You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
అమర్‌నాథ్: జమ్మూ-కశ్మీర్ అధికారులకు కాల్ చేయాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు
జమ్మూ-కశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహలో క్లౌడ్ బరస్ట్ అయిన ఘటన నేపథ్యంలో, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవీ..
NDRF: 011-23438252, 011-23438253
కశ్మీర్ డివిజనల్ హెల్ప్‌లైన్: 0194-2496240
ష్రైన్ బోర్డ్ హెల్ప్‌లైన్: 0194-2313149
ఆంధ్రప్రదేశ్: అమర్‌నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, సీఎంఓ అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌తో మాట్లాడారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న హిమాంశు కౌశిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపిస్తున్నారు. యాత్రికుల భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై హిమాంశు కౌశిక్ అక్కడి అధికారులను సంప్రదిస్తారు.
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులోకి ప్రవేశించిన రిషి సునక్
అమర్‌నాథ్ వరదలు: పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఇప్పటివరకు 16 మంది మృతి, సుమారు 40 మంది గల్లంతు
అమర్‌నాథ్ గుహ సమీపంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోయారని, సుమారు 40 మంది గల్లంతయ్యారని ఏఎన్‌ఐ తెలిపింది.
కొండచరియలు విరిగిపడిన ఘటనలు లేవని, వర్షం పడుతూనే ఉందిగానీ, సహాయక చర్యలకు ఆటంకం లేదని ఎన్‌డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వల్ తెలిపినట్టు ఏఎన్ఐ వెల్లడించింది.
నాలుగు NDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని, భారత ఆర్మీ, SDRF, CRPF, ఇతర బృందాలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని డీజీ తెలిపారు.
అమెరికా: అబార్షన్ హక్కులను పునరుద్ధరించే ఆదేశంపై సంతకం చేసిన బైడెన్
అబార్షన్ హక్కులను పునరుద్ధరించడానికి ఫెడరల్ చట్టం జారీ చేయడమే "వేగవంతమైన మార్గం"గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఆ మేరకు శుక్రవారం అబార్షన్ హక్కులను రక్షించే ఉత్తర్వుపై సంతకం చేశారు.
"రో vs వేడ్ చట్టాన్ని రద్దు చేయాలనే సుప్రీంకోర్టు తీర్పు తరువాత, మహిళల అబార్షన్ హక్కులను రక్షించేందుకు ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశాను. తీర్పు తరువాత నేను ప్రకటించిన చర్యలను ఇది అధికారికం చేస్తుంది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం మరి కొన్ని చర్యలు చేపట్టేందుకు అవకాశం ఇస్తుంది" అంటూ బైడెన్ ట్వీట్ చేశారు.
మహిళలకు అబార్షన్ హక్కును రద్దు చేస్తూ ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును "పచ్చి రాజకీయ అధికారపు చర్య"గా బైడెన్ పేర్కొన్నారు.
కోర్టు తీర్పు తరువాత, ఈ అంశంలో బలమైన చర్య తీసుకోవాలని బైడెన్‌పై ఒత్తిడి వచ్చింది.
అయితే, బైడెన్ ఆదేశాలు పరిమిత ప్రభావాన్ని చూపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. అబార్షన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఎత్తివేయవచ్చు కానీ, అబార్షన్ హక్కులను పూర్తిగా పునరుద్ధరించలేవని భావిస్తున్నారు.
అమర్‌నాథ్: క్లౌడ్ బరస్ట్ కారణంగా కనీసం 14 మంది మృతి
అమర్‌నాథ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు ముంచెత్తుతోంది.
శుక్రవారం సాయంత్రం అమర్‌నాథ్ గుహ సమీపంలో మేఘాల విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్) కారణంగా కనీసం 14 మంది మరణించినట్టు సమాచారం.
ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ పాదయాత్రపై తాత్కాలిక నిషేధం విధించారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఈ ఘటనలో గాయపడ్డవారి సంఖ్య, గల్లంతయిన వారి సంఖ్య స్పష్టంగా చెప్పడం కష్టమని ఆర్మీ కంట్రోల్ రూం చెబుతోంది.
అయితే, 30-40 మంది గల్లంతయ్యారని, వారి కోసం వెతుకున్నారని ఇంతకు ముందు అధికారులు తెలిపారు.
NDRF, SDRF సహా రెస్క్యూ సంస్థలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
గుహ వద్ద వానల్లో చిక్కుకున్నవారిని పంజ్‌తర్ణికి తరలించినట్టు ఆల్ ఇండియా రేడియో వెల్లడించిది.
ఆ మేరకు ట్వీట్ చేస్తూ, "శనివారం తెల్లవారుజామున 3.38 గంటల వరకు తరలింపు ప్రక్రియ కొనసాగిందని, ట్రాక్‌పై ప్రయణికులు ఎవరూ మిగల్లేదని, ఇప్పటి వరకు 15 వేల మందిని సురక్షితంగా తరలించినట్టు" తెలిపింది.
అమర్‌నాథ్ గుహ వద్ద క్లౌడ్ బరస్ట్ కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులకు సహాయం అందజేస్తామని తెలిపారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక ఫోన్ కాల్‌తో చైనా ఎందుకు కలవరపడుతోంది?
ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్న ఈలాన్ మస్క్
ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ఈలాన్ మస్క్ ప్రకటించారు. ఒప్పందంలో పలు నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘించిందని మస్క్ ఆరోపించారు.
ఫేక్ అకౌంట్లు, స్పామ్‌ల గురించి సరైన సమాచారం ఇవ్వని కారణంగానే 44 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మస్క్ ప్రకటించారు.
అపర కుబేరుడు ఈలాన్ మస్క్‌కు, ట్విట్టర్‌కు మధ్య దీర్ఘ కాలంగా కొనసాగుతున్న కథలో ఇది తాజా మలుపు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్విట్టర్‌ను సొంతం చేసుకునేందుకు 44 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు మస్క్.
అయితే, కొనుగోలు ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్విట్టర్ తెలిపింది.
"ఈలాన్ మస్క్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అంగీకరించిన ధర వద్ద, నిబంధనలతో అమలుచేసేందుకు ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉంది" అని ఆ సంస్థ చైర్మన్ బ్రెట్ టేలర్ తెలిపారు.
ఈ అంశంలో చట్టపరంగా ముందుకు సాగుతామని అన్నారు.
శ్రీలంక: ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పు
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని విజయ రహస్యం ఏమిటి, సుదీర్ఘ కాలం ప్రధానిగా ఎలా కొనసాగారు?
SpiceJet: ఈ విమానయాన సంస్థను మూసేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి?
ఏక్‌నాథ్ శిందే: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తుల విలువ ఎంత? ఆయన దగ్గర ఎన్ని కార్లున్నాయి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయమ్మ రాజీనామా
కాళి: ఈ వివాదం ఎందుకు?
వైసీపీ నుంచి విజయమ్మ తప్పుకున్నారా, తప్పించారా? ప్లీనరీ వేదిక మీదే ఎందుకు రాజీనామా ప్రకటన చేయాల్సి వచ్చింది?
షింజో అబే: జపాన్ మాజీ ప్రధానిని కాల్చి చంపిన ఈ వ్యక్తి ఎవరు?
కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలను ఈ మొక్క ఎందుకు భయపెడుతోంది?
బోరిస్ జాన్సన్: ప్రధాన మంత్రి స్థాయికి చేరిన జర్నలిస్టు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య, ఎన్నికల ప్రచారంలో ఉండగా కాల్పులు