ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్న గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీకి 8వ స్థానం
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రెండో ర్యాంకుకు చేరుకున్నారు.
ఆయన ఫ్రాన్స్‌కు చెందిన కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను దాటి ఈ ర్యాంకును సాధించారు.
ఈ జాబితాలో టెస్లా మోటార్స్ అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
బెర్నార్డ్ ఆర్నాల్ట్ మూడో స్థానం, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నాలుగో స్థానం, బిల్ గేట్స్ ఐదో స్థానంలో ఉన్నారు.
గౌతమ్ అదాని సంపద 154.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12లక్షల కోట్లు ) కాగా, ఎలాన్ మస్క్ సంపద రూ. 21.7 లక్షల కోట్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది.
ఈ జాబితాలో ముకేశ్ అంబానీ సుమారు రూ.7 లక్షల కోట్ల సంపదతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
బొగ్గు గనుల నుంచి విమానాశ్రయాల వరకు అనేక వ్యాపారాలో అదానీ బిజినెస్ వ్యవహరాలు విస్తరించాయి. ఇటీవలే అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను పరోక్ష పద్ధతిలో కొనుగోలు చేసింది.