You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...

  2. ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం

  3. హైదరాబాద్‌ను 'భాగ్యనగరం' అన్న మోదీ

    మరి కాసేపట్లో హైదరాబాద్ సభలో ప్రసంగించబోతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని, తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల రైతులు, మహిళలు, యువతీయువకులు, వెనుకబడిన వర్గాలు ప్రయోజనాలు అందుకుంటున్నాయని ఆయన ఆ ట్వీట్‌లో అన్నారు.

    అంతకుముందు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, “బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ కొత్త రాజకీయాల గురించి మాట్లాడారు. సరికొత్త రాజకీయ వ్యవస్థ, రాజకీయ వాతావరణం గురించి చెప్పారు. హైదరాబాద్ భాగ్యనగరం అని, ఐక్య భారతానికి సర్దార్ పటేల్ పునాదులు వేశారని, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు” అని వివరించారు.

  4. ఈ హోటల్‌కు విద్యుత్ శాఖే ఎదురు డబ్బులు చెల్లిస్తుంది

  5. హైదరాబాద్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలకనందుకు తెలంగాణ సీఎంపై బీజేపీ అసంతృప్తి

    హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ సీనియర్ నేతలందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

    మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఎయిర్‌పోర్టుకు రాలేదని బీజేపీ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది.

    శనివారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

    "ప్రధానమంత్రి గారు ఎనిమిదేళ్ల క్రితం పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఏ పార్టీ నాయకుడినైనా గౌరవ మర్యాదలతో స్వయంగా కలుస్తున్నారు. నేడు ఇక్కడ చూసిన దురదృష్టకర ప్రవర్తన రాజ్యాంగ గౌరవానికి భంగం కలిగించడమే కాక భారతదేశ సంస్కృతి, గౌరవానికి భంగం కలిగిస్తుంది. కేసీఆర్ గారు వ్యక్తిని మాత్రమే అవమానించలేదు, సంస్థను అవమానించారు" అంటూ విమర్శించారు.

  6. ఖాల్సా ఎయిడ్ వ్యవస్థాపకుడు రవి సింగ్ ట్విట్టర్ ఖాతాను భారతదేశంలో నిషేధించారు

    ఖాల్సా ఎయిడ్ వ్యవస్థాపకుడు రవి సింగ్ ట్విట్టర్ ఖాతాను భారతదేశంలో నిషేధించారు. ఈ విషయాన్ని రవిసింగ్ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు.

    నిషేదిత ట్విట్టర్ ఖాతా స్క్రీన్‌షాట్ పెడుతూ, "బీజేపీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం నిజస్వరూపం ఇది. సిక్కుల సోషల్ మీడియా ఖాతాలు నిషేధించి మా గొంతు నొక్కేయలేరు. మా గొంతు మరింత పెరుగుతుంది" అని రవి సింగ్ రాశారు.

    భారతదేశంలో సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో 2020-2021లో ప్రారంభమై, ఒక సంవత్సరం పాటు సాగిన రైతు ఉద్యమానికి మద్దతునిచ్చిన కొన్ని పెద్ద సంస్థలలో ఖాల్సా ఎయిడ్ ఒకటి.

    రైతు ఉద్యమాన్ని భారతదేశం వెలుపల ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో ఈ సంస్థ ముఖ్య పాత్ర పోషించింది.

    1999లో బ్రిటన్‌లో స్థాపించిన ఖాల్సా ఎయిడ్ లాభాపేక్ష ఆశించని సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ సేవలు అందిస్తుంది.

  7. గుజరాత్ అల్లర్లు: 20 ఏళ్లు గడిచిన తర్వాత ఆ నాటి కేసుల పరిస్థితి ఏమిటి, జైలు కెళ్లింది ఎందరు, బాధితులు ఏమంటున్నారు?

  8. జమ్మూకశ్మీర్‌లోని రియాసీలో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులను పట్టుకున్న గ్రామస్థులు

    జమ్మూ-కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు సాయుధ తీవ్రవాదులను గ్రామస్థులు ఆదివారం పోలీసులకు అప్పగించారు.

    పట్టుబడిన తీవ్రవాదుల్లో ఒకరిని లష్కరే కమాండర్‌గా చెబుతున్నారు.

    పీటీఐ సమాచారం ప్రకారం, రాజౌరీ నివాసి, లష్కరే తోయిబా కమాండర్ తాలిబ్ హుస్సేన్ ఇటీవల ఆ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అని పోలీసులు పేర్కొన్నారు.

    మరో తీవ్రవాది ఫైజల్ అహ్మద్ దార్ దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామ్ జిల్లా నివాసి అని సమాచారం.

    ఇద్దరి దగ్గరి నుంచి రెండు ఏకే అసాల్ట్ రైఫిళ్లు, ఏడు గ్రెనేడ్లు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

    ధైర్యసాహసాలతో తీవ్రవాదులను పట్టుకున్న గ్రామస్థులకు జమ్మూ-కశ్మీర్ పోలీస్ డీజీపీ దిల్బాగ్ సింగ్ రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.

  9. మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బీజేపీకి చెందిన రాహుల్ నార్వెకర్

    మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వెకర్ ఎన్నికయ్యారు.

    స్పీకర్ ఎన్నిక కోసం జరిగిన పోలింగ్ లో నార్వేకర్‌కు 164 ఓట్లు రాగా, ప్రతిపక్ష కూటమి అభ్యర్ధికి 107 ఓట్లు వచ్చాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    మరోవైపు ఇవాళ శాసన సభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. శివసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయం సీలు వేసి కనిపించింది.

    "శివసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయం ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని మూసివేయడమైంది" అని నోటీసు అంటించి ఉన్నట్లు ఏఎన్ఐ వెల్లడించింది.

  10. మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం.. స్పీకర్ ఎన్నిక జరగనుంది

    మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఆదివారం నుంచి ప్రత్యేక శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలోనే శాసనసభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.

    ప్రతి ఎమ్మెల్యే సభలో నిలబడి తనను తాను పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, అసెంబ్లీ స్పీకర్‌ పదవికి పోటీ చేస్తున్న వ్యక్తుల్లో తమ ఓటు ఎవరికో తెలపాలి. సభలో ఉన్న 287 మంది ఎమ్మెల్యేలు ఇలాగే చేయాల్సి ఉంటుంది.

    స్పీకర్ పదవికి రాహుల్ నర్వేకర్, రాజన్ సాల్వీల మధ్య పోటీ నెలకొంది. అధికార పార్టీ అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వి పోటీలో ఉన్నారు.

    మహారాష్ట్రలోని 287 సీట్ల అసెంబ్లీలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే కూటమికి 162 సీట్లు ఉండగా, ప్రతిపక్షానికి 125 సీట్లు ఉన్నాయి.

    స్పీకర్ పదవికి పోటీని షిండే-ఫడణవీస్ ప్రభుత్వానికి ఎదురయ్యే తొలి పరీక్షగా భావిస్తున్నారు.

  11. మహారాష్ట్ర: నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకే అమరావతి వాసి ఉమేశ్ కొల్హే హత్యకు గురయ్యారా?

    మహారాష్ట్రలోని అమరావతిలో జూన్ 21న ఉమేశ్ కొల్హే అనే కెమిస్ట్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు, నూపుర్ శర్మ వ్యాఖ్యలకు సంబంధం ఉందని కొందరు బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరుపుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

    గత వారం ఉదయపూర్‌లో టైలర్ కన్నయ్యలాన్ హత్య కూడా ఇదే విషయానికి సంబంధించినదని పోలీసులు తెలిపారు.

    అమరావతి, ఉదయపూర్ కేసులకు ఏదైనా ప్రత్యక్ష సంబంధం ఉందా అని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు.

  12. నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?

  13. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాదులోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు.

    యోగి రాక సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో అణువణువునా పోలీసుల నిఘా పెట్టారు. భాగ్య లక్ష్మి టెంపుల్ చుట్టూ 500 మీటర్ల పరిధిలో ముడు వలయాల భద్రతా ఏర్పాటు చేశారు.

    రూట్ టాప్ భద్రతను పటిష్టం చేశారు సౌత్ జోన్ పోలీసులు. మొత్తం 350 మంది పోలీసులతో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, లాడ్ బజార్, సర్దార్ మహల్ చూట్టూ భద్రత ఏర్పాటుచేశారు.

    యోగి ఈరోజు ఉదయం 7.30 గంటలకు హెచ్ఐసీసీ నుంచి బయలుదేరి, భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించారు.

    యోగి ఆదిత్యనాథ్‌తో పాటు బండి సంజయ్, లక్ష్మణ్ కూడా విచ్చేశారు.

  14. హైదరాబాదులో యశ్వంత్ సిన్హా ప్రచారం.. మోదీని టార్గెట్ చేసిన కేసీఆర్

    శనివారం యశ్వంత్ సిన్హా హైదరాబాదులో పర్యటించి రాష్ట్రపతి ఎన్నికల కోసం ఓట్లు అభ్యర్థించారు.

    టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలను వేర్వేరుగా కలిశారు. కాంగ్రెస్ కూడా ఆయనకు మద్దతిస్తున్నప్పటికీ, టీఆర్ఎస్ ముందుడంతో కాంగ్రెస్ నాయకులు యశ్వంత్‌ను కలవలేదు.

    యశ్వంత్ – టీఆర్ఎస్ సభ్యుల మీటింగులో కేసీఆర్ సుదీర్ఘంగా హిందీలో మాట్లాడారు. కేంద్రం అనేక తప్పులు చేస్తోందంటూ చెప్పిన ఆయన, ప్రధాన మంత్రిని షావుకార్ల సేల్స్ మెన్‌గా పేర్కొన్నారు.

    దేశంలో 4500 కే టన్ను బొగ్గు దొరుకుతుండగా, టన్నుకు 35 వేలు పెట్టి విదేశీ బొగ్గు కొనాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని, అలా కొనకపోతే కోల్ ఇండియా నుంచి బొగ్గు ఇవ్వమన్నట్టు బెదిరిస్తోందని కేసీఆర్ ఆరోపించారు.

    నల్ల ధనం, కరోనా నిర్వహణలో వైఫల్యం వంటి ఎన్నో అంశాలను ఆయన ప్రస్తావించారు. తన ప్రశ్నల్లో నిజం లేకపోతే ఆదివారం జరిగే బహిరంగ సభలో మోదీ వాటికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

    ‘‘హిందువులకు గంగానది పవిత్రమైనది. అందరూ గంగలో అస్థికలు కలుపుతారు. కానీ మోదీ హయాంలో ఏకంగా శవాలనే కలిపేశారు’’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

    కరోనా సమయంలో ఉత్తరప్రదేశ్‌లో గంగా నది ఒడ్డున వేలాది శవాలను ఇసుకలో పైపైన పూడ్చడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ మాటలు చెప్పారు.

    కేసీఆర్ వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తారో లేదో తెలియదు కానీ, బండి సంజయ్ స్పందించారు.

    ‘‘హైదరాబాదును డ్రగ్స్ అడ్డాగా మార్చాడు. మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదు. రాష్ట్రపతి ఎన్నికలకు ఫ్లెక్సీలు కట్టి, రైతులకు బేడీలు వేసిన మూర్ఖుడు కేసీఆర్. అసలు ఆయనకు తెలంగాణ రావడమే ఇష్టం లేదు. కేసీఆర్ మగోడైతే మోదీ సర్కారును కూల్చాలి" అంటూ ప్రతి సవాల్ విసిరారు బండి సంజయ్.

    ‘‘నీది గింత పార్టీ. ఉఫ్ అని ఊదితే కొట్టుకుపోతవ్. నీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా చేజారొచ్చు. ఉఫ్ మంటే ఊడిపోయే ప్రభుత్వం నీది’’ అన్నారు సంజయ్.

  15. నేడు హైదరాబాదులో బీజేపీ 'విజయ సంకల్ప సభ'

    ఇవాళ హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. 'విజయ సంకల్ప సభ' పేరుతో సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తోన్న ఈ సభలో నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారు.

    ఇప్పటికే తెలంగాణ నుంచి జన సమీకరణకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. వర్షం వచ్చినా సభ కొనసాగేలా నీటికి తడవని టెంట్లు ఏర్పాటు చేసింది. మరోవైపు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండవ రోజు కూడా కొనసాగుతాయి.

    ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. చివరిగా ప్రతినిధులను ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడతారు.

    శుక్ర, శనివారాలు వివిధ అనుబంధ సమావేశాలు జరుగగా, ఆదివారం పూర్తిగా జాతీయ కార్యవర్గ సమావేశమే ప్రధాన ఎజెండా కానుంది. ఇవాళ తెలంగాణ సహా పలు రాజకీయ అంశాలపై చర్చించి పార్టీ వైఖరిపై తీర్మానం చేస్తారు.

    శనివారం మోదీ సమక్షంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పేరిణి శివతాండం, కోలాటం, లంబాడీ సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. నాదస్వర బృందం కూడా ప్రదర్శన ఇచ్చింది.

    ఇవాళ తెలంగాణ వంటకాలను సిద్ధం చేసి మోదీకి రుచి చూపించనున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. కరీంనగర్ నుంచి వచ్చిన యాదమ్మ వాటిని సిద్ధం చేస్తారు.

    నిన్న సమావేశాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల ఎన్నికలపై సుదీర్ఘ చర్చ జరిగింది. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెప్పాలని నిర్ణయించారు. కరోనాను కేంద్రం ఎదుర్కొన్న తీరు, ఇతర సంక్షేమ పథకాల అమలు, విపక్షాల వైఖరి వంటి అంశాలపై చర్చ జరిగింది.

    ఈరోజు సమావేశాల్లో తెలంగాణ గురించి ప్రత్యేకంగా చర్చించనున్నారు. పార్టీ అధికారంలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ విస్తరించాలని అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

    శనివారం వసుంధర రాజే ప్రత్యేకంగా తెలంగాణ విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 'టార్గెట్ తెలంగాణ'గా పనిచేస్తామన్న సంకేతం ఇచ్చారు. తెలంగాణలో బూత్‌కు 200 మంది సభ్యులను నమోదు చేసుకుంటామన్నారు.

    హర్యానా సీఎం మనోహర్ లాల్, ఉత్తరప్రదే‌శ్ ఉప ముఖ్యమంత్రి మౌర్య.. ఇలా ఎందరో నాయకులు తెలంగాణలో తమ అధికారం ఖాయం అంటూ మాట్లాడారు.

    మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఈరోజు బీజేపీలో చేరతారు.

    అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

  16. హాకీ వరల్డ్ కప్: ఇంగ్లండ్‌తో భారత్ మహిళల మ్యాచ్ డ్రా

  17. నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకే అమరావతి వాసి ఉమేశ్ హత్యకు గురయ్యారా?

  18. శ్రీలంకలో మరింత తీవ్రంగా మారిన ఆర్థిక సంక్షోభం, పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు

  19. ఉదయ్‌పూర్‌లో ఇంకా కొనసాగుతున్న ఉద్రిక్తతలు

  20. హాంగ్ కాంగ్‌కు నిజమైన ప్రజాస్వామ్య పాలన అందిస్తున్నామన్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్