You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
తెలంగాణలో కలవాలంటూ 5 గ్రామపంచాయతీలు చేసిన తీర్మానంపై సజ్జల ఏమన్నారు?
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేయడంపై మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.
‘ఆ విషయాన్ని నేను పూర్తిగా ఫాలో కాలేదు. ఒకవేళ వాళ్లకు అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. లేదా అవి అపోహలు అయితే వాటికి క్లారిటీ ఇస్తాం’ అని ఆయన చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉండే ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు తెలంగాణలో కలవాలని తీర్మానం చేశాయి. ఈ గ్రామాలు తెలంగాణలోని భద్రాచలానికి చాలా దగ్గరగా ఉంటాయి.
68వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితా
ఉత్తమ చిత్రం: సురారై పోట్ర్ (తమిళ్)
ఉత్తమ నటుడు: సూర్య (సురారై పోట్ర్), అజయ్ దేవగణ్ (తానాజీ: ది అన్‌సంగ్ వారియర్)
ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సురారై పోట్ర్)
ఉత్తమ దర్శకుడు: కేఆర్ సచ్చిదానందన్ (అయ్యప్పన్ కోషియమ్)
ఉత్తమ సహాయనటుడు: బీజు మీనన్ (అయ్యప్పన్ కోషియమ్)
ఉత్తమ సహాయనటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివరంజనీయమ్ ఇన్నుం సిల పెంగళ్లం)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: థమన్ (అల వైకుంఠపురంలో), జీవీ ప్రకాశ్ కుమార్(సురారై పోట్ర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్: టీవీ రాంబాబు (నాట్యం)
బెస్ట్ కొరియోగ్రఫీ: సంధ్యా రాణి (నాట్యం)
ఉత్తమ పిల్లల చిత్రం: సుమీ (మరాఠీ)
బెస్ట్ తెలుగు సినిమా: కలర్ ఫొటో
ఉత్తమ పాపులర్ చిత్రం: తానాజీ: ది అన్‌సంగ్ హీరో (హిందీ)
ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రం: తాలేదండా (కన్నడ)
సినిమాలు తీయడానికి అత్యంత ఫ్రెండ్లీ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఎంపికైంది.
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్... బెస్ట్ తెలుగు మూవీగా కలర్ ఫొటో
2020 సంవత్సరానికి సంబంధించి 68వ జాతీయ చలనచిత్రాల అవార్డులను ప్రకటించారు.
ప్రాంతీయ భాషల విభాగంలో తెలుగు నుంచి ‘కలర్ ఫొటో’కు ఉత్తమ చిత్రం అవార్డు లభించింది.
సుహాస్ నటించిన ఈ సినిమాకు ఎ.సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి రజత కమలంతోపాటు రూ.లక్ష రూపాయల నగదు బహుమతి దక్కుతుంది.
అలవైకుంఠపురం సంగీత దర్శకుడు తమన్, తమిళ సినిమా సురారై పోట్ర్ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. వీరికి రజత కమలం కింద రూ.50 వేల నగదు ఇస్తారు.
తెలుగు సినిమా నాట్యం కొరియోగ్రాఫర్ సంధ్య రాజుకు బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు వచ్చింది. ఈమెకు రజత కమలం కింద రూ.50 వేల నగదు అందుతుంది.
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో తెలుగు చిత్రం నాట్యానికి పని చేసిన టీవీ రాంబాబుకు పురస్కారం లభించింది.
జాతీయ ఉత్తమ నటునిగా సూర్య... ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి
నేడు 2020 సంవత్సరానికి సంబంధించి 68వ జాతీయ సినిమా అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటులుగా తమిళ నటుడు సూర్య, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఎంపికయ్యారు.
సురారై పోట్ర్ సినిమాకు గాను సూర్య, తానాజీ: ది అన్‌సంగ్ వారియర్ సినిమాకు గాను అజయ్ దేవ్‌గణ్‌ను ఈ అవార్డు వరించింది.
ఇక ‘సురారై పోట్ర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అపర్ణ బాలమురళికి ఉత్తమ నటి అవార్డు దక్కింది.
అలాగే మలయాళీ చిత్రం అయ్యప్పన్ కోషియం డైరెక్టర్ కేఆర్ సచ్చిదానంద్‌కు ఉత్తమ డైరెక్టర్ అవార్డ్ లభించింది.
పింక్ కలర్‌లోకి మారిపోయిన ఆకాశం.. ప్రపంచానికి అంతమేమోనని భయపడిన ప్రజలు.. ఏం జరిగిందంటే..
ఈ విషయంలో టర్కీపై ఆంక్షలు విధించిన అమెరికా.. భారత్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చింది.. ఎందుకు?
భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము: ఒడిశాలోని ఆమె స్వగ్రామం ఎలా ఉంది.. అక్కడి ప్రజలు ఏమంటున్నారు?
సినిమా రివ్యూ: కృతజ్ఞత విలువ చెప్పేందుకు విఫలయత్నం చేసిన 'థాంక్యూ'!
వీర్‌మహాన్: తన నుదుటిపై పూసుకునే రంగుల గురించి ఏం అంటున్నారు?
ద్రౌపది ముర్ము: కొత్త రాష్ట్రపతి పుట్టిన ఊరు, ఇల్లు ఇప్పుడెలా ఉన్నాయంటే...
ఒడిశాలోని ఊపర్‌బేడా గ్రామానికి మేం ఉదయం చేరుకునేసరికి అక్కడి మహిళలు తమ ఇళ్లలో వంట చేస్తూ కనిపించారు.
మగవారు పొలాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. పిల్లలు స్నానాలు చేస్తున్నారు. గ్రామంలోని కొన్ని షాపులు తెరిచే ఉన్నాయి. మరికొన్ని మూసి కనిపించాయి.
పట్టణానికి వెళ్లేందుకు కొంతమంది పసుపు రంగు టెంపో (ఆటో)లో కూర్చున్నారు.
భారత రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ జరుగుతోందని టీవీ, రేడియో, ఇంటర్నెట్‌లలో వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలుస్తారని అప్పటికే దాదాపుగా ఖాయమైంది.
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన తర్వాత, ఒక గిరిజన వ్యక్తి రాష్ట్రపతి పదవిని చేరుకోవడం ఇదే తొలిసారి.
ఈ విషయంలో ఊపర్‌బేడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ద్రౌపది ముర్ము ఈ గ్రామానికి చెందినవారే. ఆమె బాల్యం ఇక్కడే సాగింది. ఇక్కడే ఆమె ఇల్లు కూడా ఉంది.
ఆ ఊరిని బీబీసీ సందర్శించింది.. పూర్తి వివరాలు కింది వీడియోలో చూడండి....
బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం రిషి సునక్- లిజ్ ట్రస్ మధ్య తుది పోరు
రీనా వర్మ: 75 ఏళ్ల తరువాత పాకిస్తాన్‌లోని తన సొంత ఇంటికి వెళ్లిన భారత మహిళ
CBSE Results: సీబీఎస్‌ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో బాలురకన్నా బాలికలు సగటున 3.29 శాతం ఎక్కువ ఉత్తీర్ణులయ్యారు.
ఏప్రిల్ 26 నుంచి జూన్ 15వ తేదీ వరకూ జరిగిన ఈ పరీక్షల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 91.25 గా ఉంటే.. బాలికల 94.54 శాతం ఉత్తీర్ణతతో పైచేయి చాటుకున్నారు.
విద్యార్థులు cbseresults.nic.inవెబ్‌సైట్‌లో కానీ, results.cbse.nic.in వెబ్‌సైట్‌లో కానీ ఫలితాలు చూసుకోవచ్చు.
2021 సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 99.37 శాతంగా ఉంటే.. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 92.71 శాతంగా నమోదైంది.
మొత్తం 14,35,366 మంది 12వ తరగతి పరీక్షలకు హాజరు కాగా వారిలో 13,30,662 మంది ఉత్తీర్ణులయ్యారు.
మొత్తంగా 33,000 మంది విద్యార్థులు 95 శాతానికి మించి మార్కులు సాధించారు. అలాగే, 1.34 లక్షల మంది విద్యార్థులు 90 శాతం కన్నా ఎక్కువ స్కోర్లు సాధించారు.
ఉత్తీర్ణత శాతాల్లో కేరళలోని తిరువనంతపురం అగ్రస్థానం (98.83 శాతం)లో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు (98.16 శాతం), చెన్నై (97.79 శాతం), దిల్లీ ఈస్ట్, దిల్లీ వెస్ట్ (96.29 శాతం) నిలిచాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ అట్టడుగున (83.71 శాతం) ఉంది.
ICYMI: మీరు చదవకపోతే, ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
శ్రీలంక ప్రధానమంత్రిగా దినేష్ గుణవర్దెన ప్రమాణం
శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా దినేష్ గుణవర్దెన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
సీనియర్ రాజకీయ నాయకుడైన గుణవర్దెనను మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్షకు సన్నిహితుడిగా పరిగణిస్తారు.
గురువారం దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే.. దినేష్‌ను దేశ కొత్త ప్రధానమంత్రిగా నియమించారు.
ఇంతకుముందు విదేశాంగ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన దినేష్ శుక్రవారం నాడు కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయంలో విధులు చేపట్టనున్నారు.
శ్రీలంక: నిరసన శిబిరాలపై అర్థరాత్రి విరుచుకుపడిన భద్రతా బలగాలు.. బీబీసీ జర్నలిస్టుపై దాడి
జాతీయ ఉత్తమ నటులుగా సూర్య, అజయ్ దేవ్‌గణ్ ... ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి
గోదావరి వరదలు: పోలవరం ముంపు మండలాల ప్రజల పరిస్థితి ఏమిటి? ఇక ఆ గ్రామాల్లో నివాసాలు కష్టమేనా?
Draupadi Murmu: కొత్త రాష్ట్రపతి సొంత ఊరు ఊపర్‌బేడా పరిస్థితి ఎలా ఉంది - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్