విజయమ్మ రాజీనామా, తెలంగాణలో షర్మిలకు అండగా ఉండాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన
తెలంగాణలో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తని, ఇక ముందు జరగబోయేది ఒక ఎత్తని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయమ్మ అన్నారు.
మంగళగిరిలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆమె, తెలంగాణలో ముందుగానే ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు.
తెలంగాణలో షర్మిలకు పార్టీ కార్యక్రమాల్లో సహాయంగా ఉండేందుకు తాను వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కుటుంబంంలో విభేదాలున్నాయనే ప్రచారానికి, వక్రీకణలకు తావులేకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు.
కష్టంలో ఉన్నప్పుడు తాను జగన్ కు అండగా నిలిచానని, ఒంటరిపోరాటం చేస్తున్న షర్మిలకు అండగా ఉండేందుకు ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
రాజీనామా చేస్తున్నందుకు వైఎస్ఆర్ అభిమానులు తనను క్షమించాలని విజయమ్మ అన్నారు.
ఏపీ రాజకీయాలో జగన్‌కు, తెలంగాణలో షర్మిలకు వేర్వేరు రాజకీయ విధానాలు ఉన్నాయన్న విజయమ్మ, ఆ ఇద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకున్నవారేనని అన్నారు.