You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
తెలంగాణ: నర్సరీలు పెట్టి పెంచిన ఈ మొక్క ఇప్పుడు ప్రభుత్వాలను ఎందుకు భయపెడుతోంది?
కుక్క మొరుగుతోందని ఇనుప రాడ్డుతో దాడి
ఉద్ధవ్ ఠాక్రే: ‘‘శివసేనను అంతం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోంది’’
తమ పార్టీని అంతం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
శివసేన భవన్‌లో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు.
‘‘మీకు ధైర్యముంటే మధ్యంతర ఎన్నికలు పెట్టి, గెలిచి చూపించండి’’అని ఆయన సవాల్ విసిరారు.
‘‘ఇది శివసేనను అంతం చేయడానికి బీజేపీ పన్నుతున్న కుట్ర. ఇలాంటి ఆటలు ఆడేకంటే.. ప్రజల దగ్గరకు వెళ్లి తేల్చుకుందాం రండి. మాది తప్పయితే, ప్రజలే తీర్పునిస్తారు. లేకపోతే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
'కాళి' పోస్టర్‌పై వివాదం: నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా.. డైరెక్టర్ లీనా మణిమేకలైపై పోలీసులకు ఫిర్యాదు
ప్రధాని హెలికాప్టర్‌పైకి కాంగ్రెస్ నల్ల బెలూన్లు.. మోదీ భద్రతలో వైఫల్యం ఉందా? లేదా?
‘కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించట్లేదు’ - ప్రధాని మోదీకి ఆహ్వానం పలకకపోవడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
ప్రధాని మోదీ గత ఆరు నెలల కాలంలో మూడుసార్లు హైదరాబాద్ వెళ్లగా, ఈ మూడు సార్లూ సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకలేదు. పైగా, శనివారం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు.
దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ‘‘ఒక రాజకీయ స్నేహితుడిగా ఆయన ఎవరికి స్వాగతం పలుకుతారు అనేది నాకు ముఖ్యం కాదు. అది ఆయన సమస్య. కానీ, తాను ఒక ముఖ్యమంత్రిని అని కేసీఆర్ మర్చిపోకూడదు. సమాఖ్య వ్యవస్థలో ప్రజలు రెండు సార్లు ఈ దేశానికి ప్రధాన మంత్రిగా ఎన్నుకున్న వ్యక్తి మోదీ. కాబట్టి రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడం కోసం ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానికి స్వాగతం పలకడం మర్యాద. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. ప్రధాన మంత్రికి ఆహ్వానం పలికినట్లుగా. రాజ్యాంగబద్ధతపై కేసీఆర్‌కు గౌరవమే లేదు. ఆయన తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించలేదు. దురదృష్టకరం’’ అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
ఒకప్పుడు 90 శాతం క్రైస్తవులే ఉన్న ఈ దేశంలో ఇప్పుడు క్రిస్టియన్లు తగ్గిపోతున్నారు.. హిందూ, ముస్లింలు వేగంగా పెరిగిపోతున్నారు
బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?
జంతర్ మంతర్: నక్షత్ర వీధికి భారత ముఖద్వారం ఇదేనా, కళ్లతోనే గ్రహాల దూరాలను చెప్పేయవచ్చా
పుండీ సారు: ఝార్ఖండ్‌కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది
‘ఇంత చిన్నమ్మాయి హెలీకాప్టర్ నడిపిస్తుందా అని అంతా ఆశ్చర్యపోయారు’
‘‘నేను చూస్తుండగానే నా భర్తను వరద నీరు ముంచెత్తి ప్రాణం తీసింది’’
‘ఆదివాసీల శౌర్యపరాక్రమాలకు ప్రతీక అల్లూరి’- ప్రధాని నరేంద్ర మోదీ
ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి, వీరభూమి. ఇలాంటి ప్రదేశానికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అల్లూరి 125 జయంతి ఉత్సవాల సందర్భంగా భీమవరం సమీపంలోని పెద అమిరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.
మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు... ‘తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా’ అంటూ స్వాతంత్ర్య సంగ్రామంలో యావత్ భారతావనికి స్ఫూర్తిగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం అంటూ మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి మహనీయులకు పురుడు పోసిన గడ్డ ఆంధ్ర రాష్ట్రమని ఆయన కొనియాడారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే...
- ఆంగ్లేయులకు ఎదురొడ్డి ఎందరో యువకులు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు.
- ఆదివాసీల శౌర్య పరాక్రమాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు.
- మనదే రాజ్యం నినాదంతో ప్రజలందర్నీ అల్లూరి ఏకతాటిపైకి తీసుకొచ్చారు.
- ఆంధ్రప్రదేశ్ వీరభూమి, దేశభక్తుల గడ్డ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి ఉద్యమకారుడు ఇక్కడే జన్మించారు.
- ఈ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
- రంప ఉద్యమం ప్రారంభమై నేటికి వందేళ్లు.
- స్వాతంత్ర్య సంగ్రామంలో ఆదివాసీల బలిదానాన్ని ప్రస్పుటించేలా ఆదివాసీ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నాం.
- లంబసింగిలో అల్లూరి మెమోరియల్, ఆదివాసీల మ్యూజియం నెలకొల్పుతాం.
- ఆదివాసీల సంస్కృతిని ఆంగ్లేయులు నాశనం చేశారు.
- అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆదివాసీ యువకులు ముందుకు రావాలి.
‘అల్లూరి సీతారామరాజును గుండెల్లో పెట్టుకున్నాం’- ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
అల్లూరి సీతారామరాజును గుండెల్లో పెట్టుకున్నాం. అందుకే జిల్లాల పునర్విభజనలో ఒక జిల్లాకు ఆయన పేరును పెట్టామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
తరతరాలకు సందేశం ఇచ్చేలా జీవించిన అల్లూరిని తెలుగు జాతి ఎన్నటికీ మరచిపోదని వ్యాఖ్యానించారు.
అల్లూరి 125 జయంతి ఉత్సవాల సందర్భంగా భీమవరం సమీపంలోని పెద అమిరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు.
ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వర్చువల్‌గా సభా వేదిక నుంచే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం అల్లూరి వంశీయులను ప్రధాని నరేంద్ర మోదీ శాలువాతో సత్కరించారు.
భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?
ఉద్ధవ్ ఠాక్రే: ‘‘శివసేనను అంతం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోంది’’
ట్రాన్స్‌వుమన్ గురించి ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఎందుకు వస్తాయో?
హాకీ వరల్డ్ కప్: ఇంగ్లండ్‌తో భారత్ మహిళల మ్యాచ్ డ్రా
ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత జట్టు ‘డ్రా’తో మొదలు పెట్టింది.
ఈ టోర్నీలో భాగంగా నెదర్లాండ్స్‌లో ఆదివారం ఇంగ్లండ్ జట్టుతో జరిగిన తమ తొలి మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది.
మ్యాచ్ ఎనిమిదో నిమిషంలో ఇసాబెల్లె చేసిన గోల్‌తో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అయితే, రెండో క్వార్టర్‌లో వందన కటారియా గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది.
స్పెయిన్, నెదర్లాండ్స్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది.
మొత్తం 16 జట్లను నాలుగు విభజించారు. జూలై 1న మొదలైన ఈ టోర్నీ 17న ఫైనల్‌తో ముగియనుంది.
పూల్ ‘బి’లో ఉన్న భారత జట్టుకు సవిత పూనియా సారథ్యం వహిస్తోంది.
హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ముస్లిం అమ్మాయిలపై ఎందుకీ వివక్ష?