You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. ‘సెక్స్ స్కాండల్’: బ్రిటన్‌లో ఈ సంక్షోభానికి కారణం ఏమిటి, ప్రధాని బోరిస్ జాన్సన్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది

  2. చిత్తూరు టెర్రకోట కళాకారుల కుటుంబాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి?

  3. ఓలా, ఉబర్ పీక్ చార్జీల పేరుతో బాదేస్తున్నాయా...ఇలా అడ్డుకట్ట వేయవచ్చా

  4. కాళీమాతను మాంసాహారం, మద్యం తీసుకునే దేవతగా ఊహించుకునే హక్కు నాకుంది - తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా

  5. కృష్ణా జిల్లా: గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు

    బంగాళాఖాతంలో వేటకు వెళ్లి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన మత్స్యకారులు కృష్ణాజిల్లాకు చెందినవారు.

    ఆరు బోట్లతో పాటు ఒక హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

    గురువారం మచిలీపట్నం నుంచి మరో రెండు బోట్లు గాలింపు కోసం సముద్రంలోకి వెళ్తున్నాయి.

    మెరైన్ పోలీసులు, నేవీ సిబ్బంది, కోస్ట్ గార్డ్స్ బృందాలు గాలింపు చర్యలలో పాల్గొంటున్నాయి.

    గల్లంతైనవారిలో కొందరు మచిలీపట్నం సమీపంలోని క్యాంప్‌బెల్ పేటకు చెందినవారు.

  6. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎయిమ్స్‌లో చికిత్స

    బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను చికిత్స నిమిత్తం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు.

    పట్నాలోని ఆయన నివాసంలో మెట్లపైనుంచి జారిపడడంతో లాలూ కుడి భుజానికి గాయమైంది.

    దాంతో తొలుత ఆయన్ను పట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి ఆయన్ను దిల్లీ తీసుకొచ్చారు.

    75 ఏళ్ల లాలూ అనేక శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారు.

    ఈ నెలలోనే ఆయనకు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగాల్సి ఉంది.

    పట్నాలోని పరాస్ ఆసుపత్రిలో ఉన్నప్పుడే లాలూను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరామర్శించారు. ప్రభుత్వ వ్యయంతో లాలూకు చికిత్స చేయిస్తామని ఆయన ప్రకటించారు.

  7. ‘బీబీసీ తెలుగు’ లైవ్ పేజీకి స్వాగతం

    జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు తెలుగు రాష్ట్రాల న్యూస్ అప్‌డేట్స్ కోసం ‘బీబీసీ తెలుగు’ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.

  8. ‘కశ్మీరీ పండితుల’ వివాదంలో సాయి పల్లవి పిటీషన్ కొట్టేసిన హైకోర్టు

  9. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పెళ్లి చేసుకోబోతున్న గురుప్రీత్ కౌర్‌ ఎవరు?

  10. పీటీ ఉష: మారుమూల పల్లె నుంచి రాజ్యసభను చేరుకున్న అలుపెరుగని అథ్లెట్

  11. అగ్నిపథ్ పథకం వెనుక ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏంటి?

  12. గవర్నమెంట్ బడి పిల్లలు, అమెరికన్ ఇంగ్లీష్ గడగడా మాట్లాడేస్తారు

  13. రాజ్యసభకు ఇళయరాజా

    ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

    ఇళయరాజాతో పాటు ఎస్‌ఎస్ రాజమౌళి వాళ్ల నాన్న కేవీ.విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉష, సంఘసేవకర్త వీరేంద్ర హెగ్డేలు కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వారిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

    ‘క్రియేటివ్ జీనియెస్ అయిన ఇళయరాజా గారు, అన్ని తరాల వారిని అలరిస్తూ వస్తున్నారు. ఆయన సంగీతంలో అనేక భావోద్వేగాలు కనిపిస్తాయి. చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, ఎన్నో విజయాలు సాధించారు. ఆయన రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషంగా ఉంది.’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

    సుసంప్నమైన భారత సంస్కృతిని అంతర్జాతీ వేదికల మీద ఘనంగా చూపించారంటూ విజయేంద్ర ప్రసాద్‌ను ప్రధాని ప్రశంసించారు.

  14. రంప తిరుగుబాటుకు, అల్లూరి కి సంబంధం ఉందా?మోదీ ఏమన్నారు, చరిత్ర ఏం చెబుతోంది?- బీబీసీ ఫ్యాక్ట్ చెక్

  15. మహేంద్ర సింగ్ ధోని: ది బెస్ట్ ఫినిషర్ కెరీర్‌లో 5 బెస్ట్ ఇన్నింగ్స్

  16. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

    కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఉక్కుశాఖ మంత్రి ఆర్‌సీపీ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు.

    తమ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

  17. ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే లవ్ స్టోరీ’ అని రసూల్ పూకుట్టి ఎందుకన్నారు... కీరవాణి ఏమని బదులిచ్చారు

  18. వెస్టిండీస్ వన్డే టూర్‌కు కెప్టెన్‌గా శిఖర్ ధవన్

    వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. శిఖర్ ధవన్ కెప్టెన్‌గా ఎంపిక కాగా రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

    ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌లో టీం ఇండియా పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు ఆడనుంది.

    టీం ఇండియా వన్డే జట్టు:

    శిఖర్ ధవన్(కెప్టెన్)

    రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్)

    రుతురాజ్ గైక్వాడ్

    శుభ్‌మన్ గిల్

    దీపక్ హుడా

    సూర్యకుమార్ యాదవ్

    శ్రేయస్ అయ్యర్

    ఇషాన్ కిషన్(వికెట్ కీపర్)

    సంజూ శాంసన్(వికెట్ కీపర్)

    శార్దుల్ ఠాకుర్

    యజువేంద్ర చాహల్

    అక్షర్ పటేల్

    అవేష్ ఖాన్

    పరిశధ్ కృష్ణ

    మహ్మద్ సిరాజ్

    అర్షదీప్ సింగ్

  19. భారత ప్రభుత్వంతో ట్విటర్ న్యాయస్థానాల్లో ఎందుకు తలపడుతోంది, వివాదం ఎక్కడ మొదలైంది

  20. ‘సీఎం పదవికి ఏక్‌నాథ్ శిందేను నేనే ప్రతిపాదించా’- దేవేంద్ర ఫడణవీస్

    మహారాష్ట్రకు అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం పట్ల తలెత్తుతోన్న ప్రశ్నలు, విమర్శలకు దేవేంద్ర ఫడణవీస్ సమాధానం ఇచ్చారు.

    ఏక్‌నాథ్ శిందేను ముఖ్యమంత్రిని చేయాలనేది తన ప్రతిపాదనే అని చెప్పారు.

    మంగళవారం విలేఖరులతో మాట్లాడిన ఆయన దీని గురించి వివరించారు.

    ‘‘నేను కోరుకుంటే సీఎం అయ్యేవాడిని. కానీ, సిద్ధాంతం కోసమే శివసేన వ్యక్తిని సీఎంగా చేశాం. శిందేను సీఎం చేయాలని నేనే ప్రతిపాదించా. ఒకవేళ నేను దూరంగా ఉంటే, ప్రభుత్వాన్ని నడపలేమని పార్టీ సీనియర్ నాయకత్వం వ్యాఖ్యానించడంతో డిప్యూటీ సీఎం పదవిని అంగీకరించాను’’ అని చెప్పారు.

    ఏక్‌నాథ్ శిందేను విజయవంతమైన ముఖ్యమంత్రిగా చేయడం తన బాధ్యత అని వ్యాఖ్యానించారు.

    ముఖ్యమంత్రి పదవిని చేపట్టకపోవడం తనకు బాధ కలిగించలేదని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని, మహారాష్ట్రలో మాత్రం అభివృద్ధి ఆగిపోవడం తనను బాధిస్తోందని వ్యాఖ్యానించారు.