You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. 'ఫ్లడ్ జిహాద్': అస్సాంలో వరదలకు ముస్లింలే కారణమా

  2. తిరంగ బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

    ఎంపీలు చేస్తోన్న తిరంగ బైక్ ర్యాలీని భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు.

    ఎర్రకోట నుంచి ఈ ర్యాలీ జరుగుతుంది.

    ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకయ్య నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ పాల్గొన్నారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

    పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ వరకు ర్యాలీ సాగనుంది.

  3. అచ్యుతాపురం గ్యాస్ లీక్: ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న 94 మంది బాధితులు

    అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీలో విష వాయువు లీక్ అయిన ఘటనలో ప్రస్తుతం మొత్తం 94 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని విశాఖపట్నం జిల్లా అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ఇందులో 53 మందిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా, మరో 41 మందికి జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

    ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న 53 మంది పరిస్థితి నిలకడగా ఉందని అనకాపల్లి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ హేమంత్ చెప్పారు.

    బాధితులంతా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నీరసం, వాంతులతో బాధపడుతున్నట్లు చెప్పారు.

    ఈ ఘటనపై ఆంధ్రపదేశ్ మంత్రి జి. అమర్‌నాథ్ స్పందించారు. మంగళవారం బ్రాండెక్స్ సీడ్స్‌లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో మొత్తం 121 మంది అస్వస్థతకు గురయ్యారని అన్నారు.

    రెండు నెలల కాలంలో ఈ కంపెనీలో ఇలా జరగడం ఇది రెండోసారని, దీనిపై విచారణ పూర్తయ్యేవరకు కంపెనీని మూసివేస్తున్నామని చెప్పారు.

  4. దిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఒంగోలు వైసీపీ ఎంపీ పేరు ఎందుకు వినిపిస్తోంది

  5. కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్‌కు కాంస్యం

  6. కొందరు భారతీయులకు పాస్‌పోర్టులు ఇవ్వకుండా భారత్, బ్రిటన్ ఎందుకు కుమ్మక్కయ్యాయి

  7. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

  8. అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీక్, పలువురు ఉద్యోగులకు అస్వస్థత

    అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్​లో గ్యాస్ లీకైంది. దీంతో 50 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.

    సెజ్​లోని బ్రాండిక్స్ దుస్తుల కంపెనీకి చెందిన సీడ్స్ కంపెనీ సమీపంలో ఈ వాయవు లీకైంది.

    దీనిలో పనిచేసే మహిళ ఉద్యోగులు వాంతులు, వికారంతో స్పృహతప్పి పడిపోయారు. పలువురు ఉద్యోగులను అంబులెన్స్​లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    మరికొందరిని కంపెనీ ఆవరణలో ప్రాథమిక చికిత్స కొనసాగిస్తున్నారు.

    ఈ ఘటనపై స్పందించిన మంత్రి అమర్‌నాథ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

    బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు.

    మరోవైపు, ఈ ప్రమాదంలో బ్రాండిక్స్‌ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని, ఆ సంస్థ ఇండియా పార్ట్‌నర్ దొరస్వామిని అరెస్టు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.

    రెండు నెలల కాలంలో ఇది రెండో ఘటన అని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి సంస్థపై చర్యలు తీసుకోవాలని సీపీఎం అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.

  9. మానసిక వైకల్యంతో ఉన్న చిన్నారులను ఆమె అమ్మలా చూసుకుంటారు

  10. చైనా వార్నింగ్‌ను లెక్క చేయకుండా తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా స్పీకర్ పెలోసీ

  11. క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?

  12. అంబానీ, అదానీ: 5జీ సేవలపై ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న భారతీయ కుబేరులు

  13. మంకీపాక్స్ గురించి ఆందోళన వద్దు: కేంద్ర ప్రభుత్వం

    మంకీపాక్స్ కొత్త వ్యాధి కాదని, ప్రమాదకరమైంది కూడా కాదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ప్రజలు అనవసరమైన ఆందోళనకు గురికావద్దని మాండవియా అన్నారు.

    ఈ వ్యాధిపై పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. డీప్ కాంటాక్ట్ వల్ల మాత్రమే ఈ వ్యాధి వస్తుందని, ఇప్పటికీ 70 దేశాలలో ఈ వ్యాధి ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

    “ప్రపంచంలోని కొన్ని దేశాలలో ఈ కేసులు ప్రారంభమైనప్పటి నుంచి దీనిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తూ వచ్చాం. భారతదేశంలో మొదటి కేసు జూలై 14న కేరళలో బయటపడింది. ఆ వెంటనే అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య మార్గదర్శకాలు జారీ చేశాం’’ అని మంత్రి చెప్పారు.

    ఈ వ్యాధి నివారణ పర్యవేక్షణకు సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్, నమూనా పరీక్ష కోసం అన్ని నియమాలను మార్గదర్శకాలలో వివరించామని ఆయన చెప్పారు.

    "ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి వచ్చినట్లయితే, మిగిలిన వ్యక్తులను వారికి దూరంగా ఉంచడం ద్వారా దీనిని సులభంగా నియంత్రించవచ్చు" అని ఆయన అన్నారు.

    దేశవ్యాప్తంగా ఇప్పటికి 8 మంకీపాక్స్ కేసులు వచ్చాయని, అయిదు దేశాల నుంచి ఇవి దేశంలోకి ప్రవేశించాయని మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.

  14. కామన్వెల్త్ గేమ్స్: 2014లో కాంస్యం, 2018లో రజతం గెలిచిన పీవీ సింధు ఈసారి బంగారు పతకం తెస్తారా?

  15. నేషనల్ హెరాల్డ్ కేసులో పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు

    నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి దిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది.

    దీనికంటే కొన్ని రోజుల ముందే ఈ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించింది.

    ఈడీ సోదాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ వార్తా ఏజెన్సీలు పీటీఐ, ఏఎన్‌ఐలు తెలిపాయి.

    సోనియా కంటే ముందు రాహుల్ గాంధీని కూడా ఈడీ పలు దఫాలుగా ప్రశ్నించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం వారిని ప్రశ్నించినట్లు ఈడీ తెలిపింది.

    యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్), నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను ప్రచురిస్తుంది. ఏజేఎల్‌కు సంబంధించిన భవనాల్లో ఈడీ సోదాలు చేసినట్లు భావిస్తున్నారు.

    ఇదే కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌లను కూడా ఈడీ విచారించింది.

  16. ఈజిప్టులోని కంటి డాక్టర్ జిహాదీ ఎలా అయ్యాడు... లాడెన్‌కు కుడి భుజంగా ఎలా మారాడు?

  17. కేరళలో అయిదో మంకీపాక్స్ కేసు

    కేరళ రాష్ట్రంలో మరో మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు ఆరోగ్య మంత్రి వీనా జార్జిని ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ‘‘ఈ వ్యాధి లక్షణాలతో 30 ఏళ్ల వ్యక్తి మలప్పురంలో చికిత్స పొందుతున్నారు. ఆయన జూలై 27న యూఏఈ నుంచి కోజికోడ్‌కు వచ్చారు’’ అని ఏఎన్‌ఐ పేర్కొంది.

    కేరళ రాష్ట్రంలో ఇది అయిదో మంకీపాక్స్ కేసు.

  18. చదరంగంలో దక్షిణ భారత క్రీడాకారులు ముందంజలో ఉండటానికి కారణమేంటి

  19. విశాఖపట్నం: లైట్ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి, వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు

  20. దిల్లీ: జంతర్‌మంతర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి ధర్నా... ఎందుకంటే

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మంగళవారం దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నిరసన ద్వారా ఆయన పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనున్నారు.

    ఆలిండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల సమాఖ్య (ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్)కు ప్రహ్లాద్ మోదీ ఉపాధ్యక్షుడు.

    ధర్నా కార్యక్రమం తర్వాత సమాఖ్య ప్రతినిధులు, ప్రధాని నరేంద్ర మోదీకి ఒక మెమొరండంను సమర్పించనున్నట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కూడా వారు సమావేశం కానున్నారు.

    సమాఖ్య ఇతర ప్రతినిధులతో కలిసి ప్రహ్లాద్ మోదీ, జంతర్‌మంతర్ వద్ద ధర్నాలో పాల్గొంటారు.

    పంచదార, బియ్యం, గోదుమల నష్టాలకు పరిహారంతో సహా తొమ్మిది డిమాండ్లను ఈ సమాఖ్య ప్రతినిధులు లేవనెత్తుతున్నారు.

    దేశవ్యాప్తంగా ‘పశ్చిమ బెంగాల్ రేషన్ మోడల్’ను అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.