గత 8 ఏళ్లలో 7.22 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
గత 8 సంవత్సరాలలో 7.22 లక్షల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లు కేంద్ర సిబ్బంది, శిక్ష వ్యవహారాల శాఖ తెలిపింది.
ఇదే కాలంలో 22 కోట్ల 5 లక్షల 99 వేల 238 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్, లోక్‌సభ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా ప్రభుత్వం ఈ వివరాలు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వంలో 2020 మార్చి 1 నాటికి సుమారు 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
సంవత్సరాల వారీగా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు:
- 2014-15: 1,30,423
- 2015-16: 1,11,807
- 2016-17: 1,01,333
- 2017-18: 76,147
- 2018-19: 38,100
- 2019-20: 78,555
- 2020-21: 38,850