You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. జులై 1 నుంచి దేశమంతా ప్లాస్టిక్ నిషేధం- ఈ లిస్ట్‌లోని వస్తువులు వాడితే అయిదేళ్ల జైలు శిక్ష

  2. లోన్ యాప్స్ రద్దు చేయాలంటూ కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ లేఖ

    లోన్ యాప్స్‌ను రద్దు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ లేఖ రాశారు.

    లోన్ యాప్‌ల నిర్వాహకులు చేసే దారుణాల వల్ల అనేక మంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

    పోలీసు శాఖలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతోపాటు చిన్న, మధ్యతరహా, చిరు వ్యాపారులు, తక్కువ ఆదాయ వర్గాలకు సులభంగా రుణాలు ఇచ్చేలా పాలసీలు తీసుకురావాలని శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.

  3. వాహనాలపై ఫాస్టాగ్ స్టిక్కర్‌ స్కాన్ చేసి డబ్బులు దొంగిలిస్తున్నారా

  4. రాజస్థాన్: టైలర్ హత్య కేసును విచారించనున్న ఎన్‌ఐఏ

    రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన టైలర్ హత్య కేసును విచారించాల్సిందిగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

    ఇందులో విదేశీ సంస్థల కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా విచారించనున్నట్లు హోంశాఖ తెలిపింది.

    మహ్మద్ ప్రవక్త మీద బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉదయ్‌పుర్‌లోని కన్నయ్య లాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

    దీనికి ప్రతీకారంగా రియాజ్ అఖ్తర్, ఘోష్ మహ్మద్ అనే ఇద్దరు లాల్‌ను తల నరికి చంపేశారు.

  5. ఆంధ్రప్రదేశ్: రూ.68 లక్షల మద్యం ధ్వంసం

    ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా రేణిగుంటలో అక్రమంగా పట్టుబడిన మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించారు.

    సుమారు రూ.68 లక్షల విలువైన 32,341 సీసాలను ధ్వంసం చేసినట్లు తిరుపతి ఎస్పీ పి.పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

    తమిళనాడు నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లోకి మద్యం తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

  6. బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర: బలపరీక్షపై సాయంత్రం సుప్రీం కోర్టులో విచారణ

    మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష చేపట్టాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ జారీ చేసిన ఆదేశాలపై శివసేన దాఖలు చేసిన పిటీషన్ విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

    ఈ రోజు సాయంత్ర 5 గంటలకు ఆ పిటీషన్ మీద కోర్టు విచారణ చేపట్టనుంది.

  7. మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షపై సుప్రీం కోర్టుకు వెళ్తాం... శివసేన

    రేపు అసెంబ్లీని సమావేశపరిచి బలపరీక్ష నిర్వహించాలన్న మహారాష్ట్ర గవర్నర్ ఆదేశాలపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.

    ‘ఇలా ఆదేశాలు ఇవ్వడం చట్టవ్యతిరేకం. 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల అన్హరత పిటీషన్ సుప్రీం కోర్టు విచారణలో ఉంది.’ అని ఆయన అన్నారు.

  8. బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్రలో రేపు బలపరీక్ష

    మహారాష్ట్రలో రేపు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించనున్నారు.

    మహారాష్ట్ర విధాన సభ రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.

    శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేలతో ఆయన అస్సాంలో క్యాంప్ పెట్టారు.

    శివసేన తమదే అంటూ ఏక్‌నాథ్ శిందే చెబుతున్నారు.

  9. కొలంబియా జైలులో మంటలు... 51 మంది మృతి

    కొలంబియాలోని ఒక జైలులో చెలరేగిన మంటల వల్ల సుమారు 51 మంది చనిపోయారు.

    ‘మంగళవారం పొద్దున తులువాలోని జైలులో ఖైదీలు గొడవకు దిగారు. ఈ గొడవను ఆపేందుకు సెక్యూరిటీ గార్డులు ప్రయత్నించారు.

    కానీ గార్డులను అడ్డుకునేందుకు పరుపులకు కొందరు ఖైదీలు నిప్పు పెట్టారు.’ అని కొలంబియా నేషనల్ ప్రిజన్ అథారిటీ అధికారులు తెలిపారు.

    ఈ ఘటనలో దాదాపు 30 మంది గాయపడ్డారు.

    ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని ఎవరూ జైలు నుంచి తప్పించుకోలేదని అధికారులు వెల్లడించారు.

    కొలంబియా వంటి లాటిన్ అమెరికా దేశాల్లో జైళ్లలో పరిమితికి మించి ఖైదీలను ఉంచుతున్నారు.

  10. ఉదయపూర్: మొహమ్మద్ ప్రవక్త‌పై వ్యాఖ్యలకు ‘ప్రతీకారంగా’ టైలర్ హత్య.. వీడియోలో ప్రధాని మోదీని కూడా బెదిరించారు

  11. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

  12. మహారాష్ట్ర: ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా

  13. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్: జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సోనియా గాంధీలను విచారిస్తున్న ఈడీ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది

  14. సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న వందన... అమితాబ్‌ బచ్చన్‌కు ఎన్నో లేఖరు రాశారు, ఆయన కొన్నింటికి బదులిచ్చారు

  15. శ్రీకాకుళంలో గోల్కొండ నవాబులు పాలించిన షేర్ మహమ్మద్ పురం కథ తెలుసా

  16. క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న 4 కొత్త మందులు

  17. రిలయన్స్ జియోకు ముకేశ్ అంబానీ రాజీనామా, కొత్త చైర్మన్‌గా అకాశ్ అంబానీ

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ మంగళవారం రిలయన్స్ గ్రూపుకు చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియోకు రాజీనామా చేశారు.

    వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు. ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీని కొత్త చైర్మన్‌గా నియమించారు.

    అకాశ్ అంబానీ గురించి....

    ఆకాశ్ అంబానీ 2009లో ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఐబీ డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2013లో అమెరికా బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ కామర్స్‌లో గ్యాడ్యుయేట్ అయ్యారు.

    తన చదువును పూర్తి చేసుకున్న తర్వాత ఆకాశ్, రిలయన్స్ జిమోఇన్ఫోకామ్ లిమిటెడ్‌లో పనిచేశారు.

    ఆకాశ్‌ చిన్నతనం నుంచే టెక్నాలజీ పట్ల ఆసక్తి కనబరిచేవారు. జియో మెసేజింగ్, చాట్ ప్రోడక్ట్‌లతో పాటు ఇతర డిజిటల్ సర్వీస్ అప్లికేషన్స్‌ అభివృద్ధిలో ఆయన పాలుపంచుకున్నారు.

    వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా చిన్న కూతురు శ్లోకా మెహతాతో ఆకాశ్ వివాహం జరిగింది.

  18. ‘‘జుబైర్‌ను విడుదల చేయాలి’’- ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా డిమాండ్

    జర్నలిస్టు మహమ్మద్ జుబైర్ అరెస్టును మంగళవారం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

    ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘‘ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ అరెస్టును ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఖండిస్తోంది. 2018 నాటి ఒక ట్వీట్‌ను పరిగణలోకి తీసుకుంటూ మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారనే ఆరోపణలతో దిల్లీ పోలీసులు జూన్ 27న జుబైర్‌ను అరెస్ట్ చేశారు.

    ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ వేదికల్లో భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడానికి కృషి చేస్తామని భారత్ స్పష్టం చేసిన రోజునే మొహమ్మద్ జుబైర్‌ను అరెస్ట్ చేయడం విడ్డూరం అని ఆ ప్రకటలో పేర్కొంది.

    అంతేకాకుండా తీస్తా సెతల్వాద్ అరెస్టుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేయబడింది.

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మొహమ్మద్ జుబైర్, తీస్తా సెతల్వాద్ అరెస్ట్‌పై విస్మయం వ్యక్తం చేశారని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    విద్వేషాలు వ్యాప్తి చేసిన వారిపై చర్యలు తీసుకోవట్లేదు. కానీ, తీస్తా సెతల్వాద్, మొహమ్మద్ జుబైర్‌లను ఎందుకు అరెస్ట్ చేశారని ఆమె ప్రశ్నించినట్లు పీటీఐ తెలిపింది.

  19. చెస్ ఒలింపియాడ్ 2022: తమిళనాడులో రష్యా-యుక్రెయిన్ పోరు

  20. సెక్స్ అంటే అరబ్ కుర్రాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వయాగ్రాకు అక్కడ ఎందుకంత డిమాండ్?