You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన 18 మందిని జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?

  2. స్త్రీ, పురుషుల సమానత్వ సూచీలో అట్టడుగున 135వ స్థానంలో భారత్

    ప్రపంచ ఆర్థిక వేదిక తాజా నివేదిక ప్రకారం.. లింగ సమానత్వ సూచీలో భారతదేశం మొత్తం 146 దేశాల్లో 135వ స్థానంలో నిలిచింది.

    సుమారు 66.2 కోట్ల మహిళా జనాభా ఉన్న ఇండియా, గ్లోబల్ జెండర్ గ్యాప్ విషయంలో 2022 సంవత్సరంలో 0.629 స్కోరు సాధించినట్లు ఆ నివేదిక పేర్కొంది.

    లింగ సమానత్వంలో భారత స్కోరు గత 16 ఏళ్లలో 0.593 నుంచి 0.683 మధ్య ఊగిసలాడుతోందని తెలిపింది.

    ఈ సూచీ కోసం నాలుగు ప్రధానాంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

    • మహిళలకు ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల విషయంలో 143వ స్థానంలో ఉంది.
    • వైద్యం, మనుగడ అంశంలో అన్ని దేశాలకన్నా దిగువన 146వ స్థానంలో నిలిచింది.
    • విద్యాభ్యాసం అంశంలో 107వ స్థానంలో నిలిచింది.
    • రాజకీయ సాధికారత విషయంలో 48వ స్థానంలో ఇండియా నిలిచింది.

    ప్రపంచంలో అగ్ర స్థానంలో ఐస్‌లాండ్ (90.8 శాతం) నిలవగా.. రెండో స్థానంలో ఫిన్లండ్ (86 శాతం), మూడో స్థానంలో నార్వే (84.5 శాతం) నిలిచాయి.

    ఈ నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరంలో ప్రపంచ లింగ అసమానత 68.1 శాతానికి తగ్గింది. ప్రస్తుత పురోగతి రేటు ప్రకారం.. ప్రపంచం సంపూర్ణ లింగ సమానత్వం సాధించటానికి మరో 132 సంవత్సరాలు పడుతుంది.

    అయితే, ప్రాంతాల వారీగా చూసినపుడు, భారతదేశంతో కూడిన దక్షిణాసియా ఈ సూచీలో అట్టడుగున ఉంది. ఈ ప్రాంతంలో సంపూర్ణ లింగసమానత్వం రావటానికి మరో 197 సంవత్సరాలు పడుతుంది.

    ఈ జాబితాలో భారత్ తరువాత మొరాకో, ఖటార్, ఒమన్, అల్జీరియా, కాంగో వంటి దేశాలున్నయి. చివరన 146వ స్థానంలో అఫ్గానిస్తాన్ ఉంది.

  3. వానలు తగ్గినా.. వరదలు భయపెడుతున్నాయి

    గోదావరి వరద తాకిడి పెరుగుతోంది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వరద తీవ్రత మాత్రం పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండు రోజులుగా నిలకడగా ప్రవాహం సాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో సాగుతోంది. గురువారం మధ్యాహ్నం తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది.

    ఇప్పటికే కోనసీమలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద బాధితులను ఎస్టీఆర్ఎఫ్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

    వేల ఎకరాల్లో పంట నీటమునిగింది. రాజమహేంద్రవరం వంతెనల వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగా కనిపిస్తోంది.

    వరదబాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి.

  4. అనకాపల్లి అడవుల్లో నాలుగేళ్ళ పులి

    నాలుగేళ్ల వయసున్న మగ పులిని సబ్బవరం-అనకాపల్లి అటవీ ప్రాంతంల గుర్తించామని చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రామ్ చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఈ పులి ఇప్పటివరకు నాలుగు దూడలను చంపిందని ఆయన అన్నారు. ఇంతవరకు మనుషుల మీద ఎలాంటి దాడులు జరగలేదని చెప్పిన అటవీశాఖ అధికారి, ఇక్కడి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  5. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆగని వర్షాలు... ముంచెత్తుతున్న వరదలు

    తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల వాగులు పొంగి పొరలుతున్నాయి. ప్రాజెక్టులకు గండ్లు పడి వరద నీరు గ్రామాలను ముంచెత్తుతోంది. వేలాది ఎకరాల పంట నీట మునిగింది.

    బుధవారం రాత్రి కడెం ప్రాజెక్టుకు ఎడమ కాల్వ, పవర్ హైజ్, హరిత రిసార్ట్ వద్ద గండ్లు పడ్డాయనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఉదయం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దానిపై వివరణ ఇస్తూ, ఆ ప్రాజెక్ట్ సేఫ్‌గా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు.

    మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజి వద్ద నీటి మట్టం ప్రమాదకరంగా పెరగడంతో దాదాపు 20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదిలారు.

    గోదావరి ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం కాటన్ బరాజ్ వద్ద వరద ప్రవాహం ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఇన్-ఔట్ ఫ్లో 15.22 లక్షల క్యూసెక్కులకు చేరడంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

    విపత్తుల శాఖ ప్రత్యేక స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్‌లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏడు ఎన్డీఆర్ఎఫ్, 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

    గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు.

  6. బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమాచారతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజీ.

    ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.

  7. శ్రీలంక అధ్యక్ష పదవికి గొటాబయ రాజపక్ష రాజీనామా

  8. బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి తొలి రౌండ్ ఓటింగ్‌లో భారత సంతతికి చెందిన రిషి సునక్ విజయం

  9. శ్రీలంకకు సాయం చేసేందుకు భారత్, చైనా చేతులు కలుపుతాయా?

  10. కడెం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

    నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చివరిసారి ప్రాజెక్ట్ అధికారుల నుంచి వరద వివరాలు అందాయి. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు.

    ఉదయం 5 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చిన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. భారీ వరద నేపథ్యంలో ప్రాజెక్ట్ దగ్గర నుంచి అధికారులు బయటకు వచ్చారని, 3 వేల కుటుంబాల ను పునరావాస కేంద్రాలకు తరలించామని మంత్రి మీడియాకు తెలిపారు.

    గతంలో 1995వ సంవత్సరంలో ఇంత భారీ స్థాయిలో వరద వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఉన్న ఇచ్చోడ, బోథ్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది.

  11. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎటు చూసినా నీరే-వరద చిత్రాలు

  12. శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారులు

    పార్లమెంటును ముట్టడించేందుకు వేలమంది ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

    పార్లమెంటు మెయిన్ గేట్ వద్ద భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేసి వారు లోపలికి వెళ్లకుండా నిరోధించారు.

    అయితే, నిరసనకారులు వాటిని అడ్డుతొలగించుకుని పార్లమెంటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణలో పలువురు మహిళలు సహా అనేకమంది గాయపడ్డారు.

    తాము ఇక్కడ సమావేశమయ్యేందుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రయత్నిస్తున్నామని ఒక నిరసనకారుడు వెల్లడించారు.

    ఆందోళనలు జరిగే ప్రాంతానికి పార్లమెంటు భవనం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఈ ప్రాంతం పరిపాలనా రాజధాని జయవర్ధనెపుర నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

  13. శ్రీలంక: ‘అశాంతిని సైన్యం చక్క దిద్దుతుంది’

    దేశంలో నెలకొన్న అశాంతి పరిస్థితులను సైన్యం చక్కబెడుతుందని శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు.

    అధ్యక్ష, ప్రధాని నివాసాలతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న నిరసనకారులు వెంటనే వాటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.

    ఆయన టీవీ ద్వారా శ్రీలంక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

    రణిల్ విక్రమసింఘే చేసిన ఈ వ్యాఖ్యలతో రాజధాని కొలంబోలో ఇకపై శాంతి భద్రతలను సైన్యం చూసుకుంటదనేది అర్థమవుతోంది.

  14. శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసిందనే వదంతులు భారత్‌పై ఎందుకు వస్తున్నాయి

  15. జాహ్నవి దంగేటి: అచ్చం చంద్రుడిపై ఉండే వాతావరణంలో గడిపిన తెలుగమ్మాయి

  16. తెలంగాణలో ఈ నెల 16 వరకు స్కూళ్లకు సెలవు

    భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులను ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించారు.

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని సీఎం కేసీఆర్ సమీక్షించారు.

    వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

  17. తెలంగాణ వరదలు: ‘మనకు సమయం లేదు వెంటనే ఖాళీ చేయించండి’

    గోదావరికి వరద భారీగా పెరుగుతున్నందున వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కొత్తగూడెం కలెక్టర్ ఆదేశించారు.

    ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోందని, గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతోందని అందుకు సిద్ధమవ్వాలని సూచించారు.

    ‘భద్రాచలం టౌన్‌ ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలి. దుమ్ముగూడెం, చేర్ల మండలాల్లో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. మిగతా గ్రామాల నుంచి ప్రజలను పూర్తిగా ఖాళీ చేయించండి. ఏది ఏమైనా ఈ రోజే ఈ ప్రక్రియ పూర్తి కావాలి.’ అని తెలిపారు.

  18. ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా

  19. ఆ చిన్నారి మెడ 90 డిగ్రీలు వంగిపోయింది, 12 ఏళ్ల నరకయాతన నుంచి చివరకు ఎలా బైటపడింది

  20. చిత్రాల్లో శ్రీలంక నిరసనలు

    శ్రీలంకలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు ప్రధాని మంత్రి కార్యాలయాన్ని చుట్టుముట్టారు.

    అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష శ్రీలంక విడిచి పారిపోవడంతో ప్రజల్లో మరింత ఆగ్రహం చెలరేగింది.

    గోటాబయ రాజపక్ష నేడు రాజీనామా లేఖ పంపుతారని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ తెలిపారు.