You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. క్రియాశీల కరోనా కేసుల్లో తగ్గుదల

    భారత్‌లో క్రియాశీల కరోనా కేసులు కాస్త తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటి సంఖ్య 1,50,877 నుంచి 1,47,512కి పడిపోయినట్లు చెప్పింది.

    అయితే, గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,830 కేసులు నమోదయ్యాయని, 36 మంది చనిపోయారని తెలిపింది.

    రోజువారీ పాజిటివిటి రేటు 3.48కి చేరింది.

  2. ‘బీజేపీ నేతలకు ఫోన్ చేశాకే నాకు సమస్య తలెత్తింది’: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా

    భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన కొందరు నాయకులకు ఫోన్ చేసిన తర్వాతే తన మొబైల్‌కు వచ్చే కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయని విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా అన్నారు.

    ఈ మేరకు ఆమె బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లను పేర్కొంటూ ట్వీట్ చేశారు.

    ‘‘ఈరోజు బీజేపీకి చెందిన కొందరు మిత్రులతో మాట్లాడిన తర్వాత నా ఫోన్ కాల్స్ అన్ని డైవర్ట్ అవుతున్నాయి. నేను ఇతరులకు ఫోన్ చేయలేకపోతున్నా. నాకు వచ్చే కాల్స్‌కు సమాధానం ఇవ్వలేకపోతున్నా. ఇక ఈరోజుకి బీజేపీ, టీఎంసీ, బీజేడీకి చెందిన ఏ ఎంపీకి కూడా ఫోన్ చేయనని హామీ ఇస్తున్నా’’ అంటూ ఆమె ట్వీట్‌లో రాశారు.

    ఈ ట్వీట్‌తో పాటు ఎంటీఎన్‌ఎల్ తనకు పంపించిన నోటీసును కూడా జత చేశారు.

    ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అల్వా చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ పాలిత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బైమ్మైతో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆమె చెప్పారు.

  3. గుజరాత్‌లో మద్యపాన నిషేధం ఉంటే కల్తీసారా ఎలా అమ్ముతున్నారు: కేజ్రీవాల్

  4. భారత్-చైనా: సరిహద్దు ఉద్రిక్తతలున్నా వాణిజ్యం రికార్డు స్థాయిలో పెరుగుతోంది, ఇది భారత్‌కు మంచిది కాదా?

  5. ఏ మేఘాల వల్ల వాన కురుస్తుంది... ఏవి ప్రమాదకరం?

  6. 77 ఏళ్ల ఈ బామ్మగారు ఒకే ఒక్క డ్యాన్స్‌తో సూపర్ ఫేమస్ అయిపోయారు

  7. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీం కోర్టు నోటీసులు

    భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

    అంతేకాకుండా ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూపుకు సంబంధించిన మధ్యవర్తిత్వ ప్రక్రియపై కూడా స్టే విధించింది.

    ధోని పిటిషన్ మేరకు ఢిల్లీ హైకోర్టు ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించింది.

    సుప్రీం కోర్టు నియమించిన రిసీవర్, కేవలం అమ్రపాలి సంస్థలో గృహ కొనుగోలుదారులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే చూస్తారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

    ఆమ్రపాలి కేసు పెండింగ్‌లో ఉన్నంత వరకు ఆర్బిట్రేషన్ ఎదుట రిసీవర్ హాజరుపై స్టే విధిస్తున్నట్లు చెప్పింది.

    మధ్యవర్తిత్వ ప్రక్రియ కోసం ఆర్బిట్రేషన్ ఎదుట హాజరు కావాలంటూ రిసీవర్‌కు ఆర్బిట్రేటర్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని రిసీవర్, సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో సుప్రీం కోర్టు దీనిపై స్టే విధించింది.

    జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నేతృత్వంలోని బెంచ్, ధోనికి నోటీసులు జారీ చేసింది.

  8. మంకీపాక్స్ ఎలా వస్తుంది, దీని లక్షణాలేంటి?

  9. లక్షలాది మంది భారతీయులు ఎందుకు భారత పౌరసత్వం వదులుకుంటున్నారు?

  10. ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది? ఏపీ, తెలంగాణ అప్పులు ఎంతెంత?

    రాష్ట్రాల అప్పులపై కేంద్రం వివరాలు వెల్లడించింది. లోక్‌సభలో బీజేపీ సభ్యుడు కిషన్ కపూర్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఈ వివరాలు సభ ముందు ఉంచారు.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ‘స్టేట్ ఫైనాన్సెస్: ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ఆఫ్ 2021-2022’ని ఆధారంగా చేసుకుని 2020 మార్చి, 2021 మార్చి, 2022 మార్చి నాటికి రాష్ట్రాలకు ఎంతెంత అప్పులు ఉన్నాయో తెలిపారు.

    దీని ప్రకారం... 2022 మార్చి చివరి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం తమిళనాడుకు అత్యధికంగా రూ. 6,59,868.9 కోట్ల అప్పు ఉండగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు రూ. 6 లక్షల కోట్లకు పైగా అప్పులతో ఆ తరువాత రెండు స్థానాలలో ఉన్నాయి.

    2022 మార్చి చివరినాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 3,98,903.6 కోట్లు కాగా ఇదే సమయానికి తెలంగాణ అప్పులు రూ. 3,12,191.3 కోట్లు.

    2021 మార్చి చివరి నాటికి సవరించిన బడ్జెట్అంచనాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు అత్యధికంగా రూ. 6,00,006.2 కోట్ల అప్పు ఉండగా.. తమిళనాడు, మహారాష్ట్ర ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి.

    2021 మార్చి చివరి నాటికి సవరించిన బడ్జెట్అంచనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 3,60,333.4 కోట్లు కాగా తెలంగాణ అప్పు రూ. 2,67,530.7 కోట్లు.

    2020 మార్చి చివరినాటికి రాష్ట్రాల అప్పులు పరిగణనలోకి తీసుకుంటే రూ. 5,49,559.2 కోట్ల అప్పుతో ఉత్తర్ ప్రదేశ్ అందరి కంటే ముందుంది. మహారాష్ట్ర, తమిళనాడు ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి.

    2020 మార్చి చివరినాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 3,07,671.5 కోట్లు కాగా తెలంగాణ అప్పు రూ. 2,25,418 కోట్లు.

  11. మీర్ సుల్తాన్ ఖాన్: 90 ఏళ్ళ కిందటే బ్రిటిష్ చెస్ చాంపియన్... కానీ, ఆయనకు 'గ్రాండ్ మాస్టర్' గౌరవం ఎందుకు దక్కలేదు?

  12. ఖర్గేను అగౌరవపరిచారంటూ రాజ్యసభ చైర్మన్‌కు ప్రతిపక్షాల లేఖ

    భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను అగౌరవపరిచారంటూ ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభ చైర్మన్‌కు లేఖను సమర్పించాయి.

    ఆ కార్యక్రమంలో ఖర్గే హోదాకు తగిన సీటును ఆయనకు కేటాయించలేదని వారు అందులో పేర్కొన్నారు.

    ఒక సీనియర్ నాయకుని పట్ల ప్రొటోకాల్ పాటించకుండా ఉద్దేశపూర్వకంగా అగౌరవపరచడంతో షాక్‌కు గురయ్యామని, ఈ చర్యను నిరసిస్తున్నామని వారు లేఖలో రాశారు.

  13. మనీషా రూపేటా: పాకిస్తాన్‌లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ

  14. నదిలో పడి కొట్టుకుపోతున్న పెద్దపులిని ఎలా కాపాడారో చూడండి

  15. విజయవాడ: చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బాపు మ్యూజియం

  16. రాష్ట్రపతి భవన్‌ను వీడిన రామ్‌నాథ్ కోవింద్

    భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధికారిక నివాసాన్ని వీడారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఆయన జన్‌పథ్ రోడ్‌లోని కొత్త ఇంటికి మారారు.

    ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అనంతరం ఆయన రాష్ట్రపతి భవన్‌ను వీడి తన కొత్త ఇంటికి చేరుకున్నారు.

  17. రాష్ట్రపతి కార్యాలయ బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ము

    భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి భవన్‌లో కార్యాలయ బాధ్యతలు చేప్టటారు.

    ఆ సమయంలో ఆమెతో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఉన్నారు.

    ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వారి ఫొటోలను విడుదల చేసింది.

    అనంతరం ఆమెకు త్రివిధ దళాల సైనిక సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.

  18. ద్రౌపది ముర్ము: క్లర్క్‌ నుంచి రాష్ట్రపతి వరకు... ఆదివాసీ నేత ప్రస్థానం

  19. ద్రౌపది ముర్ము: ‘రాష్ట్రపతి పదవి దక్కించుకోవడం నా విజయం కాదు, దేశంలోని పేద ప్రజలందరి విజయం’

    భారతదేశ రాష్ట్రపతి పదవిని అందుకోవడం తాను సాధించిన వ్యక్తిగత విజయం కాదని, ఇది దేశంలోని పేద ప్రజలందరి విజయమని ద్రౌపది ముర్ము అన్నారు.

    భారత్‌లో పేదలు కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకుంటారనడానికి తన నామినేషనే సాక్ష్యమని ఆమె వ్యాఖ్యానించారు.

    సోమవారం ఉదయం 10:15 గంటలకు పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో భారత 15వ రాష్ట్రపతిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.

    ఆ తర్వాత ఆమె దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

    ‘‘ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు నన్ను తమ ప్రతినిధిగా భావించడం నాకు సంతృప్తిని ఇస్తోంది.

    నా నామినేషన్‌కు పేదల ఆశీస్సులు ఉన్నాయి. కోట్లాది మంది మహిళల కలలు, సామర్థ్యాలకు నా ఎన్నికే నిదర్శనం.

    దేశ ప్రజలందరికీ నా వినయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్రపతిగా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించడంలో మీ నమ్మకం, మద్దతే నాకు శక్తినిస్తాయి.

    దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జన్మించి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిని నేను. భారత పౌరులపై స్వాతంత్ర్య సమరయోధులు పెట్టుకున్న అంచనాలను అందుకునే దిశగా ప్రయత్నాలను వేగవంతం చేయాల్సి ఉంది’’ అని ఆమె అన్నారు.

  20. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం: ప్రత్యక్ష ప్రసారం