You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు ‘అధికారికంగా’ కనిపించదు.. ఎందుకు?

  2. కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్‌కు ప్రధాని మోదీ అభినందనలు

    కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్‌ను ఆయన అభినందించారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

    71 కేజీల వెయిట్ లిఫ్టింగ్ కేజీల విభాగంలో హర్జీందర్ కౌర్ పతకాన్ని గెలిచారు.

    ఆమె ఓవరాల్‌గా 212 కేజీల బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచారు. స్నాచ్ విభాగంలో 93 కేజీలు ఎత్తిన హర్జీందర్, క్లీన్ అండ్ జర్క్ కేటగిరీలో 119 కేజీలు లిఫ్ట్ చేశారు.

    ఆమె సాధించిన పతకంతో భారత్ ఖాతాలోని మెడల్స్ సంఖ్య 9కి చేరింది. ఇందులో ఏడు పతకాలు వెయిట్ లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం.

  3. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీక్, 50మంది మహిళా ఉద్యోగులకు అస్వస్థత

  4. పాకిస్తాన్: ‘‘రోజుకు ఒక పూటే భోజనం, పిల్లలు రెండో పూట ఆకలితో పడుకుంటున్నారు’’

  5. ఆంధ్రప్రదేశ్: 94 ఏళ్ళ వయసులో రోజూ 130 కి.మీ. ప్రయాణించి పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్

  6. జులై నెలలో 28 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. మొత్తంగా రూ.1.47 లక్షల కోట్లు

    జులై నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లలో 28 శాతం పెరుగుదల కనిపించింది.

    ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలతో మాట్లాడి పీటీఐ వార్తా సంస్థ దీనిపై ఒక కథనం ప్రచురించింది.

    మొత్తంగా జులై నెలలో రూ.1,48,995 కోట్లు వసూలు అయినట్లు పీటీఐ తెలిపింది. గత ఐదేళ్లలో ఇది రెండో అత్యధికం అని పేర్కొంది.

    వీటిలో ఐజీఎస్టీ రూ.79,518 కోట్లు కాగా, సీజీఎస్టీ రూ.25,751 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.32,807 కోట్లు.

    ఇప్పటివరకు ఒక నెలలో అత్యధిక జీఎస్టీ వసూళ్లు గత ఏప్రిల్‌లో (రూ 1,67,540 కోట్లు) నమోదయ్యాయి.

  7. మంకీపాక్స్ వైరస్‌తో భారత్‌లో తొలి మరణం... 20 మందికి ఐసోలేషన్‌

  8. ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

    ఈ వార్త తెలియగానే చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు.

    ఎన్టీఆర్‌కు 12 మంది సంతానం కాగా అందులో 8 మంది కుమారులు, నలుగురు కూతుళ్లు.

    కూతుళ్ళలో ఉమామహేశ్వరి అందరికన్నా చిన్నవారు. ఇటీవలే ఆమె తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

    సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటికి మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో చేరుకున్నారు.

    పోస్ట్‌మార్టమ్ పూర్తయినట్లు పోలీసులు 6.30 గంటల ప్రాంతంలో తెలిపారు. డాక్టర్ తాఖియొద్దీన్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. ఆ సమయంలో నటుడు బాలకృష్ణ, నారా లోకేశ్ ఉస్మానియా ఆస్పత్రి వద్దే ఉన్నారు.

    ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం కోసంబీబీసీ లైవ్ పేజిక్లిక్ చేస్తూ ఉండండి.

  9. డెత్ ఐలాండ్: హిట్లర్‌ను ఓడించడానికి ఆంత్రాక్స్ ప్రయోగించడంతో ఆ ద్వీపం 50 ఏళ్ల పాటు విషంగా మారిపోయింది, అల్ముండెనా డె కాబో, బీబీసీ న్యూస్

    రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రరాజ్యాలకు ఒకటే లక్ష్యం.. నాజీల జర్మనీని ఓడించాలి. అందుకు అనేక రకాల ప్రణాళికలు రచించాయి. వాటిల్లో ఒకటి ఆంత్రాక్స్ పథకం.

    జీవ ఆయుధాలను (బయొలాజికల్ వెపన్స్) ఉపయోగించి నాజీ సైన్యాన్ని మట్టుబెట్టాలనుకున్నాయి. కానీ, ఆ పథకం తిప్పికొట్టింది. స్కాట్లాండ్‌లోని ఒక ద్వీపాన్ని పూర్తిగా విషపూరితం చేసింది.

    అయిదు దశాబ్దాల పాటు ఆ దీవిలోకి ఎవరూ అడుగుపెట్టలేకపోయారు. ఒకప్పుడు పక్షులకు అభయారణ్యంగా వెలుగొందిన ఈ ద్వీపం జీవులకు శాపంగా మారింది.

    అయితే, ఈ ఆపరేషన్ ఎలా జరిగిందన్న వివరాలు చాలాకాలం రహస్యంగానే ఉండిపోయాయి .

    స్థానికంగా నేటికీ ఆ దీవిని "ఆంత్రాక్స్ ద్వీపం" అనే పిలుస్తారు. "డెత్ ఐలాండ్" అని కూడా అంటారు. అదే స్కాట్లాండ్‌లోని గ్రునాడ్ ద్వీపం. దాదాపు 50 ఏళ్ల తరువాత 1990లో ఈ దీవిని "సురక్షితం"గా ప్రకటించినప్పటికీ, అక్కడ జీవితం సాధారణ స్థితికి రాలేదు.

  10. 15 ఏళ్లుగా ట్రాక్టర్లు రిపేర్ చేస్తున్న మహిళ

  11. ఇండియా హిందూ దేశంగా మారుతోందా

  12. ఈ ఆవులను మీ బాల్కనీలోనే పెంచుకోవచ్చు

  13. చావుల ద్వీపం: హిట్లర్‌ను ఓడించడానికి ఆంత్రాక్స్ ప్రయోగించడంతో ఆ ద్వీపం 50 ఏళ్ల పాటు విషంగా మారిపోయింది

  14. కామన్వెల్త్ గేమ్స్ వలసవాద అవశేషమేనా, అసలు కామన్వెల్త్ కూటమి ఇప్పుడు అవసరమా

  15. హైదరాబాద్‌లో కాల్పులు... ఒకరి మృతి

    హైదరాబాద్‌లో తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి.

    మాదాపూర్‌లో ఇస్మాయిల్ అనే వ్యక్తిని ముజీబ్ అనే వ్యక్తి కాల్చి చంపారు. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారు.

    స్థిరాస్తి విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య జరిగిన గొడవే ఈ కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

  16. ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య

  17. బ్రిటన్‌లో కరవు.. నీటిని రేషన్ విధానంలో సరఫరా చేస్తారా

  18. చికోటి ప్రవీణ్ ఎవరు? తెలుగు రాష్ట్రాలను కుదుపుతోన్న క్యాసినో కేసు ఏంటి? ప్రముఖులతో ప్రవీణ్, మాధవ్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి?

  19. ఎయిర్ ఫ్రైర్‌లో వంట ఓవెన్ కంటే ఆరోగ్యకరమా? ఇది ఎలా పని చేస్తుంది?

  20. ప్రొఫెసర్ శాంతమ్మ: 94 ఏళ్ల వయసులో 130 కిలోమీటర్లు ప్రయాణించి ఫిజిక్స్ పాఠాలు చెబుతున్న బామ్మ