You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. బ్రేకింగ్ న్యూస్, ‘నేడు రాజీనామా లేఖ పంపనున్న గోటాబయ రాజపక్ష’

    శ్రీలంక నుంచి పారిపోయిన అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష నేడు రాజీనామా పంపిస్తారని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు.

    శ్రీలంక బయట ఉన్న గోటాబయ రాజపక్ష తనకు ఫోన్ చేసి మాట్లాడారని, ఇంతకు ముందు హామీ ఇచ్చినట్లుగానే రాజీనామా లేఖ పంపుతున్నట్లు తెలిపారని స్పీకర్ చెప్పుకొచ్చారు.

    గోటాబయ రాజపక్ష రాజీనామా చేసిన తరువాత నెల రోజులపాటు ఎవరో ఒకరు తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపడతారు. ఆ తరువాత ఎన్నికలు నిర్వహించి అధ్యక్షున్ని ఎన్నుకుంటారు.

  2. ఊరు బయట పొలాల్లో ఐపీఎల్ ఆడతారు, రష్యన్లతో బెట్టింగ్‌ చేసి లక్షల రూపాయలు కొట్టేస్తారు

  3. తెలంగాణ వరదలు: భారీ వర్షాలతో కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్‌కు భారీగా ఇన్‌ఫ్లో

    తెలంగాణలో భారీ వర్షాల ధాటి కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయిదో రోజు విస్తారంగా వర్షాలు కురిశాయి. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

    నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి సామర్థ్యాన్ని మించి ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందన్న వార్తలు వచ్చాయి.జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులతో కలిసి ప్రాజెక్ట్‌ను సందర్శించారు.ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, గేట్లు అన్నీ పనిచేస్తున్నాయని ప్రాజెక్ట్ అధికారి సుశీల్ మీడియాకు తెలిపారు. ఎగువ బోథ్ ప్రాంతంలో భారీ వానలతో4 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిర్మల్ జిల్లాలో 18 సె.మీ సగటు వర్షపాతం నమోదైంది.

    కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్‌కు ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి భారీ ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో 81 గేట్లను పైకి ఎత్తి 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

    నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ మహారాష్ట్ర నుంచి వరద కొనసాగుతోంది. మంగళవారం నుంచి ప్రాజెక్ట్ లెవల్‌ను 76 టీఎంసీల వద్ద స్థిరంగా ఉంచి మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు.

    రాజన్నసిరిసిల్ల జిల్లాలో అప్పర్ మానేరు డ్యామ్ పొంగిపొర్లుతోంది.

    కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో దిగువన గోదావరిపై ఉన్న పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీ వరద చేరింది. 45 గేట్లు ఎత్తి 9 లక్షల పైచిలుకు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

    చెన్నూరు, మంచిర్యాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.

    ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కొమురం భీమ్ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తేసారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

    భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలతో 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వాసితులకు భోజన వసతి కల్పించారు.

    జగిత్యాల జిల్లా రాయికల్ వద్ద రామోజీవాగులో నిన్న కారుతో సహా గల్లంతైన ఎన్టీవీ జర్నలిస్ట్ జమీర్ ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

    నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి.

    కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీలో బట్టలు ఆరేసే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మంగళవారం మృత్యువాత పడ్డారు.

    ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు ఉదయం 8:30 గంటల వరకు ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి, పెద్దపల్లి, వరంగల్, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ హెచ్చరించింది.

  4. గోదావరి వరదలు: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన ప్రవాహం

    గోదావరి వరద ఉధృతి ప్రభావం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి వరద ప్రవాహం సాగుతోంది. బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయానికి కాటన్ బ్యారేజ్ నుంచి 15.3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కోనసీమలోని అనేక లంక గ్రామాలు, గోదావరి తీర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల పంట నీటిపాలైంది. వందల ఇళ్లు జలమయం అయ్యాయి.

    పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్ వే ద్వారా 15లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు మేఘ సంస్థ వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో వరద నీటిని ఆరంభంలోనే 48 గేట్ల ద్వారా పంపించడం అరుదైన విషయమని చెబుతోంది.

    గోదావరి వరదల కారణంగా పోలవరం నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజులుగా వరద నీటిలో నానుతున్న గ్రామాలు ఎగువన పెరుగుతున్న వరద తాకిడి మూలంగా మరింత కలవరపడుతున్నాయి.

    ఇప్పటికే కాళేశ్వరం, పేరూరు వంటి చోట్ల నీటిమట్టం పెరుగుతున్న తరుణంలో భద్రాచలం వద్ద మరోసారి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తద్వారా కూనవరం, వీఆర్ పురం, చింతూరు, దేవీపట్నం, పోలవరం మండలాల్లో ప్రజలు వరద ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోంది.

    సహజంగా ఏటా ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వస్తాయి. కానీ వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో జూలైలోనే ఇంత పెద్ద స్థాయిలో వరదలు రావడం అనూహ్యమని గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ విశ్వశ్వరరావు బీబీసీతో అన్నారు. వరదలకు అనుగుణంగా అన్ని రకాలుగా అప్రమత్తమయ్యాయమని చెప్పారు.

    ఇప్పటికే 18 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా భారీ వర్షాలు, వరదల ప్రభావంపై అధికారులతో సమీక్ష జరిపారు. వరదల్లో చిక్కుకున్న వారికి కుటుంబానికి రూ. 2వేల చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు.

  5. ‘రాజపక్ష దేశం దాటడంలో భారత్ ఎలాంటి సహాయం చేయలేదు’- భారత హై కమిషన్

    శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్షలను దేశాన్ని దాటించడంలో భారత్ సహాయం చేసిందని వస్తోన్న మీడియా కథనాలను శ్రీలంకలోని భారత హై కమిషన్ ఖండించింది.

    ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

    శ్రీలంక ప్రజలకు సహాయం చేయడాన్ని కొనసాగిస్తామని పునరుద్ఘాటించింది.

    తీవ్ర నిరసనల మధ్య శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మిలిటరీ జెట్‌లో దేశం నుంచి పారిపోయారు.

    73 ఏళ్ల గోటబయ రాజపక్ష మాల్దీవుల రాజధాని మాలే చేరుకున్నట్లు తెలిసింది.

    జూలై 13న అంటే ఈరోజు తన పదవికి రాజీనామా చేస్తానని గోటాబయ గతంలో ప్రకటించారు.

    భారత్ తన సైన్యాన్ని శ్రీలంకకు పంపుతున్నట్లు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతోన్న వార్తలను ఖండిస్తూ జూలై 10వ తేదీన భారత హైకమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

  6. పీరియడ్స్ సమయంలో మహిళలకు ఆలయ ప్రవేశం, పాండురంగ దర్శనం కోసం యాత్రగా వస్తున్న భక్తులు

  7. తెలంగాణలో భారీ వర్షాలు: ప్రమాదకర స్థితిలో కడెం ప్రాజెక్టు, పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతోంది. ఇలాగే వరద వస్తే ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉన్నందున దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ప్రాజెక్టు అధికారులు హెచ్చరించారు.

    ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.

    ఎగువ ప్రాంతంలో ఇటు ఎస్సారెస్పీ నుంచి అటు బోథ్ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి చేరుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు.

    ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామని తెలిపారు.

    ‘‘ప్రస్తుతం వర్షాలు తగ్గితేనే వరద నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైతే కొద్దిగా వరద నీటి ప్రవాహం తగ్గింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం’’ అని చెప్పారు.

  8. గొటాబయ రాజపక్షకు వ్యతిరేకంగా మాల్దీవుల్లో శ్రీలంక జాతీయుల నిరసన

  9. శ్రీలంక: ప్రభుత్వం నిండా రాజపక్ష కుటుంబ సభ్యులే... రేపు వాళ్ల పరిస్థితి ఏంటి?

  10. శ్రీలంక: అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మిలటరీ జెట్‌లో దేశం విడిచి పారిపోయారు

  11. జాహ్నవి దంగేటి: అచ్చం చంద్రుడిపై ఉండే వాతావరణంలో గడిపిన తెలుగమ్మాయి.. ఆమె స్పేస్ కల ఎలా నెరవేరింది?

  12. INDvENG: మొదటి వన్డేలో భారత్ ఘన విజయం.. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పరాజయం

    మొదటి వన్డేలో ఇంగ్లండ్ నిర్దేశించిన 111 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సాధించింది.

    ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ 18.4 ఓవర్లలోనే 114 పరుగులు చేశారు.

    రోహిత్ శర్మ 58 బంతుల్లో ఐదు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 76 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 54 బంతుల్లో నాలుగు ఫోర్లతో 31 పరుగులు చేశారు.

    మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది.

  13. ద్రౌపది ముర్ము : బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్ జగన్, చంద్రబాబు ఎందుకు మద్దతు ప్రకటించారు?

  14. అదృష్టాన్ని కాదు.. గణితాన్ని నమ్ముకున్నారు.. లాటరీల్లో రూ. 140 కోట్లు సంపాదించారు.. ఎలాగంటే..

  15. INDvENG1st ODI: జస్‌ప్రీత్ బుమ్రాకు 6 వికెట్లు..ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్

    భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఇంగ్లండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.

    అయితే, ఆ జట్టు అనూహ్యరీతిలో 25.2 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.

    నలుగురు బ్యాటర్లు డకౌట్ అవ్వగా, నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

    ఇంగ్లండ్ జట్టులో అత్యధికంగా కెప్టెన్ జోస్ బట్లర్ 32 బంతుల్లో ఆరు ఫోర్ల సహాయంతో 30 పరుగులు చేశాడు.

    జస్‌ప్రీత్ బుమ్రా 7.2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీయగా, మొహమ్మద్ షమీ 7 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 5 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

    బుమ్రా తీసిన ఆరు వికెట్లలో నాలుగు బౌల్డ్ ఔట్‌లు. వేసిన 7.2 ఓవర్లలో మూడు ఓవర్లు మెయిడెన్లు.

  16. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము భేటీ

    ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయ్యారు.

    టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమెకు స్వాగతం పలికారు.

    గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికచేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

    రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ కూడా ఆమెకే మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

  17. ఆటోలో 27 మంది ప్రయాణీకులు.. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ కింద ఆటోను సీజ్ చేసిన పోలీసులు

  18. ఆంధ్రప్రదేశ్‌లో ద్రౌపది ముర్ము: వైఎస్ జగన్‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్మును గెలిపిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

    సామాజిక న్యాయంవైపు నిలబడిన ప్రభుత్వం తమదని, చేతల్లోనే ఆ విషయాన్ని చూపించామని, మరో అడుగు ముందుకేస్తూ ద్రౌపది ముర్మును ఎన్నుకుంటామని తెలిపారు.

    ఈనెల 18వ తేదీన జరిగే ఎన్నికలో ఏ ఒక్కరూ తప్పకుండా ఓటు వేసేలా పార్టీ విప్‌లు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

    రాష్ట్రపతి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరుతూ ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల నాయకులతో భేటీ అవుతున్నారు.

    ఆ క్రమంలో మంగళవారం ఆమె ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు.

    ద్రౌపది ముర్ముకు వైఎస్ జగన్, ఆయన భార్య భారతీ రెడ్డిలు తమ నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.

    అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు.

    ద్రౌపది ముర్ము పర్యటనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

  19. వాడిపారేసే ప్లాస్టిక్‌లో రీసైక్లింగ్ అవుతోంది ఎంత? పూర్తిగా రీసైక్లింగ్ ఎందుకు కావట్లేదు?

  20. లెబనాన్: ప్రజల్ని విదేశాలకు పంపిస్తారు.. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్లే తమ దేశాన్ని బలోపేతం చేస్తారు.. ఎలాగంటే..