You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. Bullion Market: బంగారంపై పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  2. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము... ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ విజయం

  3. బ్రిటన్ ప్రధాని తుది రేసులో రిషి సునాక్

    బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి తుది రేసులో రిషి సునాక్, లిజ్ ట్రస్ నిలిచారు. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడి పదవి వీరిద్దరిలో ఎవరో ఒకరికి దక్కుతుంది.

    బుధవారం కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల తుది ఓటింగ్ ప్రక్రియలో ఈ విషయం వెల్లడైంది. సెప్టెంబరు 5న పోస్టల్ బ్యాలెట్ విధానంలో రిషి సునాక్, లిజ్ ట్రస్‌ల మధ్య తుది పోరు జరుగుతుంది.

    దీనిలో 1.6 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు పాలుపంచుకుంటారు.

    జులై 25న బీబీసీలో లిజ్ ట్రస్, రిషి సునాక్‌ల మధ్య డిబేట్ జరగనుంది.

  4. మిమ్మల్ని దోమ కుట్టిందంటే.. అది కచ్చితంగా ఆడదోమే..

  5. బీచ్‌లో పెళ్లి వేడుక జరుగుతుండగా పెద్ద అల వచ్చింది. తర్వాత ఏమైంది?

  6. ఏడడుగుల వరదలో అన్నీ కొట్టుకుపోయాయి.సమస్య ఏంటని అడిగేవారు లేరు

  7. ‘‘గోదావరికి వచ్చే ప్రతి వరదా మాకొక జీవిత పాఠమే’’-మూడు భారీ వరదలను చూసిన వ్యక్తి అనుభవాలు

  8. సంక్షోభంలో శ్రీలంకకు ఎక్కువ సాయం చేసిందెవరు, చైనానా, భారతదేశమా?

  9. కార్లలో ఎయిర్ బ్యాగ్‌లు పెంచాలని కేంద్రం అంటుంటే మారుతి సుజుకి వద్దంటోంది. ఎందుకు

  10. పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్

    జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురైనట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

    ఇటీవల గోదావరి జిల్లాల్లో పర్యటించిన తరువాత పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. పవన్ కల్యాణ్‌తో పాటు ప్రోగ్రాం కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యానికి లోనయ్యారని వివరించారు.

    అందువల్ల ఈ నెల 24న జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని 31వ తేదీకి వాయిదా వేశారు.

  11. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే

    శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. పార్లమెంటులో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఓటింగ్‌లో రణిల్‌కు 134 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి దలస్ అలాపేరుమాకు 82 ఓట్లు లభించాయి.

    మొత్తం 223 ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇద్దరు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. పోలైన 223 ఓట్లలో 219 ఓట్లు చెల్లుబాటు అవుతాయని పరిగణనలోకి తీసుకున్నారు. నాలుగు ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు.

    అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత రణిల్ విక్రమసింఘే పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ.. శ్రీలంకను కష్టాల నుంచి గట్టెక్కించటానికి అన్ని పార్టీలూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు.

    అలాగే, గురువారం నాడు తాను స్వయంగా అన్ని పార్టీలతో సమావేశమై చర్చిస్తానన్నారు.

    గొటాబయ రాజపక్ష శ్రీలంక నుంచి పరారై, రాజీనామా చేసేముందు రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా చేశారు.

    అధ్యక్షుడిగా గొటాబయ పదవీ కాలంలో మిగిలిన కాలాన్ని రణిల్ పూర్తిచేస్తారు. ఆయన పదవీ కాలం 2024 నవంబరు చివరికి ముగుస్తుంది.

  12. జహంగీర్ నుంచి నిజాం రాజుల దగ్గరికి వచ్చిన 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?

  13. జీఎస్‌టీ పెంపు, ద్రవ్యోల్బణం పెరుగుదల పట్ల పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసన

    జీఎస్‌టీ రేట్ల పెంపు, ఆహార ధరల పెరుగుదల పట్ల.. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బుధవారం నాడు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

    కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    దీనికి ముందు మంగళవారం నాడు కూడా ప్రతిపక్షాల సభ్యులు పార్లమెంటు సమావేశాల్లో నిరసనకు దిగారు. దీనివల్ల నిన్నటి సమావేశాలను వాయిదా వేయాల్సి వచ్చింది.

    కొత్త జీఎస్‌టీ రేట్ల వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

    కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో సమావేశమైన జీఎస్‌టీ మండలి.. ప్యాకేజ్ చేసిన పెరుగు, పన్నీర్, లస్సీ, తేనె వంటి ఆహార పదార్థాల మీద 5 శాతం జీఎస్‌టీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సోమవారం నుండి అమలులోకి వచ్చింది.

  14. ట్విట్టర్ వివాదంలో ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ

    టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఎలాన్ మస్క్‌పై ట్విటర్ వేసిన పిటిషన్‌ను కోర్టు అక్టోబర్‌లో విచారించనుంది.

    ఈ కేసులో ఆలస్యంగా విచారణ జరపాలని ఎలాన్ మస్క్ డిమాండ్ చేశారు.అయితే, విచారణను ఆలస్యం చేయడం వల్ల మరింత అనిశ్చితి పెరుగుతుందని డెలావర్ కోర్టు వ్యాఖ్యానించింది.

    ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనేందుకు తొలుత మస్క్ ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కొనుగోలు డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ఆయన ప్రకటించారు.

    ఈ వ్యవహారంపై ట్విటర్, డెలావేర్ కోర్టును ఆశ్రయించింది. ట్విటర్ ప్రతీ షేరుకు 54.20 డాలర్ల (రూ. 4,315) చొప్పున కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ డీల్‌ను పూర్తి చేసేలా మస్క్‌ను ఆదేశించాలని కోర్టును కోరింది.

    నకిలీ ఖాతాల సమాచారాన్ని ట్విటర్ దాచిపెడుతోందని మస్క్ ఆరోపించారు.

  15. హిందీ గడ్డపై దక్షిణాది మూవీలు బాక్సాఫీసులు బద్దలుకొడుతోంటే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?

  16. భద్రాచలం గుడి వద్ద పూర్తిగా తొలగిపోయిన వరద నీరు

    భద్రాచలం గుడి దగ్గర నీరు పూర్తిగా తొలగింది. గుడి కరకట్టను ఆనుకుని గోదావరి ఒడ్డునే ఉంటుంది. దీంతో వరద నీరు కాకుండా, ఇతరత్రా లీకేజీల వల్ల గుడి చుట్టూ నీరు చేరింది.

    భారీ మోటార్లతో ఆ నీటిని తోడారు. ఇవాళ ఉదయానికి గుడి పరిసరాల్లో నీరంతా పోయి సాధారణ వాతావరణం ఏర్పడింది.

    మరోవైపు భద్రాచలం దగ్గర గోదావరి వరద బాగా తగ్గుతోంది. ఆది-సోమ వారాల్లో పై నుంచి ప్రవాహాలు పెరగడంతో కాస్త నెమ్మదించిన వరద ప్రవాహం, తిరిగి వేగంగా సముద్రం వైపు వెళ్ళడం మొదలైంది.

    బుధవారం ఉదయం 7 గంటలకు 49 అడుగుల నీటి మట్టం ఉంది భద్రాచలం దగ్గర.

    మరోవైపు భద్రాచలాన్ని కాపాడాలంటే చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను ఆంధ్ర నుంచి తెలంగాణకు ఇవ్వాలంటూ టిఆర్ఎస్ కొత్త డిమాండ్ ముందు పెట్టింది.

  17. బ్రిటన్ ప్రధాని తుది రేసులో రిషి సునాక్

  18. Rishi Sunak: భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. బ్రిటన్‌‌కు ప్రధాన మంత్రి అవుతారా?

  19. చేపల వర్షం నిజమేనా? రోడ్లపైకి చేపలు ఎలా వస్తాయి?

  20. నీట్: అమ్మాయిల లోదుస్తులు విప్పించారనే ఘటనపై ఎన్‌టీఏ కమిటీ

    నీట్ పరీక్ష రాసే అమ్మాయిల చేత లోదుస్తులు విప్పించారనే ఆరోపణలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది.

    త్వరలోనే ఈ కమిటీ కేరళలోని కొల్లాం వెళ్లనుంది.

    కేరళలో అమ్మాయిల చేత లోదుస్తులు విప్పించారనే వార్తలు కేంద్ర విద్యాశాఖ దృష్టికి వచ్చాయి. అలాగే కేరళ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు కూడా ఈ విషయం మీద లేఖ రాశారు.