You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’

ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లైవ్ కవరేజీ

  1. అమిత్ షా:‘దేశాన్ని ఏకంగా ఉంచే దారం హిందీ’

    భారత్‌లోని అన్ని భాషలకు హిందీ నేస్తం వంటిదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

    హిందీ దివస్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ‘అధికారిక భాష అయిన హిందీ దేశం మొత్తాన్ని ఏకంగా ఉంచే దారం’ అని ఆయన చెప్పారు.

    హిందీతోపాటు అన్ని స్థానిక భాషల అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు.

    భారత రాజ్యాంగ పరిషత్తు 1949 సెప్టెంబరు 14న హిందీని అధికారిక భాషగా ఆమోదించింది. ఇంగ్లిష్ రెండో అధికారిక భాషగా ఉంది.

  2. ‘హైదరాబాద్ విమోచన’ వేడుకల్లో పాల్గొనాలంటూ తెలంగాణ యూనివర్సిటీలను కోరిన యూజీసీ

    ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న ‘హైదరాబాద్ విమోచన దినం’ వేడుకల్లో పాల్గొనాలంటూ తెలంగాణలోని యూనివర్సిటీలు, కాలేజీలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) కోరింది.

    ఈమేరకు యూజీసీ సెక్రటరీ రజినీశ్ జైన్ యూనివర్సిటీల వీసీలు, కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు లేఖ రాశారు.

    కర్నాటక, మరఠ్వాడా యూనివర్సిటీలకు కూడా యూజీసీ ఈమేరకు వేడుకల్లో పాల్గొనాలని కోరింది.

    1948 సెప్టెంబరు 17న సైనిక చర్య తరువాత హైదరాబాద్ స్టేట్ భారత్‌లో కలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు 17 నుంచి 2023 సెప్టెంబరు 17 వరకు కేంద్ర ప్రభుత్వం ‘హైదరాబాద్ విమోచన’ వేడుకలు జరుపుతోంది.

  3. ‘పెరియార్’ పేరు పెట్టినందుకు రెస్టారెంట్ మీద హిందుత్వవాదుల దాడి

  4. తెలంగాణ: బాధితులకు నష్టపరిహారం ఎలా ఇస్తారు, ప్రభుత్వం తనకు నచ్చినంత ఇవ్వడం కరెక్టేనా?

  5. శ్రీలంకను ఐక్యరాజ్యసమితిలో భారత్ ఎందుకు తప్పుపట్టింది, దీనిపై చైనా ఎలా జోక్యం చేసుకుంది?

  6. బ్రిటన్‌లో రాచరికానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

  7. ‘తక్షణమే ఘర్షణలు ఆపండి’... ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లకు భారత్ పిలుపు

    ఆర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలను ఆపాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది.

    ‘ఆర్మేనియా-అజర్‌బైజాన్’ సరిహద్దుల్లో ఘర్షణల గురించి మాకు వార్తలు అందుతున్నాయి. పౌరుల నివాసాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. తక్షణమే ఈ దాడులను ఆపాలని కోరుతున్నాం’ అంటూ కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఒక ప్రకటనలో తెలిపారు.

    ‘రెండు వైపుల చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఎటువంటి సమస్యకైనా మిలిటరీ పరిష్కారం కాదు. శాంతిపూరితమైన పరిష్కారం దొరికే వరకు ఇద్దరూ చర్చలు జరపాలని కోరుతున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    గత కొద్ది రోజులుగా ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గత రెండు రోజుల్లో 49 మంది సైనికులు చనిపోయినట్లు ఆర్మేనియా ప్రధాని వెల్లడించారు.

    తమ రక్షణస్థావరాలను అజర్‌బైజాన్ లక్ష్యంగా చేసుకుంటోందంటూ ఆర్మేనియా రక్షణశాఖ ఆరోపిస్తోంది.

  8. 31,000 ఏళ్ల క్రితమే మనిషి అవయవాలను తొలగించారు.. ఇది శస్త్రచికిత్సా లేదా బలి ఇచ్చారా?

  9. INDvsPAK మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిదీ కూతురు భారత జాతీయ జెండాను ఎందుకు ఊపింది?

  10. జ్ఞానవాపి కేసు: ‘ఇది ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఈ మసీదు... ఆ మసీదు ఇలా కొనసాగుతూనే ఉంటుంది’

  11. క్వీన్ ఎలిజబెత్‌ 2ను భారత్ ఎలా గుర్తు చేసుకుంటోంది? సంతాపదినం ప్రకటించడంపై భిన్న వాదనలు ఎందుకు?

  12. థాయ్‌లాండ్: రాణిలా దుస్తులు ధరించినందుకు రెండేళ్లు జైలు శిక్ష

  13. సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి

  14. మోదీ పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయా, తగ్గాయా? 5 చార్టుల్లో అసలు నిజాలు

  15. భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా పాకిస్తాన్‌కు అమెరికా ఎందుకు సైనిక సాయం చేస్తోంది?

  16. సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి.. రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన మోదీ

    సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మరణించారని, ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు.

    సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భవనంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

    బేస్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయని, మంటల కంటే ఎక్కువగా దట్టమైన పొగ వ్యాపించడంతో కొందరు ఊపిరి అందక స్పృహ కోల్పోయారని, కొందరు భవనం నుంచి కిందకు దూకారాని పోలీసులు చెబుతున్నారు.

    గాయపడినవారిలో.. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో దీపక్ యాదవ్ (38), ఉమేశ్ కుమార్ ఆచార్య (35), గాంధీ ఆస్పత్రిలో కేవీ సంతోశ్ (26), బీ యోగిత (26), సికింద్రాబాద్ అపోలోలో దీబాషి గుప్తా (36), జయంత్ (39) చికిత్స పొందుతున్నారు. కేకే కేశవన్ (27) యశోద ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యారు.

    ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

    "తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారాన్ని పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందిస్తాం. క్షతగాత్రులకు రూ. 50,000 అందిస్తాం" అని మోదీ ట్వీట్ చేశారు.

  17. ఏపీకి తగ్గని గోదావరి వరద భయం

    గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది.

    ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.08 లక్షల క్యూసెక్కులు ఉందని, కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారిచేసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

    వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

    గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని సూచించారు.

    పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, ప్రయాణం లాంటివి చేయరాదని విపత్తుల సంస్థ ఎండీ హెచ్చరించారు.

  18. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

    సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్ ఆఫీసు దగ్గరలో ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

    ప్రమాదం జరిగిన భవనంలో కింద రెండు అంతస్తుల్లో ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్, పై అంతస్తుల్లో లాడ్జీ ఉన్నాయి.

    సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భవనంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఏర్పడి మంటలు బైక్‌ షోరూంలో వ్యాపించాయి. బైక్ బ్యాటరీలు కూడా పేలి ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.

    అక్కడి నుంచి మంటల కంటే ఎక్కువగా దట్టమైన పొగ వ్యాపించింది. పొగ పైన ఉన్న లాడ్జీకి వ్యాపించడంతో లాడ్జీలో ఉన్న వారికి ఊపిరి అందక ఎక్కడ వారు అక్కడ పడిపోయారు. కొందరు కిందకు దూకారు. ప్రస్తుతం అందర్నీ బయటకు తీసుకువచ్చారు. మంటలు అదుపులో ఉన్నాయి.

    ప్రమాద సమయంలో కనీసం 23 మంది లాడ్జీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

    అగ్నిమాపక, పోలీసు శాఖ అధికారులు వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని సహాయ కార్యక్రమాలు అందించారు. కొందర్ని కాపాడారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. క్రేన్ ఉపయోగించి కొందర్ని రక్షించే ప్రయత్నం చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున సహాయం చేశారు.

    ‘‘ఇంకా ప్రమాద కారణాలు తెలీదు. షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక బైకులు చార్జింగ్ పెట్టడం వల్లనా అని తెలీదు. 23 వరకూ రూమ్స్ ఉన్నాయి. మొదటి, రెండు అంతస్తుల్లో పొగ వ్యాపించింది. లాడ్జీలో వారు ఎక్కువగా వ్యాపారం పనులపై ఉత్తర భారతదేశం నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. నిద్రలో ఉండడం వల్ల ఊపిరి ఆడక, కారిడార్లో పొగ వల్ల ఏమీ కనిపించక, ఒక మహిళ సహా మొత్తం ఆరుగురు మరణించారు’’ అని నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ మీడియాతో చెప్పారు.

    మృతుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల వారు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఎక్కువ మంది 30-40 ఏళ్ల వయసున్న మధ్య వయస్కులే.

  19. ‘తక్షణమే ఘర్షణలు ఆపండి’... ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లకు భారత్ పిలుపు

  20. పొగ తాగని వారికీ ఊపిరితిత్తుల క్యానర్స్ వస్తోంది ఎందుకు?