You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కామన్వెల్త్ గేమ్స్‌: భారత్‌ ఖాతాలో తొలి పతకం, సంకేత్ సర్గార్‌కు రజతం

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల బోణీ చేసింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌ తొలి పతకాన్ని అందుకుంది.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?

  2. కామన్వెల్త్ గేమ్స్ 2022: పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెడల్స్ తెస్తారా?

  3. నేటి ముఖ్యాంశాలు

    బ్రెజిల్‌లోని బీఎం -సీల్ - 11 ప్రాజెక్టులో భారత్ పెట్రో రిసోర్సెస్ లిమిటెడ్ (బిపిఆర్‌ఎల్) 1.6 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడిని పెట్టేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది.

    ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను సంక్షోభం నుంచి బయటకు తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ రూ.1,64,156 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ బీబీఎన్ఎల్ విలీనానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ తెలిపారు.

    బీజేపీకి పనేం లేదని, రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడమే వారి పని అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

    బిహార్‌లోని 8 జిల్లాల్లో గత 24 గంటల్లో పిడుగుపాటు కారణంగా 20 మంది మృత్యువాత పడ్డారు.

    నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 6 గంటల పాటు విచారించింది.దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈరోజు మూడో విడత విచారణ జరిగింది.

    మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్టులు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఉన్న అధికారాలను సుప్రీం కోర్టు సమర్థించింది.

    తన పామ్ హౌస్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలతో మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మరాక్‌ అరెస్ట్ అయ్యారు.

    ఈ పేజీలో లైవ్ అప్‌డేట్స్ ముగిశాయి. బీబీసీ తెలుగు వార్తల కోసం ఈలింక్‌పై క్లిక్ చేయండి.

  4. బీఎస్ఎన్ఎల్ ను సంక్షోభం లోంచి బయటకు తెచ్చేందుకు ప్రభుత్వ ప్యాకేజీ

    ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను సంక్షోభం నుంచి బయటకు తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ రూ.1,64,156 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ బీబీఎన్ఎల్ విలీనానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    బీఎస్ఎన్ఎల్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం 2019లో కూడా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

    కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ సమాచారాన్ని తెలిపినట్లుపీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    మంగళవారం ప్రారంభమైన 5జీ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి.. ఇప్పటివరకు దాదాపు రూ.1.49 లక్షల కోట్ల బిడ్లు వచ్చినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం తొమ్మిదో రౌండ్ బిడ్డింగ్ జరుగుతోంది.

  5. ‘కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆడడం మొదటిసారే అయినా ఆందోళనేమీ లేదు’ - స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్

  6. మధ్యప్రదేశ్: చెట్టుకు వేలాడుతూ కనిపించిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృత దేహాలు

    మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో చెట్టుకు వేలాడుతూ ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు కనిపించాయి. వీరు గిరిజనులు.

    మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో భామ్‌గఢ్‌ గ్రామ సమీపంలోని కోట ఫాల్యాలోని చెట్టుకు మృతదేహాలు వేలాడుతూ కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

    ఇది హృదయ విదారక సంఘటన అని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు.

    "గ్రామస్థులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు" అని ఖాండ్వా పోలీస్ సూపరింటెండెంట్ వివేక్ సింగ్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ఈ అక్క చెల్లెళ్ళ వయస్సు 23, 21, 19 సంవత్సరాలని తెలిపారు.

    "ఈ అమ్మాయిలు గ్రామంలో తమ తల్లితో కలిసి నివసిస్తున్నారు, వారి తండ్రి నాలుగేళ్ల క్రితం చనిపోయారు" అని వివేక్ సింగ్ చెప్పారు.

    ప్రస్తుతం తల్లితో పాటు మరో ఇద్దరు అక్క చెల్లెల్లు, ముగ్గురు సోదరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

    ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని, పూర్తి విచారణ జరిపిన తర్వాత కచ్చితమైన కారణాలను తెలుసుకుంటామని ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు.

    విచారణ, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఈ మరణాలకు కారణం తెలుస్తుందని భావిస్తున్నారు.

  7. బ్రెజిల్ చమురు బ్లాక్ లో 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఆమోదం తెలిపిన భారత్

    బ్రెజిల్‌లోని బీఎం -సీల్ - 11 ప్రాజెక్టులో భారత్ పెట్రో రిసోర్సెస్ లిమిటెడ్ (బిపిఆర్‌ఎల్) 1.6 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడిని పెట్టేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఇది ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) అనుబంధ సంస్థ.

    ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

    ఇది భారతదేశ ఇంధన భద్రతను మరింత పటిష్టం చేస్తుందని, బ్రెజిల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కూడా బలోపేతం చేస్తుందని జైశంకర్ అన్నారు.

    BM-సీల్-11 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో2026-27 నుండి ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

    ఈ బ్లాక్‌లో బీపీఆర్ ఎల్ కు40 శాతం వాటా ఉండగా,మిగిలిన 60 శాతం వాటా బ్రెజిల్ జాతీయ చమురు కంపెనీ పెట్రోబ్రాస్ కు ఉంది.

    ఈ బ్లాక్‌లో ఇప్పటివరకు చమురు కోసం చాలా తవ్వకాలు జరిగినట్లు తెలిపారు. ఈ తవ్వకాలను మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు.

  8. విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతయ్యారనుకున్న వివాహిత నెల్లూరులో ఉన్నారంటున్న అధికారులు

    విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ తెలిపారు.

    గత 36 గంటలుగా ఆమె కోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.

    సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమికుడితో కలిసి వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

    సాయిప్రియకు 2020 జూలై 25న శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చారు. జులై 25 సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ అక్కడి నుంచి కనిపించలేదు. శ్రీనివాస్‌ తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

    వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని జియ్యాని శ్రీధర్‌ తెలిపారు.

    ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

  9. కర్నాటక: బీజేపీ నాయకుడి హత్య.. అసలేం జరిగింది?

  10. ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’

  11. మమతా బెనర్జీ: ‘బెంగాల్‌ను కూలగొట్టాలంటే ముందుగా బీజేపీ, రాయల్ బెంగాల్ టైగర్‌తో పోరాడాలి’

    బీజేపీకి పనేం లేదని, రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడమే వారి పని అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

    ‘‘మొదట మహారాష్ట్రను అస్థిరపరిచారు. ఇప్పుడు జార్ఖండ్‌పై వారి దృష్టి ఉంది. కానీ, బీజేపీని బెంగాల్ ఓడించింది. బెంగాల్‌ను కూలగొట్టడం అంత సులభం కాదు. ఎందుకంటే, వారు ఆ పని చేయాలంటే ముందుగా రాయల్ బెంగాల్ టైగర్‌తో పోరాడాలి’’ అని అన్నారు.

    మమతా బెనర్జీ నేతృత్వంలో మంత్రిగా ఉన్న పార్థ చటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది.

    స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ద్వారా రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను ఈడీ అదుపులోకి తీసుకుంది.

  12. ‘ఆయన లేరు.. పిల్లలను ఎలా పోషించాలి?’ - రూ. 20 నాటు సారా 39 మంది ప్రాణాలు తీసింది

  13. టెంపెస్ట్: పైలట్ మెదడును చదివేసే విమానం

  14. బిహార్: పిడుగుపాటుతో 20 మంది మృతి

    బిహార్‌లోని 8 జిల్లాల్లో గత 24 గంటల్లో పిడుగుపాటు కారణంగా 20 మంది మృత్యువాత పడ్డారు.

    బుధ, గురువారాల్లో కూడా రాష్ట్రంలో మరింత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావారణ శాఖ చెబుతోంది.

    రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచనలను ప్రజలంతా పాటించాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోరారు.

    మరణించిన ప్రతీ ఒక్కరి కుటుంబాలకు ఆయన మంగళవారం రూ. 40,000 పరిహారాన్ని ప్రకటించారు.

    వర్షాకాలంలో పిడుగుల కారణంగా భారత్‌లో ప్రతీ ఏటా వందలాది మంది మరణిస్తున్నారు.

  15. Income Tax Returns: ఎలా ఫైల్ చేయాలి, మనకు రావాల్సిన డబ్బును ఎలా తీసుకోవాలి?, వరికూటి రామకృష్ణ, బీబీసీ ప్రతినిధి

    'హలో ఫ్రెండ్స్! ఎవరైనా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా? తెలిసిన వాళ్లు కాస్త చెబుదురూ... అసలే వచ్చే ముప్పై ఒక్కటే లాస్ట్ డేటంట.'

    'అక్కా నాకిదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎప్పుడూ ట్యాక్స్ కట్టలే. రిటర్న్స్ కోసం నేను ఏ ఫాం ఫిల్ చేయలే?'

    ప్రతి ఏడాది జులై నెలలో ఇలాంటి సంభాషణలు తరచూ వింటుంటాం. ఇదిగో ఇలా గడువు ముంచుకొస్తున్నప్పుడు ఆ హడావిడి ఇంకా ఎక్కువ. తొలిసారి రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్లది ఒకరకమైన కంగారైతే... ఎన్నిసార్లు చేసినా ప్రతిసారీ కొత్తగానే ఫీలవుతూ ఆందోళనపడే వాళ్లను చూస్తుంటాం.

    తొలిసారి ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే వచ్చే డౌట్లు బోలెడు. ఎంచుకోవాల్సిన ఫాం దగ్గర నుంచి దాన్ని ఫిల్ చేయడం వరకు సవాలక్ష సందేహాలు బుర్రలో మెదులుతుంటాయ్.

  16. మంకీపాక్స్ సోకకుండా వ్యాక్సీన్లు ఉన్నాయా... ప్రస్తుతం చికిత్సకు వాడుతున్న మందులేంటి?

    ఇంతకు ముందెప్పుడూ కనిపించని దేశాలలో కూడా ఈ ఏడాది మే నెల నుంచి మంకీపాక్స్ వైరస్ కనిపిస్తోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

    ఆ సంస్థ చెప్పిన దాని ప్రకారం జూలై 23 నాటికి, 75 దేశాలలో 16,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా అయిదుగురు మరణించారు.

    మశూచి (స్మాల్‌పాక్స్) లాగే మంకీపాక్స్ కూడా కుటుంబంలో ఒకరికి వస్తే మిగతా వారికి కూడా సోకే అవకాశం ఉంటుందని, అయితే అది వ్యాప్తి చెందే తీవ్రత చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు.

    వ్యాధి లక్షణాలు ఉన్నవారిని వేరుగా ఉంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ లాంటి విధానాల ద్వారా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

  17. సోనియా గాంధీని 6 గంటల పాటు విచారించిన ఈడీ

    నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 6 గంటల పాటు విచారించింది.

    దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈరోజు మూడో విడత విచారణ జరిగింది.

    సోనియాగాంధీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశాయి.

    కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ బుధవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

  18. ఏపీజే అబ్దుల్‌ కలాం: ఈ మిసైల్ మ్యాన్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకంటారు?, రేహాన్‌ ఫజల్‌, బీబీసీ ప్రతినిధి

    భారత ప్రజల అత్యంత ప్రియమైన రాష్ట్రపతిగా మన్ననలందుకున్న ఏపీజే అబ్దుల్ కలాం 1931లో అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు.

    భారత మాజీ ప్రధాని ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ తన ప్రభుత్వం పడిపోకపోయినా, బలహీన ప్రధాని అని బీజేపీతో పదేపదే అనిపించుకుని విసిగి పోయి, దేశభద్రతకు తాను ఎంత ప్రాధాన్యమిస్తానో నిరూపించుకోవాలని భావించారు.

    అందులో భాగంగానే మిసైల్‌ మ్యాన్‌ ఏపీజే అబ్దుల్ కలాంకు భారతరత్నను ప్రదానం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 1952లో సి.వి.రామన్ తర్వాత మరో సైంటిస్టును ఈ అవార్డు వరించలేదు.

    1998 మార్చి1న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారతరత్న అవార్డు ప్రదానం కార్యక్రమంలో అబ్దుల్‌ కలాం భయపడుతూ కనిపించారు. ఆయన తన నీలి రంగు టైని పదేపదే తాకుతూ ఉన్నారు.

  19. రాహుల్ గాంధీ: ‘పార్లమెంట్‌లో అడిగే ప్రశ్నలకు ‘రాజా’ భయపడుతున్నారు’

    ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు.

    ఎంపీల సస్పెన్షన్, అరెస్ట్‌లపై కూడా ఆయన ట్వీట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు.

    సిలిండర్ ధర పెరుగుదలతో పాటు పెరుగు, ఆవనూనెపై జీఎస్టీ గురించి ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఆయన ‘రాజా’ అని సంభోదిస్తూ... ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రశ్నలకు రాజా భయపడుతున్నారు. కానీ, తమకు నియంతలతో ఎలా పోరాడాలో తెలుసు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    పార్లమెంట్ ససమావేశాల సందర్భంగా సభలో నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారంటూ నలుగురు లోక్‌సభ ఎంపీలు, 19 మంది రాజ్య సభ ఎంపీలను సస్పెండ్ చేశారు.

  20. బ్రేకింగ్ న్యూస్, ‘మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టులకు, ఈడీ కారణం చెప్పడం తప్పనిసరి కాదు’: సుప్రీం కోర్టు, సుచిత్ర మోహంతి, బీబీసీ కోసం

    మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్టులు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఉన్న అధికారాలను సుప్రీం కోర్టు సమర్థించింది.

    జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈడీ అధికారాలను సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించి తీర్పును వెలువరించింది.

    నేరస్థుల ఆదాయం, ఇంటిపై సోదాలు, ఆస్తుల అటాచ్‌మెంట్, అరెస్టులు, బెయిల్‌ షరతులకు సంబంధించి మనీలాండరింగ్ చట్టంలో రూపొందించిన కఠినమైన విధానాలు సరైనవే అని తీర్పులో పేర్కొంది.

    మనీ లాండరింగ్ కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో అరెస్టు చేయడానికి కారణాన్ని ఈడీ అధికారులు చెప్పడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

    ఈడీ అధికారాలను సవాలు చేసిన వారిలో మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితరులు ఉన్నారు.