దసరా కానుకగా సింగరేణి ఉద్యోగులకు రూ.368 కోట్లు
సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా రూ.368 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే 2021-22 సంవత్సరానికి సింగరేణి కాలరీస్ సాధించిన లాభాల్లో 30శాతాన్ని ఇందుకు కేటాయించనున్నారు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా రూ.368 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే 2021-22 సంవత్సరానికి సింగరేణి కాలరీస్ సాధించిన లాభాల్లో 30శాతాన్ని ఇందుకు కేటాయించనున్నారు.
సౌతాఫ్రికాతో నేటి నుంచి జరగనున్న టీ20 సిరీస్ టీ ఇండియా జట్టులో ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్‌కు చోటు లభించింది.
టీం ఇండియా జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బూమ్రా, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్
ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సిల్క్ స్మిత చనిపోయి 26 ఏళ్లు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు? సినిమాల్లోకి రాకపోయుంటే ఏం కావాలనుకున్నారు?
ఇరాన్‌లో ‘హిజాబ్’కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనల్లో ఇప్పటి వరకు భద్రతా దళాల చేతిలో 76 మంది చనిపోయారని నిరసనకారులు తెలిపారు.
అయితే 41 మంది చనిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా చెబుతోంది.
హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించిందనే నేరంతో ఒక యువతిని కొద్ది రోజుల కిందట అరెస్టు చేయగా కస్టడీలో ఆమె మరణించింది.
నాటి నుంచి హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి.
సినీనటుడు మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి, నేటి ఉదయం మరణించారు.
70 ఏళ్ల వయసున్న ఇందిరా దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఒకనాటి సినీనటుడు కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు రమేశ్ బాబు, మహేశ్ బాబు, మంజుల, పద్మావతి, ప్రియదర్శిని సంతానం.
రమేశ్ బాబు ఈ ఏడాది జనవరిలో చనిపోయారు.
సినీనటుడు చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఇందిరా దేవి మృతికి సంతాపం తెలిపారు.
ఆయుధాలు కొనడమనేది పూర్తిగా భారత ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ మంత్ర ఎస్.జైశంకర్ అన్నారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అమెరికా, భారత్ బంధాల బలోపేతానికి కలిసి పని చేస్తామని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంలో ఎదుర్కోవడంలో అమెరికా నుంచి భారత్‌కు మంచి మద్దతు లభించందని అందుకు ధన్యవాదాలు తెలిపారు.