You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’

ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లైవ్ కవరేజీ

  1. రేణిగుంటలోని ఆస్పత్రి భవనంలో అగ్ని ప్రమాదం. ముగ్గురి మృతి

    రేణిగుంటలోని రాజరాజేశ్వరి నగర్‌లో కొత్తగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్‌లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది.

    ఈ అగ్నిప్రమాదంలో ఒక వైద్యుడు మరణించారు. మంటల వల్ల ఊపిరి అందక ఆయన ఇద్దరు పిల్లలు కూడా చనిపోయినట్లు రేణిగుంట డిప్యూటీ పోలీస్ సూపెరింటెండెంట్ రామచంద్ర తెలిపారు.

    ఆయన తల్లిని, భార్యను మంటల్లోనుంచి రక్షించారు.

    సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది సంఘటనా స్థలం దగ్గరకు చేరి సహాయక చర్యలు మొదలుపెట్టారు.

    తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన పన్నెండేళ్ల కుమారుడు సిద్ధార్థ, తొమ్మిదేళ్ల కుమార్తె కార్తికలను అగ్నిమాపక సిబ్బంది రక్షించి, చికిత్స కోసం 108 వాహనంలో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

    చికిత్స పొందుతూ చిన్నారులు మృతి చెందారు.

    ఈ ఘటన విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ వల్లే జరిగినట్లు అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.

  2. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  3. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారత్ విజయం.. టీ20 సిరీస్ కైవసం

  4. ‘ప్రపంచంలో అత్యంత విశాల హృదయం భారత్‌దే’, ఐరాసలో భారత విదేశీ వ్యవహారాల మంత్రితో చెప్పిన మరో దేశ ఫారిన్ మినిష్టర్

    భారతదేశం గత 75 ఏళ్లలో ఆర్థికంగా ఎదిగిన తీరును విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ యూఎన్ జనరల్ అసెంబ్లీలో వివరించారు. సర్వసభ్య సమావేశంలో ఇండియా@75 కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కోవిడ్ సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాక్సీన్లు సరఫరా చేసిన విషయాన్నీ ప్రస్తావించారు.

    ఈ కార్యక్రమంలో ఇతర దేశాల విదేశాంగ మంత్రులు భారత్‌ను ప్రశంసించారని చెప్పారు.

    ‘‘ఇండియా@75 కార్యక్రమంలో ఓ విదేశాంగ మైత్రి వ్యాక్సీన్ మైత్రి గురించి చెప్పారు. మరో విదేశాంగ మంత్రి అయితే.. ఆర్థిక వ్యవస్థల పరంగా భారత్‌ది ప్రపంచంలో అయిదో స్థానం కావొచ్చు కానీ.. అత్యంత విశాల హృదయం ఉన్న దేశం మాత్రం భారతే’ అన్నారు అంటూ ట్వీట్ చేశారు.

  5. కశ్మీర్‌: 33 ఏళ్ల తర్వాత తిరిగి మొదలైన సూఫీల సంప్రదాయ ‘పడవల యాత్ర’

  6. Shehbaz Sharif: భారత్‌లోని ముస్లింలపై పాకిస్తాన్ ప్రధాని ఐక్యరాజ్య సమితిలో ఏమన్నారు? భారత్ ఏమని సమాధానం ఇచ్చింది?

  7. మహారాజా హరి సింగ్: జమ్మూకశ్మీర్ చివరి డోగ్రా రాజు చరిత్రను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా?

  8. ఆకలిని తగ్గించే ఆహార పదార్థాలు ఏవి?

  9. పర్యావరణ మార్పుల వల్ల పట్టణాలు, నగరాల్లోని చెట్లు అంతరించిపోతాయా? - తాజా పరిశోధన ఏం చెబుతోంది

  10. ఉత్తరాఖండ్‌లోని రిసార్టులో రిసెప్షనిస్టు హత్య. బీజేపీ నేత కుమారుడు అరెస్టు

    ఉత్తరాఖండ్‌లోని ఒక రిసార్టులో పని చేస్తున్న రిసెప్షనిస్టు హత్యకు గురయ్యారు. ఈ రిసెప్షనిస్టు హత్యకు సంబంధించి బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు పులకిత్ ఆర్యను అరెస్టు చేశారు.

    ఉత్తరాఖండ్ పోలీసులు శనివారం ఉదయం అంకిత భండారీ అనే అమ్మాయి మృతదేహాన్ని రిషికేష్ లోని చీలా కాలువ నుంచి వెలికితీశారు.

    ఈ ఘటన పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అపరాధులను క్షమించేది లేదని స్పష్టం చేశారు.

    ఇదే ట్వీట్‌లో, "ఈ ఉదయం అంకిత మృతదేహం లభించింది. గుండెను పగిల్చే ఈ సంఘటనతో మనసంతా దుఃఖంగా అయిపొయింది. పోలీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పీ. రేణుక దేవి నేతృత్వంలో నియమించిన సిట్ కమిటీ ఈ కేసును విచారించి అపరాధులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తుంది" అని ట్వీట్ చేశారు.

    అత్యున్నత స్థాయి విచారణ కమిటీని నియమించి ఈ కేసును విచారించాలని ఆదేశించారు. నిందితులు చట్టవ్యతిరేకంగా నిర్వహిస్తున్న రిసార్టును కూల్చేందుకు బుల్ డోజర్లను పంపినట్లు తెలిపారు. ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టేది లేదని ట్వీట్ చేశారు.

    ఆరు రోజుల తర్వాత లభించిన మృత దేహం

    అంకిత హత్యకు సంబంధించిపోలీసులు పులకిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తను శుక్రవారం అరెస్టు చేశారు.

    హత్య చేసిన తర్వాత అంకితను చీలా కాలువలోకి విసిరేసినట్లు విచారణలో తెలిసినట్లు పోలీసులు చెప్పారు.

    విచారణ చేస్తుండగా మొదట పోలీసులను తప్పు దారి పట్టించాలని చూసారని, కానీ, గట్టిగా ప్రశ్నించేసరికి నిజం చెప్పారని ఏ ఎస్ పీ శేఖర్ చంద్ర సూయల్ చెప్పారు.

    సోమవారం అంకిత ఇంట్లో కనిపించకపోయేసరికి, కుటుంబ సభ్యులు ఆమె తప్పిపోయినట్లు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

    పులకిత్ ఆర్య తండ్రి వినోద్ ఆర్య బీజేపీ ప్రభుత్వంలో గతంలో కేబినెట్ ర్యాంక్‌లో పనిచేశారు. ఆయన ఉత్తరాఖండ్ మాటీకళ బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

    రాష్ట్రంలో ఉన్న అన్ని రిసార్టులను తనిఖీ చేయమని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న అన్ని రిసార్టుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.

    పౌరి జిల్లాలో యమకేశ్వర్ బ్లాకులో నిర్మించిన బీజేపీ నేత రిసార్టునుశుక్రవారం బుల్ డోజర్లతో కూల్చివేశారు. ఈ రిసార్టును పులకిత్ ఆర్య నిర్వహిస్తున్నారు.

  11. ఝులన్ గోస్వామి: మహిళల వన్ డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక వికెట్లను తీసుకున్న స్టార్ ప్లేయర్‌కు ఆఖరి మ్యాచ్

  12. ఆపరేషన్ ఆక్టోపస్-పీఎఫ్ఐ కార్యాలయాలలో సోదాలకు ఎన్ఐఏ పెట్టిన పేరు ఇది

    దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాపై జరగుతున్న దాడులకు ఆపరేషన్ ఆక్టోపస్ అని కేంద్రం దర్యాప్తు సంస్థ పేరు పెట్టింది.

    పలు నగరాలలో ఈ సంస్థకు చెందిన కార్యాలయాలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ, పలు డాక్యుమెంట్లును, డబ్బును, కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

    మరోవైపు దేశ రాజధాని దిల్లీలో అరెస్టైన పీఎఫ్ఐ కార్యకర్తలను విచారించేందుకు 7 రోజుల కస్టడీకి దిల్లీలోని ఈడీ కోర్టు అనుమతించింది.

    మరోవైపు దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యాలయాలు, నేతలపై జరిపిన దాడుల్లో చాలా అభ్యంతరకరమైన అంశాలు దొరికాయని జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది.

    పీటీఐ ప్రకారం, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈ కేసుకు సంబంధించిన 10 మందిని ఎన్ఐఏ కస్టడీకి కోరింది.

    దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసులలో పేర్కొన్న ప్రకారం, లష్కరే తోయిబా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)లో చేరడానికి యువతను పీఎఫ్ఐ ప్రేరేపిస్తోంది.

    "భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు కుట్ర"

    హింసాత్మక జిహాద్, తీవ్రవాద కార్యకలాపాల ద్వారా భారతదేశంలో ఇస్లామిక్ పాలనను తెచ్చేందుకు ఈ సంస్థ కుట్ర పన్నిందని సెప్టెంబర్ 22న సమర్పించిన నివేదిక పేర్కొంది.

    "ప్రభుత్వ విధానాలను సమాజంలోని ఒక వర్గానికి తప్పుగా అన్వయించి, భారతదేశానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టడానికి పీఎఫ్‌ఐ ప్రయత్నించింది. దేశంపట్ల, ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేసింది" అని ఆ నివేదిక పేర్కొంది.

    "ఎఫ్‌ఐఆర్ నమోదైన వ్యక్తులు నిరంతరం వ్యవస్థీకృత నేరాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని, సమాజంలోని ఇతర మత వర్గాలను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశ్యంతో ఉన్నారని దర్యాప్తులో రికవరీ చేసిన అంశాల ద్వారా తేలింది" అని నివేదిక పేర్కొంది.

    నిందితులను ఎన్ఐఏ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

    ఈ దాడుల్లో కేరళ నుంచి 22మంది, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 20, తమిళనాడు నుంచి 10, అస్సాం నుంచి 9, ఉత్తరప్రదేశ్‌ నుంచి 8, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 5, మధ్యప్రదేశ్‌ నుంచి 4, పుదుచ్చేరి, దిల్లీల నుంచి ముగ్గురిని, రాజస్థాన్ నుంచి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

  13. ముకేశ్ అంబానీ: ఆస్తుల పంపకాల్లో కొడుకులతో సమానంగా కూతురికీ ప్రాధ్యాన్యమిస్తున్నారా?

  14. హైదరాబాద్ సెక్స్ స్కాండల్: ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యంలో సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణం కథ

  15. బంగ్లాదేశ్: "రోహింజ్యాల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ, పర్యావరణం, దేశ భద్రత,సామాజిక, రాజకీయ సుస్థిరత పై తీవ్రమైన ప్రభావం పడుతోంది" -షేక్ హసీనా

    ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా రోహింజ్యాల అంశం గురించి మాట్లాడారు.

    తమ దేశంలో రోహింజ్యాలు చాలా కాలంగా ఉండిపోవడం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ, పర్యావరణం, దేశ భద్రత,సామాజిక, రాజకీయ సుస్థిరత పై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని అన్నారు.

    "వీరిని తరలించే విషయం పై నెలకొన్న అనిశ్చితి వల్ల విసుగు, సీమాంతర వ్యవస్థీకృత నేరాలకు దారి తీస్తున్నాయి" అని ఆమె అన్నారు.

    ఆమె ఇటీవల భారత్ పర్యటన సందర్భంగా ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహింజ్యాల అంశం గురించి ప్రస్తావించారు. రోహింజ్యాలు తమ దేశానికి పెను భారంగా మారుతున్నారని అంటూ ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ సహాయం చేయాలని కోరారు.

  16. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  17. ఉత్తరాఖండ్ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్ హత్య, బీజేపీ నేత కుమారుడి అరెస్ట్

  18. ఆపరేషన్ ఆక్టోపస్: పీఎఫ్ఐ ఆఫీసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు సోదాలు చేస్తున్నాయి

  19. నార్మల్ డెలివరీ కష్టమైనా సిజేరియన్ చేయలేదా? నల్గొండలో గర్భిణి మృతికి కారణమేంటి

  20. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి