You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’
ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
లైవ్ కవరేజీ
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చీతాలివి, 70 ఏళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాయి.
కునో జాతీయ పార్కులోకి చిరుతలను వదిలిపెట్టిన ప్రధాని మోదీ
నమీబియా నుంచి భారత్ కు తీసుకొచ్చిన 8 చిరుతలను ప్రధాని మోదీ శనివారం కునో జాతీయ పార్కులో విడుదల చేశారు.
ఇవి భారత్ లో గత 70 ఏళ్ల క్రితం అంతరించిపోయాయి. వీటిని తిరిగి దక్షిణ ఆఫ్రికా నుంచి తెప్పించారు.
వీటిని పూర్తిగా ఆవాసాల్లోకి వదిలిపెట్టే ముందు నెలరోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతారు.
ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయకులు, ప్రముఖులు
ప్రధాన మంత్రి మోదీకి అనేక మంది నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, క్యాబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మరో వైపు శుక్రవారం జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మోదీ పుట్టినరోజుకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
మోదీ పుట్టినరోజు గురించి పుతిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పుతిన్ మొదట మోదీకి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఆ తర్వాత ప్రధాని మోదీ పుట్టిన రోజు గురించి మాట్లాడారు.
"ప్రియమైన స్నేహితుడా, రేపు మీ పుట్టినరోజని తెలుసు. రష్యా సంప్రదాయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా చెప్పం. అందుకే, నేనిప్పుడు మీకు శుభాకాంక్షలు చెప్పలేను. కానీ, ఈ విషయం నాకు తెలుసని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీకు నా అభినందనలు”.
“మీ దేశం సుభిక్షంగా ఉండాలని, మీ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.
బౌద్ధ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా కూడా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
"మతతత్వ శక్తులు తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నాన్ని చేస్తున్నాయి" - జాతీయ సమైక్యతా దినోత్సవ సభలో కేసీఆర్
1948, సెప్టెంబర్ 17న తెలంగాణభారతదేశంలో విలీనమయిన రోజును తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర రావు ప్రసంగించారు.
తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు పడేందుకు జరిగిన తెలంగాణ పోరాటానికి సారధ్యం వహించానని చెప్పుకుంటూ 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని అన్నారు.
"తమ నేతృత్వంలో తెలంగాణ ఏ విధంగా ఉండాలని ప్రజలు కోరుకున్నారో అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమన దిశలో నడుస్తోంది" అని అన్నారు.
"ఎనిమిదేళ్లుగా ప్రగతి బాటలో ప్రయాణిస్తున్న రాష్ట్రంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమవికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి" అని కేసీఆర్ ఆరోపించారు.
"ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి చెడులను అర్ధం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి" అని సూచించారు.
"హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి" అని అన్నారు. .
దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయి. తమ సంకుచిత ప్రయోజనాల కోసం విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదు" అని అన్నారు.
"జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి".
"ఆనాటి చరిత్రతో, పరిణామాలతో ఎటువంటి సంబంధంలేని అవకాశవాదులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకుప్రయత్నం చేస్తున్నాయి" అని ఆరోపించారు.
"జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నాను" అని అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ కోసం పోరాడిన రాజకీయ నాయకులు, పోరాట యోధులు, సాహిత్యకారులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
"రాజకీయాల కోసమే తెలంగాణ ప్రభుత్వం విమోచన దినాన్ని నిర్వహించలేదు" - అమిత్ షా
హైదరాబాద్‌లో శనివారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణా విమోచన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రసంగించారు.
"1947లో భారత్‌కు స్వతంత్రం వచ్చే నాటికి హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలో ఉండేది. ఆ తర్వాత 13 నెలల పాటు హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు రజాకార్ల అరాచకాలను భరించాల్సి వచ్చింది" అంటూ నిజాం పాలనను గుర్తు చేశారు.
"నిజానికి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలనే కోరిక ఉండేది. ఈ రోజును నిర్వహిస్తామని వివిధ పార్టీలు హామీలిచ్చాయి. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాలతో విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు".
"రజాకార్ల అరాచకాలు నేటికీ జ్ఞాపకాల్లో సజీవంగా మెదులుతున్నాయి. హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన అరాచకాల గురించి జరిగిన అధ్యయనాలను దేశంలో నలుమూలలా ప్రచారం చేసి వీరుల కథలు వినిపిస్తాం" అని చెప్పారు.
"సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా కష్టాలనెదుర్కొని ఆపరేషన్ పోలో నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ ను భారత్ లో విలీనం చేసి ఉండకపోతే స్వతంత్ర భారత స్వప్నం ఎప్పటికీ పూర్తి అయి ఉండేదని పటేల్ భావించారు".
సెప్టెంబరు 17 న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
అమిత్ షా పై హైదరాబాద్‌లో వ్యంగ్యంగా ఫ్లెక్సీలు
తెలంగాణాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాహైదరాబాద్ విచ్చేశారు. ఆయన రాకను నిరసిస్తూ, ఆయన పై వ్యంగ్యంగా ఫ్లెక్సీలు పెట్టారు.
హైదరాబాద్ నగరంలో పలు బస్టాండ్లపై ఈ బోర్డులు ఏర్పాటు చేశారు.
"తెలంగాణ అనే చేపకు అమిత్ షా గేలం వేసి, నీకు నేను భరోసా ఇస్తున్నా" అని చెబుతున్నట్టుగా ఈ ఫ్లెక్సీలు ఉంటాయి. వాటితో పాటూ "బైబైమోదీ" అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.
గతంలో అనేకసార్లు మోదీ పై వ్యంగ్యంగా ఫ్లెక్సీలు పెట్టి, పోస్టర్లు వేశారు. ఈ సారి అమిత్ షాపై ఫ్లెక్సీ పెట్టారు.
గతంలో బ్యాంకుల లోన్లు కొందరకి మాఫీ చేయడం వంటి అంశాలపై కూడా బీజేపీ పై వ్యంగ్యంగా బోర్డులు పెట్టారు.
గ్వాలియర్ చేరుకున్న చిరుతలు
నమీబియా నుంచి భారత్‌కు తీసుకొస్తున్న 8 చిరుతలు గ్వాలియర్ చేరుకున్నాయి. సుమారు 70ఏళ్ల క్రితం భారత్ లో అంతరించిపోయిన ఈ చిరుతలను దక్షిణ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు.
భారత ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా వీటిని తిరిగి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో ప్రవేశపెట్టనున్నారు. ఇందు కోసం మోదీ మధ్యప్రదేశ్ బయలుదేరి వెళుతున్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న అమిత్ షా
కేంద్ర ప్రభుత్వం తెలంగాణాలో నిర్వహిస్తున్న విమోచన దినోత్సవంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
ఆయన సీఆర్‌పిఆఫ్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది.
స్వాతి రెడ్డి: రైలులో పురిటినొప్పులతో విలవిల్లాడుతున్న మహిళకు కత్తెర కూడా వాడకుండా ఆమె ఎలా పురుడు పోశారంటే...
"రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో బీజేపీ ఉత్సవాలు చేస్తోంది" - రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంపై బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధానికి కారణమేంటి?
SCO సదస్సులో పుతిన్‌తో మోదీ: ‘ఇది యుద్ధం చేసే జమానా కాదు’
భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను సమర్‌కండ్‌లో కలిశారు. ఎస్‌సీఓ సదస్సుకు హాజరైన ఈ నేతలు ఇద్దరూ సదస్సు తర్వాత భేటీ అయ్యారు.
వార్తా ఏజెన్సీ రాయిటర్స్ ప్రకారం, ఈ భేటీలో పుతిన్‌తో మాట్లాడుతూ ప్రధాని మోదీ... ‘‘ఇది యుద్ధం చేసే జమానా కాదు. ఇదే విషయం మీకు ఫోన్‌లో కూడా చెప్పాను’’ అని అన్నారు.
దీని తర్వాత వ్లాదిమర్ పుతిన్ మాట్లాడుతూ... ‘‘యుక్రెయిన్ విషయంలో మీ వైఖరి గురించి నాకు తెలుసు. మీ వైఖరిని మీరు నిరంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. త్వరలోనే దీన్ని ఆపేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తాను’’ అని మోదీకి బదులిచ్చారు.
యుక్రెయిన్ చర్చలను తిరస్కరించిందని కూడా పుతిన్ చెప్పారు.
రష్యా-యుక్రెయిన్ మధ్య ఏడున్నర నెలలుగా యుద్ధం జరుగుతోంది.
పాకిస్తాన్: ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్న వేలాది గ్రామాలు.. ఆరోగ్య సంక్షోభం రావొచ్చని హెచ్చరిస్తున్న నిపుణులు
SCO సదస్సులో నరేంద్ర మోదీ: ‘ఆహార సంక్షోభానికి కరోనా, యుక్రెయిన్ యుద్ధమే కారణం’
యుక్రెయిన్ సంక్షోభం, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరుగుతోన్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్య చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే....
‘‘కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో ప్రపంచం మొత్తం సవాళ్లను ఎదుర్కొంటోంది.
కరోనా మహమ్మారితో పాటు యుక్రెయిన్ సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో అనేక అవాంతరాలను సృష్టించాయి. వీటి కారణంగానే ప్రపంచం అంతా విపరీతమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
నమ్మకమైన, పటిష్టమైన సరఫరా గొలుసును పునర్నిర్మించడానికి ఎస్‌సీఓ కృషి చేయాలి. దీనికి మెరుగైన కనెక్టివిటీ అవసరం. కాబట్టి సభ్యదేశాలన్నీ ఒకరికొకరు ఈ విషయంలో సహాయం చేసుకోవాలి.
ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేశారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు సాధించే వృద్ధి కంటే అత్యధికం.
ప్రపంచ దేశాలు ఎదుర్కొంటోన్న ఆహార సవాలును ఎదుర్కోవడానికి మిల్లెట్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలి. మిల్లెట్లు ఒక రకమైన సూపర్ ఫుడ్. వీటి సాగుకు తక్కువ ఖర్చు అవుతుంది. అంతర్జాతీయ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ గురించి అందరూ ఆలోచించాలి.
సాంప్రదాయ ఔషధాల విషయంలో ఎస్‌సీఓ దేశాల మధ్య సహకారం పెరగాలి’’ అని మోదీ సదస్సులో ప్రసంగించారు.
బ్రేకింగ్ న్యూస్, SCO సదస్సు: సమర్‌కండ్‌లో పుతిన్‌తో మోదీ భేటీ...
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరుగుతోన్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలతో పాటు రీజినల్, గ్లోబల్ అంశాలు కూడా ఈ ఇరువురు నేతలు చర్చించినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
గ్లోబల్ ఫుడ్ అండ్ ఎనర్జీ సిస్టమ్, తీవ్రవాదం, యుక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితుల గురించి ఈ భేటీలో చర్చించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు.
భారత్-రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరువురు నేతల మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు భారత ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
యుక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ విమర్శించలేదు. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ ఆశిస్తోంది.
SCO సదస్సు: 'రక్తపాత యోధుడు' తైమూర్‌కు, సమర్‌కండ్‌కు ఉన్న సంబంధం ఏంటి?
దిల్లీలో సబ్సిడీ విద్యుత్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాలి
దిల్లీ నగరంలో సబ్సిడీలో విద్యుత్ పొందడానికి ఇకపై దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకున్నవారికి అక్టోబర్1 నుంచి సబ్సిడీ విద్యుత్‌ను అందుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
అయితే, తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే ఏడాదికొకసారి సబ్సిడీని వదులుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విద్యుత్ బిల్లులతోపాటు సబ్సిడీ దరఖాస్తులు కూడా ప్రజలకు అందుతాయి.
ఆ ఫామ్ నింపడం ద్వారా ప్రభుత్వానికి సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే వాట్సాప్ ద్వారా దీనికోసం అప్లై చేయవచ్చు. 70113111111 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే, వాట్సాప్‌లో ఒక ఫామ్ వస్తుంది. దానిని నింపి ప్రభుత్వానికి అందించాలి.
3 రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని, వెంటనే సబ్సిడీ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు.
కృష్ణంరాజు కుటుంబానికి రాజ్‌నాథ్ పరామర్శ
ఇటీవల మరణించిన నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు కుటుంబాన్ని రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు.
హైదరాబాద్‌లో కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు నివాళులు అర్పించారు.
కృష్ణంరాజు కుటుంబ సభ్యులతోపాటు హీరో ప్రభాస్‌తో కూడా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రివ్యూ: 'ప్రేక్షకులు చాలా మంచోళ్లు. చెత్త సినిమాలోనూ మంచే వెదుక్కొంటారు'