You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’

ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లైవ్ కవరేజీ

  1. రైల్వే క్రాసింగ్: చావు అంచుల్లోకి వెళ్లిన రిక్షా కార్మికుడు, ఎలా బతికి బయటపడ్డాడంటే...

  2. దినేశ్ కార్తీక్: 12 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ జట్టులోకి రీఎంట్రీ.. ‘కలలు నిజమవుతాయి’ అంటూ ఎమోషనల్ ట్వీట్

  3. జ్ఞాన్‌వాపి కేసు: ముస్లింల పిటిషన్ కొట్టేసిన కోర్టు.. పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న హిందువుల పిటిషన్ విచారణ కొనసాగించాలని ఆదేశం

  4. ఆంధ్రప్రదేశ్: ఈ గ్రామంలో మగవాళ్లు ఎక్కువగా చనిపోతున్నారు. ఎందుకు? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది?

  5. క్వీన్ ఎలిజబెత్-2: రాణి ఉన్న చోట నవ్వుల జల్లులే

  6. బిహార్: ‘8 ఏళ్ల’ బాలుడు రిజ్వాన్ అరెస్ట్‌పై దుమారం? అసలు ఏం జరిగింది? అసదుద్దీన్ ఒవైసీ ఏమన్నారు?

  7. గాలి కాలుష్యంతో ఊపిరితిత్తులకు క్యాన్సర్.. పొగ తాగకపోయినా క్యాన్సర్ రావడానికి కారణం ఇదే..

  8. కృష్ణంరాజు: మొగల్తూరు నుంచి మొదలై దిల్లీ దాకా సాగిన రెబెల్ స్టార్ ప్రయాణం

  9. ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతి

  10. క్వీన్ ఎలిజబెత్ II భారత్ పర్యటనలో ఏనుగు అంబారీపై ఊరేగింపుగా వెళ్లినప్పుడు..

  11. క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు

  12. సిద్ధిక్ కప్పన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

    కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    హథ్‌రస్ దళిత బాలిక అత్యాచారం, హత్య కేసును కవర్ చేయడానికి వెళుతుండగా సిద్ధిక్‌ను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద అరెస్ట్ చేశారు.

    ఇప్పుడు సుప్రీం కోర్టు ఆయనకు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

  13. సిద్ధిక్ కప్పన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

  14. ‘‘ఉద్యోగానికి ఆఫర్ లెటర్ ఇచ్చాక, చివరి నిమిషంలో చేరలేనని చెప్పడం న్యాయమా’’- ఈ అంశంపై ఎందుకు చర్చ జరుగుతోంది?

  15. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి సూచీలో క్షీణించిన భారత్ ర్యాంక్

    మానవాభివృద్ధి సూచీ-2021లో భారత్ ర్యాంకు క్షీణించినట్లు తాజాగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) విడుదల చేసిన నివేదిక తెలిపింది.

    మొత్తం 191 దేశాల్లో భారత్ 132వ ర్యాంకులో ఉన్నట్లు పేర్కొంది. 2020లో భారత మానవాభివృద్ధి సూచిక స్కోరు 0.642 ఉండగా, 2021 నాటికి 0.633కి పడిపోయింది.

    ఈ జాబితాలో శ్రీలంక 73, చైనా 79, బంగ్లాదేశ్ 129, పాకిస్తాన్ 161 ర్యాంకులో ఉన్నట్లు యూఎన్‌డీపీ ప్రకటించింది.

  16. ‘సీఎం కేసీఆర్ ఎందుకు రావడం లేదు... రాజ్‌భవన్ అంటరాని స్థలమా?’

    రాజ్‌భవన్ అంటరాని స్థలమా? ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడకు రావడం లేదు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు.

    ‘సదరన్ జోనల్ కాన్ఫరెన్స్‌లో నేను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో పాల్గొన్నాను. అక్కడ ప్రస్తావనకు వచ్చిన సమస్యలో 75శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌వే. వాటిని పరిష్కరించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు?

    ఇలాంటి సమావేశాలు సమస్యల పరిష్కారానికి అవకాశం కదా? వాటిని ఎందుకు సీఎం ఉపయోగించుకోవడం లేదు?

    గవర్నర్ ప్రోటోకాల్ వారు పాటించడం లేదు. నిద్రపోతున్నవారిని లేపొచ్చు కానీ నటిస్తున్న వారిని ఎలా లేపుతాం? వారు తెలిసి కూడా చేయలేడం లేదు.

    ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదు... నేను మహిళను కాబట్టా? లేక మీరు చెప్పిందల్లా చేయనుందుకా? అది వారే చెప్పాలి.

    నేను ఇక్కడ రాజకీయాలు చేయడం లేదు. అన్ని పార్టీలకు సమదూరంలో ఉంటున్నాను. నేను ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఎమ్మెల్యేలు సమస్యలు పరిష్కరించడం లేదు కాబట్టే ప్రజలు రాజ్‌భవన్‌కు వస్తున్నారు’ అని ఆమె అన్నారు.

  17. వాటర్ డ్రోన్: సముద్రంలో మునిగిపోయే వారిని కాపాడేందుకు వేగంగా చేరుకునే డ్రోన్

  18. రెండో రోజు సాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’

    తమిళనాడులో రెండో రోజు భారత్ జోడో యాత్ర సాగుతోంది.

    కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగనుంది.

    2017లో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థి అనిత తండ్రి, సోదరుడు ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కలిశారు.

  19. మూడేళ్లుగా అవమానాలు ఎదుర్కొంటున్నా: తెలంగాణ గవర్నర్ తమిళిసై

    తెలంగాణలో తనకు ఎన్ని ఆటంకాలు వచ్చినా పని చేస్తూ పోతున్నానని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు.

    తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె రాజ్‌భవన్‌లో మాట్లాడారు.

    ఈ మూడేళ్ల కాలంలో తాను ఎంతో వివక్షను ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. సమ్మక్క సారక్క ఉత్సవాలకు వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగినా ప్రభుత్వం తనకు ఇవ్వలేదని అన్నారు.

    రిపబ్లిక్ డే నాడు జెండా ఎగుర వేసేందుకు గవర్నర్‌ను అనుమతించకపోవడమా సరైనదేనా? అని ఆమె ప్రశ్నించారు.

    ‘ఎట్ హోం కార్యక్రమానికి పిలిచినా కూడా ముఖ్యమంత్రి రాలేదు. కనీసం వస్తారో రారో సమాచరం కూడా ఇవ్వలేదు. ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నా’ అని తమిళి సై అన్నారు.

  20. బ్రహ్మాస్త్ర: ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం చేసుకోలేకపోయిన రణబీర్ కపూర్, ఆలియా భట్... ఏమిటీ వివాదం?