొన్నారు.
320 ఎకరాలలో 49 ఎకరాలే మిగిలాయి
ఇరాన్: 'నోరు మూసుకుని ఉండకపోతే మమ్మల్ని రేప్ చేస్తామన్నారు'
PFI ట్విట్టర్ ఖాతాపై నిషేధం
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ట్విట్టర్ ఖాతాపై కూడా నిషేధం విధించారు.
"చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా భారతదేశంలో ఈ ఖాతా నిలిపివేయబడింది" అని పీఎఫ్ఐ ట్విట్టర్ ఖాతాలో కనిపిస్తోంది.
నిన్న, బుధవారం కేంద్ర హోం శాఖ పీఎఫ్‌ఐని అయిదేళ్ల పాటు నిషేధించింది.
పీఎఫ్ఐ భారతదేశంలో రహస్య ఎజెండాను అమలుచేస్తోందని, ఆ సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సమూహాలతో సంబంధాలు ఉన్నాయని" హోం శాఖ పేర్కొంది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, 1967లోని సెక్షన్ 3(1) కింద, కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐ దాని అనుబంధ, సంబంధిత సంస్థలపై అయిదేళ్లపాటు నిషేధం విధించింది.
మియన్మార్: అడల్ట్ సబ్‌స్క్రిప్షన్ సైట్‌లో చిత్రాలను పోస్ట్ చేసినందుకు మహిళకు జైలు శిక్ష
మియన్మార్‌లో అడల్ట్ సబ్‌స్క్రిప్షన్ సైట్ 'ఓన్లీఫ్యాన్స్'లో చిత్రాలను పోస్ట్ చేసినందుకు నాంగ్ మ్వే సాన్ అనే మహిళకు మిలటరీ కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. నాంగ్ మ్వే సాన్ ఒక మోడల్, మాజీ డాక్టర్.
"సంస్కృతి, గౌరవానికి హాని కలిగించారని" అభియోగాలు మోపుతూ ఆమెకు జైలు శిక్ష విధించినట్టు సైనిక అధికారులు తెలిపారు.
గతంలో మిలటరీ అధికారానికి వ్యతిరేకంగా నాంగ్ మ్వే సాన్ నిరసనలు తెలిపారు. ఓన్లీఫ్యాన్స్'లో కంటెంట్ పోస్ట్ చేసినందుకు అరెస్ట్ అయిన తొలి వ్యక్తి ఈమేనని భావిస్తున్నారు.
ఆగస్టులో థింజర్ వింట్ క్యావ్ అనే మరో మోడల్‌ను కూడా అదే చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆమె నిరసనల్లో పాల్గొన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నిర్బంధించారు. ఈ కేసు విచారణ అక్టోబర్‌లో జరగనుంది.
డబ్బులు తీసుకుని సోషల్ మీడియా సైట్‌లలో నగ్న ఫోటోలు, వీడియోలను పంపిణీ చేసినందుకు నాంగ్ మ్వే సాన్‌ను ఆ దేశంలోని ఎలక్ట్రానిక్స్ లావాదేవీల చట్టంలోని సెక్షన్ 33 (ఏ) కింద దోషిగా తేల్చారు. ఈ చట్టం కింద అధికంగా ఏడేళ్లు శిక్షపడవచ్చు.
జమ్మూ కశ్మీర్: ఉధంపుర్‌లో ఉదయం 6.00 గంటలకు ఒక బస్సులో బాంబు పేలుడు
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌లో గురువారం ఉదయం 6 గంటలకు బస్సులో పేలుడు సంభవించింది. గడచిన ఎనిమిది గంటల్లో ఉధంపుర్‌లో ఇది రెండో పేలుడు.
“నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో ఉధంపుర్‌లోని దోమాయిల్ చౌక్ వద్ద పెట్రోల్ పంపు దగ్గర ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించింది. ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఈరోజు ఉదయం 6.00 గంటలకు మరో బస్సులో పేలుడు సంభవించింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు" అని జమ్మూ ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు.
అట్టహాసంగా 36వ జాతీయ క్రీడలు ప్రారంభం
పొన్నియిన్ సెల్వన్: 70 ఏళ్ల కిందట మ్యాగజీన్‌లో సీరియల్.. ఇప్పుడు వెండితెరపై మల్టీస్టారర్
సీడీఎస్‌గా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్
విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా నియమిస్తున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సీడీఎస్ పదవితోపాటు భారత ప్రభుత్వ కార్యదర్శిగానూ చౌహాన్ పనిచేస్తారని మంత్రిత్వ శాఖ వివరించింది.
సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పది నెలల తర్వాత చౌహాన్‌ను ఈ పదవిలో నియమించారు.
కోల్‌కతాలో జన్మించిన చౌహాన్ 1981లో సైన్యంలో చేరారు. భిన్న హోదాల్లో దాదాపు 40ఏళ్లు ఆయన సేవలు అందించారు.
అటార్నీ జనరల్‌గా సీనియర్ అడ్వొకేట్ ఆర్ వెంకటరమానీ
సీనియర్ అడ్వొకేట్ ఆర్ వెంకటరమానీని అటార్నీ జనరల్(ఏజీ)గా నియమిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ పదవిలో వెంకటరమానీ మూడేళ్లు కొనసాగుతారు.
ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి కిరణ్ రెజిజు బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది.
ఘర్‌వాపసీ:ఇస్లాం నుంచి హిందువుగా మారిన ఒక కుటుంబం ఇప్పుడెలా ఉంది?
కాంగ్రెస్‌పై గాంధీల పట్టు ఎలా సడలిపోయింది, నేతలు మారారా, పరిస్థితులు మారాయా?
గుజరాత్: పశువులను ప్రభుత్వ కార్యాలయాల్లో వదులుతూ నిరసనలు
వీధి కుక్కలను చంపిన వారికి గతంలో బహుమతులు కూడా ఇచ్చారు, కేరళలో పరిస్థితి ఎందుకంత తీవ్రంగా మారింది?
పనికిరాని శాటిలైట్లు, రాకెట్ల ముక్కలు మనుషుల మీద పడే ప్రమాదం ఎంత, జాగ్రత్తపడటం సాధ్యమేనా?
'మా అబ్బాయిని లైంగికంగా వేధించారు.. మాకు న్యాయం కావాలి '