You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
స్నేహితులు ప్రమాణాలు చేసుకునే పెళ్ళిలాంటి వేడుక
పండర్‌పుర్ వారీ: ‘పీరియడ్స్ అనేవి పాండురంగడు ఇచ్చినవే. అవన్నీ ఆయనకే చెందుతాయి’
సీఐ నాగేశ్వర రావు అరెస్ట్, వివాహితను బెదిరించి, అత్యాచారం చేసిన ఆరోపణల కేసులో విచారిస్తున్న పోలీసులు
బ్రేకింగ్ న్యూస్, విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్టు, 40 మిలియన్ డాలర్లు వెంటనే డిపాజిట్ చేయాలని ఆదేశం
రుణాలు ఎగవేత ఆరోపణలతో విదేశానికి వెళ్ళిపోయిన విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది.
నేరానికి తగిన శిక్ష విధించాలని చెప్పిన సుప్రీం కోర్టు, 40 మిలియన్ అమెరికన్ డాలర్లను (దాదాపు రూ. 318 కోట్లు) వడ్డీతో సహా నాలుగు వారాల్లో డిపాజిట్ చేయాలని మాల్యాను అదేశించింది.
ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయలేని పక్షంలో ఆయన ఆస్తులను జప్తు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.
శ్రీలంక: అధ్యక్షుడు రాజీనామా చేస్తానని అధికారిక సమాచారం ఇచ్చారన్న ప్రధాని విక్రమసింఘె
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష తన రాజీనామాను ధ్రువీకరించారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడిన తరువాత అక్కడి నుంచి పారిపోయిన అధ్యక్షుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది ఇంకా వెల్లడి కాలేదు.
నిరసనకారులు ఇప్పటికీ అధ్యక్ష భవనాన్ని, ప్రధానమంత్రి నివాసాన్ని ఆక్రమించుకునే ఉన్నారు. దేశాధ్యక్షుడు, ప్రధాని తమ పదవులకు రాజీనామా చేసేంతవరకు అక్కడి నుంచి కదిలేది లేదని వారు అంటున్నారు.
శనివారం నాడు పార్లమెంటు స్పీకర్ ఒక ప్రకటన చేస్తూ, అధ్యక్షు జూలై 13న రాజీనామా చేస్తారని చెప్పారు. కానీ, నిరసనకారులు ఆ మాటలను నమ్మడం లేదు.
కాగా, శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె సోమవారం నాడు ఒక ప్రకటన చేస్తూ, అధ్యక్షుడు రాజపక్ష తాను బుధవారం నాడు తన పదవికి రాజీనామా చేస్తానని అధికారిక సమాచారం ఇచ్చారని చెప్పారు. అయితే, ఇంతవరకూ రాజపక్ష నుంచి నేరుగా ఎలాంటి ప్రకటన రాలేదు.
శ్రీలంకకు భారత్ తన సైన్యాన్ని పంపిస్తుందా?
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆ దేశానికి భారత్ తన సైనిక బలగాలను పంపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని శ్రీలంకలోని భారత హైకమిషన్ ప్రకటించింది.
ఈ మేరకు భారత హైకమిషన్ ఒక ట్వీట్ చేస్తూ, “శ్ల్రీలంకకు భారత్ సైన్యాన్ని పంపిస్తోందని మీడియోలో, సోషల్ మీడియాలో వస్తున్న కల్పిత వార్తలను హైకమిషన్ పూర్తిగా ఖండిస్తోంది. శ్రీలంక విషయంలో భారత్ వైఖరికి, ఈ ప్రచారానికి ఎలాంటి సంబంధం లేదు”అని స్పష్టం చేసింది.
“శ్రీలంక ప్రజలు ప్రజాస్వామిక విధానాలు, విలువలతో తమ ఆశలు, ఆశయాలను నిజం చేసుకుని అభివృద్ధి మార్గంలో పయనించాలని, అందుకు మేం వారి వెంట ఉన్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇప్పటికే స్పష్టం చేశారు”అని కూడా హై కమిషన్ తన ట్వీట్‌లో పేర్కొంది.
శ్రీలంక ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ రాజధాని కొలంబోలో శనివారం నాడు ప్రజా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు భారీ సంఖ్యలో దేశాధ్యక్షుడి అధికార నివాసంలోకి చొచ్చుకుపోయారు. ఫలితంగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ప్రధాని నివాసానికి కూడా నిప్పంటించారు.
అసదుద్దీన్ ఓవైసీ: ‘పార్లమెంటు మీది జాతీయ చిహ్నాన్ని ప్రధాని ఎలా ఆవిష్కరిస్తారు...’
వైసీపీ పేరు మార్చడం సాధ్యమవుతుందా, గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?
శ్రీలంక: 'ప్యాలెస్‌ను వదిలేదే లేదు... అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేసే దాకా ఇక్కడే ఉంటాం'
పరుగులో రికార్డులు బ్రేక్ చేస్తున్న 105 ఏళ్ల బామ్మ.. ఈమె పరుగు చూశారా..
‘దేశాన్ని బీజేపీకి రాసివ్వలేదు... టీఆర్ఎస్, జాతీయ పార్టీగా మారితే తప్పేంటి?’- కేసీఆర్
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
రాష్ట్రంలో భారీ వర్షాల పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో భారీ వర్షాల గురించి, దేశంలో బీజేపీ పాలన గురించి కేసీఆర్ మాట్లాడారు.
భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ చెప్పారు.
దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా సైక్లోన్ ఎఫెక్ట్ ఉందని, నాలుగైదు రోజులు తెలంగాణవ్యాప్తంగా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
భారీ వర్షాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే స్పందించేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ యంత్రాంగమంతా సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలు బయటకు రాకుండా రాబోయే మూడు రోజులు అన్నిరకాల విద్యాసంస్థలను మూసివేస్తున్నామని ప్రకటించారు.
బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో ఉందని, దీన్ని ఆపాల్సిన బాధ్యత యువత, మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులదేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ పాలనలో కార్పొరేట్లకు మాత్రమే లాభం జరిగిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శ్రీలంకలో దేశం గౌరవం పోతోందని అన్నారు. భారత ప్రధాని స్థాయి దిగజారిందని విమర్శించారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడో చెప్పాలని నిలదీశారు.
టీఆర్ఎస్ జాతీయపార్టీగా మారితే తప్పేముంది?.. దేశంలో కొత్త పార్టీ రావొద్దా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశమేమన్నా బీజేపీ నాయకులకు రాసిచ్చామా? అని ప్రశ్నించారు. వీళ్లు దేశానికి చేసిందేంటని నిలదీశారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.
బీజేపీ సర్కారు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని విమర్శించారు. వీళ్లు హిందుత్వం పేరు చెప్పి రాజకీయ లబ్ధిపొందుతున్నారని, వీరి గురించి కార్‌పాత్ర మహారాజ్ అనే గురువు బుక్‌కూడా రాశాడని చెప్పారు.
హిందువులకు పవిత్రమైన కాశీని కూడా మోదీ తన రాజకీయం కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు.
కాకినాడలో సుగంధ ద్రవ్యాలు పండిస్తున్న రైతు
‘భారత్‌కు కాళీమాత ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి’- ప్రధాని మోదీ
కాళీ మాత ఆశీర్వాదాలు భారతదేశానికి ఎల్లప్పుడూ తోడుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
స్వామి ఆత్మస్థానంద జయంతి సందర్భంగా వర్చువల్‌గా నరేంద్ర మోదీ మాట్లాడారు. కాళీ మాత అనుగ్రహం పొందిన సాధువు రామకృష్ణ పరమహంస అని అన్నారు. తన జీవితమంతా ఆయన కాళీ మాత పాదాలకు అంకితం చేశాడని చెప్పారు. ఈ జగత్తు సమస్తం తల్లి అనుగ్రహంతోనే నిండి ఉందని వ్యాఖ్యానించారు. బెంగాల్ కాళీ పూజలో ఈ అనుగ్రహం కనిపిస్తుందని అన్నారు.
‘‘కాళీ మాత అనుగ్రహం భారత్‌పై ఎప్పుడూ ఉంటుంది. భారత్ ఇదే ఆధ్యాత్మిక స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. రామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి విజ్ఞానంద నుంచి స్వామి ఆత్మస్థానానంద దీక్ష పొందారు. స్వామి ఆత్మస్థానానందలో పరమహంస ఆధ్యాత్మిక శక్తి స్పష్టంగా కనిపిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
ఇటీవల కాళీ దేవిపై డాక్యుమెంటరీ పోస్టర్‌కు సంబంధించి ఒక వివాదం చెలరేగింది. ఈ పోస్టర్‌లో కాళీమాత వేషధారణలో ఉన్న ఒక మహిళ సిగరెట్ తాగుతున్నట్లు కనిపిస్తారు. దీంతో ఆ డాక్యుమెంటరీ దర్శకురాలు లీనా మణిమేకలై వివాదంలో చిక్కుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కాళీ దేవి గురించి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
శ్రీలంక: అధ్యక్ష భవనం సౌకర్యాలను ఆస్వాదిస్తోన్న నిరసనకారులు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
పాకిస్తాన్‌ను భయపెడుతున్న బురద, రాళ్ల వరదలు.. ఇవి ఎందుకు వస్తున్నాయంటే..
‘విజయమ్మ రాజీనామాకు రాజకీయ రంగు పులుముతున్నారు’- విజయసాయిరెడ్డి
ఒకేసారి రెండు పార్టీల్లో పదవుల్లో ఉండటం సరికాదని, తెలంగాణలో షర్మిలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెబుతూ విజయమ్మ తన రాజీనామా గురించి ప్రకటించినప్పటికీ చంద్రబాబు, దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్లీనరీ విజయవంతం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా మాట్లాడుతూ... ‘‘సకల జనుల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ జరిగింది. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదల శ్రేయస్సే లక్ష్యంగా ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా మహిళా సాధికారతే వైయస్సార్ సీపీ లక్ష్యం. అణగారిన వర్గాలకు, మహిళలకు 70శాతం వరకు అవకాశాలు ఇవ్వడం, స్పీకర్, మండల చైర్మన్ తదితర పదవులు అన్నీ అణగారిన వర్గాలకు ఇవ్వడం రాష్ట్రంలోనే కాదు... దేశ చరిత్రలోనే ఇది ప్రప్రథమం.
ఎంతసేపు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించడమే ప్రధాన అజెండాగా పెట్టుకుంటున్నారే తప్పా... ప్రతిపక్షంగానీ, చంద్రబాబు మీడియా గానీ ప్రజలు గురించి, వారి సమస్యల గురించి పోరాడిన సందర్భాలే లేవు’’ అని అన్నారు.
ప్లీనరీ అయిపోయిన పేవ్‌మెంట్ మీద నడుస్తూ ప్రమాదవశాత్తూ కాలు స్లిప్ అవ్వడంతో బస్సుకింద పడి చనిపోయిన దినేశ్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
జనవాణి కార్యక్రమంలో ప్రజల వినతుల్ని స్వీకరించిన పవన్ కల్యాణ్
వరుసగా రెండో వారం జరిగిన జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చేందుకు తరలివచ్చిన వారితో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు.
తమ పార్టీ ద్వారా వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వికలాంగులు, రైతులు, మహిళలు తమ సమస్యలని ఆయనకి విన్నవించారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆరు వారాల పాటు ఈ కార్యక్రమం సాగుతుందని జనసేన ప్రకటించింది. గతవారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఓ వైపు వాతావరణం సహకరించకపోయినా బాధితులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం వచ్చే వారం కూడా కొనసాగుతుందని జనసేన నాయకులు తెలిపారు.
రాష్ట్రంలో ప్రజల సమస్యలు వినే నాయకుడే లేరని, అందుకే పవన్ కల్యాణ్ చొరవ చూపారని ఆ పార్టీ నాయకుడు పోతిన మహేష్ బీబీసీకి తెలిపారు.
తెలంగాణ: మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రేపట్నుంచి మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సీఎం కేసీఆర్ సెలవులు ప్రకటించారు.
రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశంలో అధికారులతో చర్చించిన సీఎం, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘మీ డబ్బులు మా వద్ద ఉన్నాయ్. కావాలంటే వెంటనే ఇక్కడ క్లిక్ చేయండి’ అంటూ మెయిల్ వస్తే ఇలా చేయండి..