అరకు మాజీ ఎంపీ, బీజేపీ నేత కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్టు
చేశారు. మంగళవారం అరెస్ట్ చేసిన ఆమెను వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని
ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత
పిటిషన్ దాఖలు చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని మాజీ ఎంపీ
కొత్తపల్లి గీత దంపతులు చెల్లించలేదదంటూ ఆ బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు
చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కొత్తపల్లి గీతను అరెస్టు చేశారు.
విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత
దంపతులు రూ.52 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఈ రుణం చెల్లించనందున బ్యాంకు
అధికారులు గీతా దంపతులపై ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కొత్తపల్లి గీతపై సీబీఐ అధికారులు 2015 జులై 11న
చార్జీషీట్ దాఖలు చేసింది. కొత్తపల్లి గీత ఆమె భర్త విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్
ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. రామకోటేశ్వరరావులపై సీబీఐ చార్జీషీట్
దాఖలు చేసింది.
బ్యాంకు నుంచి రుణం పొందేందుకు నేరపూరిత కుట్రకు
పాల్పడ్డారని చార్జీషీట్‌లో సీబీఐ పేర్కొంది. కొత్తపల్లి గీత, ఆమె భర్త
రామకోటేశ్వరరావు వాస్తవాలను దాచిబ్యాంకుకు తప్పుడు
సమాచారం ఇచ్చారని పేర్కొంది.
మల్లిఖార్జున హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాలాక్షి
క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోస్టల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్
లిమిటెడ్, కనక ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్, మహేశ్వర ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, విశాలాక్షి
ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, అన్విత హాస్పిటాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు
కొతపల్లి గీత డైరెక్టర్‌గా ఉన్నారు.