You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
టీచర్లు లేరని స్కూలుకు తాళం వేసిన తల్లిదండ్రులు
పెళ్లి కాని మహిళలకు అబార్షన్‌కు 24వారాల గడువు - పరిశీలిస్తామని చెప్పిన సుప్రీం కోర్టు
వైద్యుల పర్యవేక్షణలో గర్భస్రావం చేయించుకునేందుకు వివాహితులు, అవివాహితుల మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదని సుప్రీం కోర్టు చెప్పింది. పెళ్లి కాని మహిళలు గర్భం దాల్చిన 20 వారాల తర్వాత గర్భస్రావం చేయించుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడం ఆమె వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించడమేనని పేర్కొంది.
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ చట్టంలో ఉన్న నిబంధనలను సమీక్షిస్తామని జస్టిస్ డి.వై చంద్రచూడ్, జే.బి పర్దీవాలాలతో కూడిన బెంచ్ చెప్పింది.
పెళ్లి కాని మహిళలు కూడా 24 వారాల లోపు వైద్యుల పర్యవేక్షణలో అబార్షన్ చేయించుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పింది.
"వైద్య రంగంలో చోటు చేసుకున్న పురోగతి దృష్ట్యా ఈ చట్టాన్ని కూడా ప్రగతిశీల ధోరణితో చూడాల్సిన అవసరముంది" అని సుప్రీం కోర్టు చెప్పింది.
పెళ్లి అయినమహిళలు చట్ట ప్రకారం 24 వారాల లోపు అబార్షన్ చేయించుకునే వీలుంది.
అత్యాచార బాధితులు, వైకల్యం ఉన్నవారు, మైనర్లు, అవివాహిత మహిళలు అబార్షన్ 20 వారాల లోపు చేయించుకోవాలి.
సుప్రీం కోర్టు కేసు విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.
నీటిలో మునిగిపోయిన బస్... 20 మందికి పైగా ప్రయాణికులను కాపాడిన స్థానికులు
అలెక్సా, గూగూల్ లాంటి వాయిస్ అసిస్టెంట్లతో వచ్చే ప్రమాదాలేంటి
కామన్వెల్త్గేమ్స్ 2022: కాంస్యం గెలుచుకున్నందుకు క్షమాపణలు అడిగిన పూజా గెహ్లాట్ - ప్రధాని ఏమన్నారు?
కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 50 కేజీల కుస్తీ విభాగంలో పూజా గెహ్లాట్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆమె శనివారం జరిగిన మ్యాచ్‍లో స్కాటిష్ క్రీడాకారిణిని ఓడించారు.
కానీ, ఆమె కాంస్య పతకాన్ని సాధించినందుకు క్షమాపణలు కోరారు. సెమీ ఫైనల్స్‌లో ఓటమి పాలవ్వడం పట్ల ఆమె చాలా నిరుత్సాహానికి గురయ్యారు.
"నేను సెమీ ఫైనల్స్‌లో ఓడిపోవడం చాలా విచారకరంగా ఉంది. నేను దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నాను. ఇక్కడ భారత జాతీయ గీతాన్ని ప్లే చేస్తారని భావించాను. కానీ, నేను ఓడిపోయాను. నేను చేసిన తప్పుల పై దృష్టి పెట్టి పని చేస్తాను" అని ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆమె భావోద్వేగాలకు లోనైనట్లు కనిపించారు.
అయితే, ప్రధాని మోదీ ఆమె చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ "సాధించిన ఘనతే ముఖ్యమని క్షమాపణలు చెప్పవద్దు" అని సూచించారు. "నీ జీవిత ప్రయాణం మాకు స్ఫూర్తినిస్తుంది. నీ విజయం మమ్మల్ని సంతోషపరుస్తుంది. నువ్వు చేయాల్సిన గొప్ప పనులు చాలా ఉన్నాయి. ఇలానే రాణిస్తూ ఉండాలి" అని అన్నారు.
పూజా గెహ్లాట్ తొలి రెండు మ్యాచ్‌లను గెలిచారు కానీ, సెమీ ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి మాడిసన్ బియాంకా పార్క్స్ చేతిలో ఓటమి పాలయ్యారు.
కామన్వెల్త్ గేమ్స్ 9వ రోజుకు భారత్ 9 స్వర్ణ, 3 రజత, 7 కాంస్య పతకాలు గెలుచుకుంది.
మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో వినేష్ ఫోగట్ స్వర్ణ పతకాన్ని సాధించారు.
రవి దహియా, నవీన్ కూడా రెజ్లింగ్‌లో స్వర్ణ పతకాలు సాధించారు.
పేరా టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో కూడా భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది.
మెడల్ ట్యాలీలో శనివారం నాటికి భారత్ 5వ స్థానంలో ఉంది.
ఆజాదీశాట్: 750 మంది విద్యార్థినులు తయారు చేసిన శాటిలైట్
అజాద్ శాటిలైట్ తయారీలో 750 మంది విద్యార్థినులు
ఇస్రో శ్రీహరి కోట నుంచి చిన్న ఉపగ్రహ వాహక నౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వి) డి1 రాకెట్ ప్రయోగించింది.
దీంతో పాటు విద్యార్థులు తయారు చేసిన ఆజాదీశాట్ ను కూడా సతీష్ థవన్ కేంద్రం నుంచి నింగిలోకి పంపినట్లు ఇస్రో ప్రకటించింది.
ఆజాదీశాట్ తయారీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచి 750 మంది విద్యార్థినులు సహకరించడమే ఈ శాటిలైట్ ప్రత్యేకత.
"ఎస్‌ఎస్‌ఎల్‌వి మూడు దశలు అనుకున్న విధంగానే పూర్తయ్యాయి. టెర్మినల్ దశలో కొంత డేటా నష్టం జరిగింది. ఈ మిషన్ తుది ఫలితాన్ని నిర్ధారించడానికి సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయో లేదో పరిశీలిస్తున్నాం. ప్రయోగ పురోగతి పై వీలైనంత త్వరలో సమాచారాన్ని ఇస్తాం" అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
బీజేపీలో చేరిన మాజీ ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
ఏఐసీసీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరారు.
బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తదితరుల సమక్షంలో దిల్లీలో ఆయన బీజేపీలో చేరారు.
శ్రవణ్ వెంట ఆయన మద్దతుదారులు పెద్దసంఖ్యలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలతో 1500 మంది తెలంగాణ బిడ్డల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దురదృష్టవశాత్తు దుర్మార్గుల పాలైందని.. కేవలం ఎనిమిదేళ్లలో 4 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిన పాలన ప్రస్తుతం తెలంగాణలో సాగుతోందని అన్నారు.
నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలైయింది కానీ నేడు ఉద్యమ లక్ష్యాలని తూట్లు పొడుస్తూ కేసీఆర్ అరాచర పాలన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పదేళ్ళుగా అవినీతి పాలన చేసిన కేసీఆర్ పనైపోయిందని.. తెలంగాణ అధికార మార్పిడి జరిగి, కేసీఆర్ గద్దె దిగాల్సిన చారిత్రాత్మ అవసరం ఉందని అన్న శ్రవణ్... కేసీఆర్ ని గద్దె దించుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో పని చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తేవాలని పిలుపునిచ్చారు.
గతంలో తాను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్‌గా పని చేశానని.. ఏబీవీపీ కార్యకర్తగా ఆర్ట్స్ కాలేజీ జనరల్ సెక్రటరిగా పనిచేశానని గుర్తుచేసుకున్న ఆయన ఇప్పుడు మళ్లీ బీజేపీలోకి రావడంతో సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన తమిళసై సౌందరరాజన్
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. ఆమె విద్యార్థులతో కలిసి హాస్టల్ మెస్‌లో అల్పాహారం తీసుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆమె హాస్టల్‌లో వసతులను పర్యవేక్షించారు. ఆ తర్వాత అధికారులతో సమావేశమయ్యారు.
ఇటీవల ఇక్కడ హాస్టల్‌లో విద్య, భోజన, ఇతర వసతుల్లో నాణ్యత పడిపోయిందనివిద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ఉన్నత విద్యా సంస్థల పనితీరు సూచించే 'నాక్' (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) రేటింగ్స్ లో 'సి' గ్రేడ్ కు బాసర ట్రిపుల్ ఐటీ పరిమితం కావడం ప్రమాణాలు పడిపోవడానికి ఉదాహరణగా విద్యార్థులు చెబుతున్నారు.
ఈ మధ్య వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేట పీయూసీ-2 కు (ప్రీ యూనివర్సిటీ కోర్స్) చెందిన ఈ క్యాంపస్ విద్యార్థి శాబోతు సంజయ్ కిరణ్(17) మరణానికి నాణ్యత లేని బాసర ట్రిపుల్ ఐటీ మెస్ భోజనమే సంజయ్ చనిపోవడానికి ప్రధాన కారణమని అతని తల్లిదండ్రులు ఆరోపించారు.
బాసర పర్యటన తర్వాత గవర్నర్ నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీని సందర్శిస్తారు.
హమీదా బాను: 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో కనిపించిన భారతీయ మహిళ
కామన్వెల్త్ గేమ్స్: తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కు స్వర్ణ పతకం
డిప్రెషన్ విషయంలో అపోహల్లో ఉన్నామా.. తాజా అధ్యయనం అపార్థాలకు తావిచ్చిందా
కామన్వెల్త్ క్రీడలు 2022: బాక్సింగ్‌లో రజతం గెలిచిన జాస్మిన్ లాంబోరియా
బ్రిటన్‌లోని బర్మింఘామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో.. మహిళల 60 కిలోల లైట్‌వెయిట్ విభాగంలో భారత బాక్సర్ జాస్మిన్ లాంబోరియా కాంశ్య పతకం గెలుపొందారు.
శనివారం నాడు ఇంగ్లండ్ క్రీడాకారిణి జెమ్మా పేజ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 3-2 స్కోరుతో జాస్మిన్ ఓడిపోయారు.
ఈ విభాగంలో ఫేవరేట్ అయిన జెమ్మాకు 20 ఏళ్ల జాస్మిన్ గట్టి సవాల్ విసిరారు.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జెమ్మా ఫైనల్‌కు చేరుకున్నారు.
ఫ్లైవెయిట్ పోటీల్లో ఫైనల్‌కు చేరుకున్న నిఖత్ జరీన్
మరోవైపు.. ఇవే కామన్వెల్త్ క్రీడలు మహిళల ఫ్లైవెయిట్ బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్ నిఖత్ జరీన్.. ఫైనల్‌కు చేరుకున్నారు.
ఇంగ్లండ్ క్రీడాకారిణి సవన్నా ఆల్ఫియాను ఓడించి ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లారు.
ఫ్లైవెయిట్ కేటగిరీలో నిఖత్ జరీన్ ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌గా ఉన్నారు.
మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని మళ్లీ తాకవచ్చు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏమిటి?
బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది?
తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు
బ్రేకింగ్ న్యూస్, భారత కొత్త ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. ఎన్నికల్లో ఘన విజయం
భారత 16వ ఉప రాష్ట్రపతిగా ఎన్‌డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపొందారు.
ఆయన తన ప్రత్యర్థి, ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా మీద 346 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను శనివారం ఓట్ల లెక్కింపు అనంతరం లోక్‌సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కె సింగ్ ప్రకటించారు.
మొత్తం పోలైన 725 ఓట్లలో జగదీప్ ధన్కర్‌కు 528 ఓట్లు వచ్చాయి.
మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు లభించాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పార్లమెంటు ఉభయసభలైన రాజ్యసభ, లోక్‌సభలకు ఎన్నికైన, నామినేట్ అయిన మొత్తం 780 మంది ఎలక్టర్లకు గాను.. 725 మంది ఓట్లు వేశారు.
బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది, లోపం ఎక్కడుంది?
కామన్వెల్త్ గేమ్స్: క్రికెట్ టీ-ట్వంటీ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న భారత మహిళా జట్టు
కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది.
శనివారం జరిగిన ట్వంటీ-20 సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను నాలుగు పరుగుల తేడాతో భారత మహిళా జట్టు ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. స్మృతి మందాన 32 బంతుల్లో 61 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 31 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
ఇంగ్లండ్ జట్టు 165 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది. భారత జట్టు బౌలర్లు స్నేహ రాణా 2 వికెట్లు తీయగా, దిప్తి శర్మ 1 వికెట్ పడగొట్టారు. మరో ముగ్గురు బ్యాట్స్‌వుమన్ రనవుట్ అయ్యారు.
కామన్వెల్త్ క్రీడలు మహిళా క్రికెట్ విభాగంలో రెండో సెమీ ఫైనల్ భారత కాలమానం ప్రకారం ఆదివారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా – న్యూజీలాండ్ జట్లు తలపడనున్నాయి.
ఫైనల్ మ్యాచ్ సోమవారం జరుగుతుంది.