You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. దిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు

  2. ‘‘నేనే ఆ అమ్మాయిని సజీవ దహనం చేశాను. ఆమె అరుపులు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి’’

  3. ‘ఇస్లాం పవిత్ర నగరం’ మక్కాలో ప్రవేశించి వీడియో తీసిన ముస్లిమేతర జర్నలిస్ట్.. ఈయన ఎవరు? ఎందుకు వెళ్లారు?

  4. అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ. 21 కోట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ. ఈమె ఎవరు? మమత ప్రభుత్వంలోని మంత్రికీ ఆమెకూ లింకేంటి?

  5. ఒకపరి కొకపరి వీడియో తొలగించిన శ్రావణ భార్గవి.. ‘అన్నమయ్యపై అభిమానంతోనే వీడియోను తొలగిస్తున్నా’

  6. కశ్మీర్ లోయలో భయం నీడలో జీవిస్తున్న కశ్మీరీ పండితులు, కశ్మీరేతరులు

  7. చైనా: పిచ్చుకలపై యుద్ధం కోట్లాది మంది ప్రజల చావుకు ఎలా కారణమైంది? దేశం నరకంలా ఎందుకు మారింది?

  8. ‘ముస్లింలు మైనారిటీలుగా ఉన్న దేశాలకు వెళ్లి పిల్లల్ని కనండి’ అని పాకిస్తాన్ మంత్రి ఎందుకు అన్నారు?

  9. పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్

  10. ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు నోటీసులు పంపిన ఎన్నికల సంఘం

    మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

    శివసేనలో తమకు మెజారిటీ సభ్యులు ఉన్నారని నిరూపించేందుకు సాక్ష్యాలను సమర్పించాల్సిందిగా ఇద్దరినీ ఎన్నికల సంఘం కోరినట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    దీనితో పాటు, 2022 ఆగస్టు 8 లోపు ఈ లేఖకు సమాధానం ఇవ్వాలని కమిషన్ కోరింది.

    శివసేన ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అరవింద్ సావంత్ మాట్లాడుతూ, "కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు పంపింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు" అని చెప్పారు.

    శివసేన జాతీయ కార్యవర్గం పూర్తి నివేదికను ఎన్నికల కమిషన్‌కు సమర్పించామని కూడా ఆయన చెప్పారు.

  11. విమానంలో ప్రయాణికుడికి అత్యవసర చికిత్స చేసిన తెలంగాణ గవర్నర్

    వారణాసి నుంచి తిరుగు ప్రయాణంలో దిల్లీ మీదుగా హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.

    గుండెల్లో నొప్పితోపాటు, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆ ప్రయాణికుడు, విమానం టేకాఫ్ అయిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విమానంలో డాక్టర్లు ఎవరైనా ఉన్నారా అని విమాన సిబ్బంది ప్రయాణికులను అడగ్గా, వెంటనే డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించి, ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు.

    కాసేపటికి అస్వస్థతను నుంచి కోలుకున్న ప్రయాణికుడు తనకు చికిత్స అందించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు డాక్టర్ తమిళిసై చేస్తున్న ప్రాథమిక చికిత్సను ఫొటోలు తీసి ట్విటర్‌లో షేర్ చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యను చదివారు.

  12. భారత్‌లో పెరిగిన కోవిడ్ కేసులు

    దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 21,411 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    నిన్న ఒక్క రోజే 67మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,25,997 కి చేరుకుంది.

    డైలీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉందని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి నుంచి 4,31,92,379 మంది కోలుకున్నారనీ, ప్రస్తుతం 1,50,100 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

  13. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఏడో ర్యాంక్ సాధించిన అన్నూ రాణి

    భారత జావెలిన్ త్రో ప్లేయర్ అన్నూ రాణి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో స్థానంలో నిలిచింది. ఆమె విసిరిన జావెలిన్ 61.12 మీటర్ల దూరంలో పడింది.

    ఆస్ట్రేలియా ఛాంపియన్ కెల్సీ-లీ బార్బర్ 66.91 మీటర్ల జావెలిన్ విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

    మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో అన్నూ రాణి 56.18 మీటర్ల ఆట ప్రారంభించింది. ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి మాత్రమే జావెలిన్‌ను 60 మీటర్లు దాటి విసరగలిగింది.

    ఆరు ప్రయత్నాల్లో వరుసగా 56.18మీ, 61.12మీ, 59.27మీ, 58.14మీ, 59.98మీ, 58.70మీ దూరం విసిరింది.

    అమెరికాలోని ఒరెగాన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022లో అన్నూ రాణి బుధవారం 59.60 మీటర్ల జావెలిన్ త్రో చేసి ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. దీంతో, ఆమె వరుసగా రెండుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్‌కు చేరుకుంది.

  14. 'నా మీసాలు నా ఇష్టం' అంటూ మీసం మెలేస్తున్న మహిళ

  15. తెలంగాణలో భారీ వర్షాలు.. ముంచెత్తుతున్న వరద నీరు

    తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక పరిశ్రమ గోడ కూలి, ఇంటిపై పడడంతో ఇద్దరు బిహారీ కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

    మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లభాపూర్ గ్రామంలోని ఈదుల్ చెరువు నలుగు పారడంతో జాతీయ రహదారిపై నీరు చేరింది. హైదరాబాద్-కామారెడ్డి జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీటిలో బైక్ మీంచి పడి చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందారు.

    ఏడుపాయల వద్ద మంజీరా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆటో నగర్ ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. దుకాణాలు నీట మునిగాయి.

    ములుగు జిల్లా జనగలంచ వద్ద వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయింది. ఏటురునాగారంవైపు వెళ్లే వాహనాలను నార్లాపూర్, మేడారం మీదుగ మళ్లించారు.

    మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసిన అవకాశం ఉందని హైదరాబాద్ భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

  16. కోయంబత్తూర్: ఈషా యోగ్రా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న తెలుగు వ్యక్తి

    కోయంబత్తూరులోని పోలువంపట్టిలో ఈషా సంస్థకు చెందిన యోగా కేంద్రం ఉంది. ఈ కేంద్రానికి రాష్ట్రం వెలుపల నుంచి, విదేశాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు. కొందరు వలంటీర్లు ఈ యోగా కేంద్రంలోనే బస చేస్తారు.

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొల్లు రమణ (32) అనే వ్యక్తి శుక్రవారం ఈషా యోగా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం అందింది.

    రమణ గత ఆరునెలలుగా ఈషా యోగా కేంద్రంలోనే ఉంటూ, యోగాలో శిక్షణ పొందుతున్నారు.

    రమణ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని అలంద్రాయి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

    ఆలంద్రాయి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  17. గోవాలో అక్రమ బార్ వివాదంపై స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్ ఏం చెప్పారంటే..

  18. న్యూడ్ ఫొటోషూట్‌లో పాల్గొన్న హీరో, ‘‘దుస్తులు వేసుకుని మళ్లీ రా’’ అంటూ యూజర్ల ట్రోలింగ్

  19. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక: గోదావరి వరదల్లో చిక్కుకున్న వీటిని ఆదుకునేది ఎవరు?

  20. ‘అడవులు తగులబడిపోవడం అంటే మానవ మనుగడకే ముప్పు’: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్