You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’

ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లైవ్ కవరేజీ

  1. అమిత్ షా భద్రతలో లోపం... ఆంధ్రప్రదేశ్ ఎంపీ పీఏగా నటించిన వ్యక్తి అరెస్ట్

    ఆంధ్రప్రదేశ్ ఎంపీ పీఏగా నటించిన ఒక వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముంబయి పర్యటనలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

    ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రి అయిన తరువాత అమిత్ షా తొలిసారి మహారాష్ట్ర వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీ పర్సనల్ అసిస్టెంట్‌గా నటించిన హేమంత్ పవార్ అనే వ్యక్తి ఆయన బస చేసిన నివాసంలోకి వచ్చారని పోలీసులు తెలిపారు.

    అలాగే కేంద్ర హోంశాఖకు చెందిన వ్యక్తిగా నటించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నివాసాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.

    హేమంత్ పవార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

  2. చిత్రాల్లో కర్తవ్యపథ్

  3. ఆంధ్రప్రదేశ్‌: కొత్త పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఏమిటీ ఓపీఎస్, జీపీఎస్?

  4. నేడు ఇండియా గేట్ వద్ద బోస్ విగ్రహం ఆవిష్కరణ

    దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.

    ఇండియా గేట్ కనోపీ కింద 28 అడుగుల నేతాజీ గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా చేతులతోనే ఆ శిల్పాన్ని చెక్కినట్లు అధికారులు వివరించారు.

    తెలంగాణలోని ఖమ్మం నుంచి గ్రానెట్ రాయిని తీసుకొచ్చామని, ఇందుకు 140 చక్రాలతో 100 అడుగుల పొడవు ఉన్న ట్రక్కును ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలిపారు.

    అలాగే సుందరీకరించిన కర్తవ్యపథ్‌ను కూడా సందర్శకుల కోసం నేడు ప్రధాని ప్రారంభించనున్నారు. రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌గా మార్చారు.

  5. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  6. ‘సీఎం కేసీఆర్ ఎందుకు రావడం లేదు... రాజ్‌భవన్ అంటరాని స్థలమా?’

  7. కశ్మీర్: సాధారణ ప్రజల వాహనాలు 'ఆన్ డ్యూటీ'లో ఎందుకు, సైన్యం వాటిని ఎన్‌కౌంటర్లకు వాడుతోందా?

  8. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  9. రాహుల్ గాంధీ: ‘జాతీయ పతాకాన్ని బీజేపీ తన సొంత సొత్తుగా భావిస్తోంది’

    దేశంలో నివసించే ప్రతీ ఒక్కరిని జాతీయ పతాకం ప్రతిబింబిస్తుందని, అయితే బీజేపీ మాత్రం జాతీయ జెండాను తమ సొంత సొత్తుగా భావిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.

    బుధవారం కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి ఈ యాత్రను మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

    సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లను ఉపయోగించుకొని దేశంలోని ప్రతిపక్షాలను భయపెట్టాలని బీజేపీ చూస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే భారత ప్రజలు, విపక్ష నేతలెవరూ దేనికీ భయపడరనే సంగతి వారికి అర్థం కావట్లేదని అన్నారు.

    భారత్, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను కేవలం ముగ్గురు, నలుగురు వ్యాపారవేత్తలకు చెందిన కంపెనీలే శాసిస్తున్నాయని విమర్శించారు.

  10. బ్రెస్ట్ క్యాన్సర్‌ ఉందో లేదో ఇంట్లోనే టెస్టు చేసుకునే సాధనం ఇది. ఎలా వాడాలి?

  11. బెంగళూరులో ఉబర్, ఓలా బోట్ ట్యాక్సీలు నడుస్తాయంటూ సోషల్ మీడియాలో ఎందుకు జోకులు పేలుతున్నాయి?

  12. ఆసియా కప్: ఒక్క మ్యాచ్ గెలవకపోయినా భారత్‌కు ఫైనల్ చేరే అవకాశం ఇంకా ఉందా?

  13. ‘బీజేపీ చేస్తున్నది ఏమీ లేదు... దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలి’

    బీజేపీ నేతలు చేస్తున్నది ఏమీలేదని, వారికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు.

    దిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ‘మంచి వాతావరణంలో చర్చ జరిగింది. వీళ్లు(బీజేపీ) చేస్తున్నది ఏమీ లేదు. ఇప్పుడు అందరూ ఏకం కావడం చాలా ముఖ్యం.

    సాధ్యమైనంత వరకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కోరుకుంటున్నా. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ప్రతిపక్షాలు ఏకం కావాలి’ అని నితీశ్ కుమార్ అన్నారు.

  14. ‘భారత్ జోడో’: ఈ పాదయాత్రతో కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా

  15. 35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’

    ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

    తద్వారా 1.2 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని, రైల్వే ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.

    వచ్చే 5ఏళ్లలో 300 కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేస్తారు.

    వివిధ ఎకనామిక్ జోన్స్‌ను అనుసంధానం చేస్తూ మౌలిక వసతులను కల్పించడమే పీఎం గతి శక్తి ఉద్దేశం.

  16. సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదం: ఇక కారు వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా సీట్‌ బెల్ట్ తప్పనిసరి చేస్తారా?

  17. కొడుకుని బడి మానిపించి.. ట్రావెలింగ్ చేస్తూ ప్రకృతి ఒడిలో చదువు నేర్పిస్తున్న పుణే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

  18. GST అమలుకు అయిదేళ్ళు.... ఇది ఏయే రంగాలను ఎలా ప్రభావితం చేసింది?

  19. ‘బీఫ్ తినే రణ్‌బీర్ కపూర్‌’ను దేవాలయంలోకి రానివ్వమంటూ నిరసనలు

    మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని గుడికి వెళ్లిని రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌కు భజరంగ్ దళ్ నుంచి మంగళవారం నిరసనలు ఎదురయ్యాయి.

    బీఫ్ తినే రణ్‌బీర్ కపూర్‌ను ఉజ్జయిని మహాంకాళి టెంపుల్‌లోకి రానివ్వమంటూ వారు ఆందోళన చేపట్టారు.

    బ్రహ్మాస్త్ర సినిమా విడుదల సందర్భంగా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ మహాంకాళి టెంపుల్‌కు వచ్చారు.

    నిరసనల నేపథ్యంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

    గతంలో రణ్‌బీర్ కపూర్ తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని చెప్పడం ఇప్పుడు వివాదంగా మారుతోంది.

    ‘మా కుటుంబం పెషావర్ నుంచి వచ్చింది. అనేక పెషావర్ వంటకాలు కూడా వాళ్లతో పాటు వచ్చాయి. మటన్, పాయ, బీఫ్ అంటే చాలా ఇష్టం. నాకు బీఫ్ అంటే చాలా ఇష్టం’ అని 2011లో రాక్‌స్టార్ సినిమా ప్రమోషన్ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ అన్నారు.

    నాటి ఆ వ్యాఖ్యలు నేడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దాంతో బీఫ్ తీనే రణ్‌బీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు.

  20. 'పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలు కాకపోవడంతో ఎంతో ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యాను' -బుల్లితెర సీత దేబినా