You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మహమ్మద్ జుబైర్: మత విద్వేషాలను ప్రేరేపించారనే ఆరోపణలతో 'ఆల్ట్ న్యూస్' జర్నలిస్ట్ అరెస్ట్

ఆల్ట్ న్యూస్ జర్నలిస్ట్ మహమ్మద్ జుబైర్‌ను దిల్లీ పోలీసు విభాగంలోని స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన మీద అభియోగాలు మోపారు. నూపుర్ శర్మ వ్యాఖ్యల వీడియో షేర్ చేయడంతో ఇటీవల జుబైర్ వార్తల్లో నిలిచారు.

లైవ్ కవరేజీ

  1. అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించిన మన్యం వీరుడి కథ

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌‌డేట్ల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  3. నేటి ముఖ్యాంశాలు

    మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

    కేంద్ర మంత్రిని ఎరువుల కొరత గురించి ప్రశ్నించిన ఘటనలో బీదర్‌కు చెందిన ఒక టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లుగా వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు.

    బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    జర్మనీలోని బవేరియాలో జరుగుతోన్న జీ-7 శిఖరాగ్ర సదస్సు రెండో రోజూ కూడా యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర అంశమే ప్రాధాన్య అంశంగా చర్చల్లో నిలిచింది.

    ఆల్ట్ న్యూస్ కోఫౌండర్, జర్నలిస్టు మహమ్మద్ జుబైర్‌ను దిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ సెల్ సోమవారం అరెస్టు చేసింది. విద్వేషాలను రెచ్చగొట్టారని, కొందరి మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  4. చంద్రకాంత్ పండిత్: దేశవాళీ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్ కథేంటో తెలుసుకోండి

  5. ఆల్ట్ న్యూస్ జర్నలిస్టు మహమ్మద్ జుబైర్ అరెస్టు

    ఆల్ట్ న్యూస్ కోఫౌండర్, జర్నలిస్టు మహమ్మద్ జుబైర్‌ను దిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ సెల్ సోమవారం అరెస్టు చేసింది.

    విద్వేషాలను రెచ్చగొట్టారని, కొందరి మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వీడియో షేర్ చేయడంతో ఇటీవల జుబైర్ వార్తల్లో నిలిచారు.

    ఐపీసీలోని సెక్షన్ 153ఏ, 295ఏ కింద జుబైర్‌ను అరెస్టు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    జుబైర్ అరెస్టైనట్లు ఆల్ట్ న్యూస్ ఫౌండర్ ప్రతీక్ సిన్హా ట్వీట్ చేశారు. 2020లో నమోదైన ఒక కేసుకు సంబంధించి జుబైర్‌ను ప్రశ్నించడానికి పోలీసులు పిలిచారని ప్రతీక్ తెలిపారు.

    ‘‘ఈ కేసులో అరెస్టు చేయకుండా హైకోర్టు ఆయనకు రక్షణ కల్పించింది. అయినప్పటికీ సాయంత్రం 6.45 గంటలకు వేరే ఎఫ్ఐఆర్ కింద అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. ఆ ఎఫ్ఐఆర్ కింద మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అరెస్టు సమయంలోనూ ఎలాంటి ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు’’అని ప్రతీక్ ట్వీట్ చేశారు.

    అయితే, జుబైర్‌కు వ్యతిరేకంగా ఈ కేసులో తగిన ఆధారాలు దొరికాయని, అందుకే ఆయన్ను అరెస్టు చేశామని దిల్లీ పోలీస్ డీసీపీ మల్హోత్రా తెలిపారు.

    జుబైర్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు మల్హోత్రా చెప్పారు.

  6. నిజాం నవాబులు ఈ దూద్ బాయి నీళ్ళే తెప్పించుకుని తాగేవారట...

  7. సౌండ్ ఎఫెక్ఠ్‌ల కోసం బైకులకు సైలెన్సర్లు మార్చుకుంటే... ఇలా జరుగుతుంది

  8. ‘చలికాలంలోగా ఈ యుద్ధం ముగిసిపోవాలి’’- జెలియన్‌స్కీ

    జర్మనీలోని బవేరియాలో జరుగుతోన్న జీ-7 శిఖరాగ్ర సదస్సు రెండో రోజూ కూడా యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర అంశమే ప్రాధాన్య అంశంగా చర్చల్లో నిలిచింది.

    ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న వొలొదిమీర్ జెలియన్‌స్కీ మాట్లాడుతూ... చలికాలం కంటే ముందే ఈ యుద్ధం యుగియాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే రష్యాపై ఒత్తిడిని కొనసాగించాలని జీ-7 దేశాల నాయకులను కోరారు. తన ప్రసంగంలో యుక్రెయిన్‌కు మరిన్ని భారీ ఆయుధాలు, విమాన నిరోధక రక్షణ వ్యవస్థలు అందించాలని, రష్యాపై ఆంక్షలు కొనసాగించాలని అన్నారు.

    యుద్ధం జరుగుతున్నంత కాలం యుక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామని జీ-7 దేశాల నేతలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు.

    యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ బీబీసీతో మాట్లాడుతూ... యుక్రెయిన్‌ ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించేందుకు, ధాన్యం ఎగుమతితో పాటు యుక్రెయిన్ పౌరులను రక్షించడంలో మద్దతును కచ్చితంగా కొనసాగించాలని అన్నారు.

    యుక్రెయిన్‌కు మద్దతుగా జీ-7 గ్రూపు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేస్తుందని అమెరికా తెలిపింది.

  9. కర్ణాటక: హిందూ ఆలయంలో అరటి పండ్ల ముస్లిం వ్యాపారిపై ఏమిటీ వివాదం, అసలేం జరుగుతోంది?

  10. శ్రీలంక సంక్షోభం: తినడానికి ఏమీ లేక సముద్రం నీటిని తాగి స్పృహ తప్పి పడిపోయిన వృద్ధ జంట

  11. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)

    బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఈ మనీలాండరింగ్ కేసు ప్రస్తుతం జైల్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించింది. సోమవారం ఈడీ ప్రధాన కార్యాలయంలో జాక్వెలిన్ విచారణకు హాజరయ్యారు.

    ఈ కేసులో ఈడీ సుకేశ్ స్టేట్మెంట్ కూడా తీసుకుంది. ఏప్రిల్ నెల చివరలో జాక్వెలిన్‌కు చెందిన రూ. 7.27 కోట్ల ఆస్తులను డీ జప్తు చేసింది.

    సుకేశ్ మీద మనీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్-2002 కింద కేసు నమోదైంది.

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ గతంలోనూ ప్రశ్నించింది.

  12. రాష్ట్రపతి ఎన్నికలు: నామినేషన్ వేసిన యశ్వంత్ సిన్హా

    ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు.

    కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర విపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేటప్పుడు కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. ఆయన కుమారుడు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీ రామా రావు కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరు అయ్యారు.

    జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించింది.

  13. కర్నాటక: ‘కేంద్ర మంత్రిని ప్రశ్నించిన టీచర్ సస్పెండ్’

    కేంద్ర మంత్రిని ఎరువుల కొరత గురించి ప్రశ్నించిన ఘటనలో బీదర్‌కు చెందిన ఒక టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లుగా వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    ఎరువుల కొరత గురించి మాట్లాడేందుకు కుషాల్ పాటిల్ అనే టీచర్, కేంద్ర రసాయనాలు-ఎరువుల సహాయక మంత్రి భగవంత్ ఖుబాకు ఫోన్ చేశారు.

    ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    ‘వ్యవసాయం చేసుకునే కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఎరువుల గురించి అడిగాను. దానికే నా మీద వేటు వేశారు. పోయిన సీజన్‌లో ఎరువుల కొరతతో చాలా ఇబ్బందులు పడ్డాను. అందుకే ఈసారి పరిస్థితి కనుక్కుందామని కేంద్ర మంత్రికి ఫోన్ చేశాను.’ అని కుషాల్ పాటిల్ ఏఎన్‌ఐతో అన్నారు.

  14. కండోమ్ వాడకంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పురుషులు ఏమంటున్నారు?

  15. మహారాష్ట్ర: శివసేన రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీం కోర్టులో విచారణ

    మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

    కాసేపట్లో ఈ పిటీషన్ మీద విచారణ ప్రారంభం కానుంది.

    బాల్ ఠాక్రే హిందుత్వ సిద్ధాంతాలకు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన దూరంగా జరిగిందని ఆరోపిస్తూ కొద్ది రోజుల కిందట ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు చేశారు. సుమారు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు ఆయన శిబిరంలో చేరారు.

    అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల ఉమ్మడి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు.

  16. కులాంతర వివాహం: ‘ఏడాది తరువాత అల్లుడిని చంపించిన అత్త’

    అనంతపురం జిల్లా రాప్తాడులో కులాంతర వివాహం చేసుకున్నందుకు ఏడాది తర్వాత అల్లుడిని చంపించిన అత్త కేసులో అసలేం జరిగింది. బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్...

  17. రాష్ట్రపతి ఎన్నికలు: నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్

    ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే వంటి ప్రతిపక్షాలు ఆయనను అభ్యర్థిగా నిలబెట్టిన విషయం తెలిసిందే.

    మమతా బెనర్జీ, మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేశ్, శరద్ పవార్ వంటి నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.

    విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేటప్పుడు కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. ఆయన కుమారుడు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీ రామా రావు కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

    జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించింది.

  18. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.