You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
పూడిమడక బీచ్ ముగిసిన రెస్క్యూ ఆపరేషన్-ఆరు మృతదేహాలు లభ్యం
శుక్రవారం అనకాపల్లి జిల్లా, పూడిమడక బీచ్‌కు వచ్చిన 13 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఆరుగురు గల్లంతయ్యారు. వెంటనే అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో గల్లంతయిన ఆరుగురు విద్యార్ధుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.
దీంతో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది.
చివరి రెండు మృతదేహాలలలో ఒకటి పూడిమడకలో, మరొకటి తంతడిలో లభించాయి.
చనిపోయిన వారిలో పవన్ సూర్యకుమార్ (గుడివాడ), గణేశ్ (మునగపాక), జగదీశ్ (గోపాలపట్నం), రాంచంద్ (యలమంచిలి), జశ్వంత్(నర్సీపట్నం), సతీశ్ ఉన్నారు.
రెండు హెలికాప్టర్లు, నాలుగు బోట్ల ద్వారా విద్యార్థుల కోసం గాలించారు. వీరంతా అనకాపల్లిలోని డీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు
కామన్వెల్త్ క్రీడల్లో పాకిస్తాన్‌పై భారత్ పైచేయి
కామన్వెల్త్ క్రీడల్లో తొలి రోజు పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సెమీఫైనల్‌లో శ్రీహరి 54.55 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన పీటర్ కోయెట్జ్ 53.91 సెకన్ల టైమింగ్‌తో మొదటి స్థానంలో నిలిచాడు.
కిందటి ఏడాది శ్రీహరి నటరాజ్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 53.77 సెకన్లతో జాతీయ రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల స్విమ్మర్ శ్రీహరి కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ కోసం స్విమ్మింగ్ పూల్‌లోకి అడుగుపెట్టనున్నాడు.
బ్యాడ్మింటన్‌లో భారత్ పాకిస్తాన్‌పై గెలిచింది. తొలి టీమ్ మ్యాచ్‌లో భారత్ 5-0తో పాకిస్తాన్‌ను ఓడించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో బి సుమీత్‌రెడ్డి, మాచిమండ పొన్నప్ప జోడీ 21-9, 21-12 స్కోరుతో మహ్మద్ ఇర్ఫాన్ సయీద్ భట్టి-గజాలా సిద్ధిఖీ జోడీపై విజయం సాధించింది.
ఆ తరువాత పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-7, 21-12తో మురాద్ అలీని ఓడించాడు.
మరోవైపు, మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు 21-7, 21-6తో మహూర్ షాజాద్‌పై విజయం సాధించింది.
దీని తరువాత, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ, ట్రెసా, గాయత్రి జోడీ కూడా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించారు.
భారత బాక్సర్ శివ్ థాపా 63 కేజీల విభాగంలో 5-0 స్కోరుతో పాకిస్తాన్‌కు చెందిన సులేమాన్ బలోచ్‌పై విజయం సాధించాడు.
భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు తమ మొదటి గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 3–0తో ఓడించింది. రెండో గేమ్‌లో ఫిజీపై 3–0తో విజయం సాధించింది. పురుషుల జట్టు బార్బడోస్, సింగపూర్‌లను ఓడించింది. స్క్వాష్‌లో అనాహత్ సింగ్, అభయ్ సింగ్ విజయం సాధించారు.
క్రికెట్‌లో భారత జట్టు ఓడిపోయింది. భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
అలాగే, లాన్ బౌల్, 50 మీటర్ల బటర్‌ఫ్లై, 400 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, సైక్లింగ్‌లో కూడా భారత్ ఓడిపోయింది.
కామన్వెల్త్ గేమ్స్: బర్మింగ్‌హామ్‌లో తొలి స్వర్ణం గెలిచిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన మీరాబాయి చాను
దేశంలో ఒంటరి మహిళల సంఖ్య ఎందుకు పెరుగుతోంది...వీరికి పెళ్లి మీద మనసు విరగడానికి కారణాలు ఏంటి
ఆరెస్సెస్‌ను మాయల ఫకీరుతో పోల్చిన 64 పేజీల పుస్తకంలో ఏముంది, బీజేపీ స్పందన ఏంటి
మంకీపాక్స్ వ్యాధి బారిన పడి కోలుకున్న వ్యక్తి అనుభవాలు
సవితా పూనియా: ది గ్రేట్ వాల్‌గా పేరొందిన భారత మహిళా హాకీ టీమ్ కెప్టెన్
మంత్రయితే మాకేంటి?.. లోన్ యాప్ ఏజెంట్ల ఆగడాలు - ఏపీ మంత్రి, మాజీ మంత్రికి వరుస ఫోన్లు
లోన్ యాప్‌ల నుంచి వచ్చే ఫోన్లు ఏపీలో ఓ మంత్రి, మాజీ మంత్రిని కూడా ఇబ్బంది పెట్టాయి.
ఏపీ వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి లోన్ యాప్ నిర్వాహకులు అదే పనిగా ఫోన్లు చేయడం సంచలనంగా మారింది.
కాకాణితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్‌కూ రుణాలు తీర్చాలంటూ ఇలాంటి ఫోన్లు వచ్చాయి.
కాకాణి గోవర్దన్ రెడ్డి, అనిల్ కుమార్‌ల పేర్లు, ఫోన్ నంబర్లు వాడుకుని ఇతరులు ఎవరో లోన్లు తీసుకోవడంతో ఇలా జరిగినట్లు చెబుతున్నారు.
తనకు ఏకంగా 70 సార్లు లోన్ యాప్ నుంచి ఫోన్ వచ్చిందని కాకాణి చెప్పగా తనకు కూడా 20 సార్లు ఫోన్ చేసినట్టు అనిల్ కుమార్ చెప్పారు.
వీరిద్దరి పేర్లు, ఫోన్ నెంబర్లు ఉపయోగించి ఎవరో రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో యాప్ ఏజెంట్లు వీరికి ఫోన్ చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో పలువురు సామాన్యులు ఇలాంటి లోన్ యాప్స్ బారిన పడి ప్రాణాలు కూడా తీసుకోగా, మరో వైపు బ్యాంకుల రికవరీ ఏజెంట్ల వ్యవహారం కూడా నందిగామ ఘటనతో వెలుగులోకి వచ్చింది.
ఇలాంటి తరుణంలో లోన్ యాప్ ఏజెంట్లు మంత్రులు, మాజీ మంత్రులకూ ఫోన్లు చేసి బెదిరించడం చర్చనీయమవుతోంది.
‘అశోక్ కుమార్ అనే వ్యక్తి లోన్ తీసుకుని నా నెంబర్ప్రత్యామ్నాయంగా ఇచ్చారనిచెప్పారు. అందుకే ఫోన్ చేస్తున్నామన్నారు. వివరాలు పోలీసులకు అందించాం. పోలీసుల వారి వివరాలు సేకరించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని విడిపించేందుకు పది మంది ప్రముఖ లాయర్‌లు రావడం ఆశ్చర్యంగా ఉంది. లోన్ యాప్ముఠాను ట్రాప్ చేసేందుకు..మా పీఏ కూడా 25,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఎవరికైనాఇబ్బంది ఎదురైతే పోలీసులకు కానీ..నాకు కానీ చెప్పండి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెన్నై కేంద్రంగా ముఠా దారుణాలు చేస్తోంది" అంటూ మంత్రి కాకాణి వెల్లడించారు.
వరుసగా అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్న తరుణంలో ఏపీ పోలీసులు కూడా దృష్టి పెడుతున్నట్టు మంత్రి తెలిపారు.
అనకాపల్లి పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు, వారిలో ఒకరు మృతి
అనకాపల్లి జిల్లాలోని పూడిమడక బీచ్‌కు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం దొరకగా, మరొకరిని కొనఊపిరితో కాపాడి చికిత్స కోసంతరలించారు. మరో అయిదుగురు విద్యార్థుల కోసం సముద్రంలో గాలిస్తున్నారు.
గల్లంతైన విద్యార్థులంతా అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కాలేజికి చెందినవారు.
గల్లంతైనవారిలో పవన్(19) మృతి చెందగా సూరిశెట్టి తేజ అనే మరో విద్యార్థిని స్థానికులు రక్షించారు.
జగదీశ్, జశ్వంత్, సతీశ్, గణేశ్, చందు అనే మరో అయిదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరి కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు.
బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే: రూ.15 వేల కోట్లతో నిర్మించిన రోడ్డు కనీసం 5 రోజులు కూడా వర్షాలను తట్టుకోలేకపోయిందా?
ఇవి ప్రపంచంలోనే అత్యంత హానికారకమైన నత్తలు: ‘వీటిని తాకొద్దు, తినొద్దు’ - అధికారుల హెచ్చరిక
నియంతలైనా దేశం దాటి పారిపోవాల్సిందేనా? అజ్ఞాతంలోకి వెళ్లాక ఏం జరుగుతుంది? 10 మంది పాలకుల కథ..
రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: విధులు నిర్వర్తించడంలో తడబడిన దర్శకుడు
నేపాల్: పులుల సంఖ్య పెరిగితే ఓ పక్క ఆనందం.. మరోపక్క భయం
రామ్‌చరణ్ తదుపరి జేమ్స్‌బాండ్ అవుతారా... హాలీవుడ్ రైటర్ ట్వీట్‌తో సోషల్ మీడియాలో హంగామా
అధీర్ రంజన్ చౌదరి: ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటారా... సోనియాగాంధీ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న బీజేపీ
తైవాన్‌పై పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకున్న జో బైడెన్, షీ జిన్‌పింగ్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గురువారం రెండు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. తైవాన్‌పై పరస్పరం హెచ్చరించుకున్నారు.
తైవాన్ స్థితిని మార్చే ఎలాంటి ఏకపక్ష చర్యలనైనా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బైడెన్, జిన్‌పింగ్‌ను హెచ్చరించారు. అలాగే, తైవాన్‌పై అమెరికా విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
అయితే, అమెరికా 'వన్-చైనా పాలసీ'ని అంగీకరించాలని, "నిప్పుతో చెలగాడం ఆడవద్దని" జిన్‌పింగ్, బైడెన్‌ను హెచ్చరించినట్లు బీజింగ్ తెలిపింది.
అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో, తైవాన్ సమస్యపై ఉద్రిక్తతలు పెరిగాయి.
అయితే, పెలోసీ తన పర్యటనకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
కాగా, ఆమె తైవాన్ దీవిలో అడుగుపెడితే "తీవ్ర పరిణామాలు" ఎదుర్కోవలసి వస్తుందని చైనా ఇప్పటికే హెచ్చరించింది.
గతవారం, నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనపై బైడెన్ స్పందిస్తూ "ఇది మంచి ఆలోచన కాదని మిలటరీ భావిస్తున్నట్టు" తెలిపారు.
అయితే, ఈ పర్యటన గురించి చైనా ముందస్తు వ్యాఖ్యలు, హెచ్చరికలు "పనికిరానివి, అనవసరం" అని వైట్ హౌస్ అభిప్రాయపడింది.
గురువారం జరిగిన ఫోన్ కాల్‌లో బైడెన్, జిన్‌పింగ్ ముఖాముఖి సమావేశం కావడం గురించి కూడా చర్చించారని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు, 2015లో షీ జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఈ ఇద్దరు నేతలు ముఖాముఖి సమావేశం కాలేదు.
తైవాన్‌పై సార్వభౌమాధికారం తమదేనని, ఎప్పటికైనా ఆ దీవి తమ భూభాగంలో కలవాల్సిందేనని చైనా వాదిస్తుంది.
వన్-చైనా విధానం ప్రకారం, అమెరికా దౌత్యపరంగా తైవాన్‌ను గుర్తించదు. కానీ, తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అమెరికా ఆ దేశానికి ఆయుధాలను విక్రయిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌కు పదే పదే ఎందుకీ వరద కష్టాలు.... ఏమిటి దీనికి పరిష్కారం?
పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్: పాకిస్తాన్ ఆటగాళ్లపై కామన్‌వెల్త్ గేమ్స్‌లో విజయం - హాకీలో ఘనాపై భారత్ విజయం