కరోనావైరస్: జనవరి 16 నుంచి భారత్‌లో కోవిడ్ వ్యాక్సీనేషన్.. మొదట ఎవరెవరికంటే - BBC Newsreel

వ్యాక్సీనేషన్

ఫొటో సోర్స్, Reuters

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నవారు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు మొదటి ప్రాధాన్యంగా వ్యాక్సీన్ వేస్తారు.

మొదటి విడతలో సుమారు 3 కోట్ల మందికి వ్యాక్సీన్ వేస్తారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆ తరువాత 50 ఏళ్లు దాటినవారు.. 50 ఏళ్ల లోపు వయసున్నా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి టీకా వేస్తారు. ఇలాంటివారు సుమారు 27 కోట్ల మంది ఉంటారని అంచనా.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి స్థితిగతులు, వ్యాక్సీనేషన్ కోసం సన్నద్ధత తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

డోనల్డ్ ట్రంప్ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించిన ట్విటర్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ట్విటర్ వెల్లడించింది. ఆయన మళ్లీ హింసను ప్రేరేపించే ముప్పున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ట్రంప్ ట్విటర్ ఖాతా ''రియల్‌డోనల్డ్‌ట్రంప్'' నుంచి చేసిన వరుస ట్వీట్లను సమీక్షించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు ట్విటర్ పేర్కొంది.

ట్రంప్‌పై పూర్తిగా నిషేధం విధించాలని ఏళ్ల నుంచీ కొందరు సెలబ్రిటీలు, శాసనకర్తలు కోరుతున్నారు. అమెరికా ఇదివరకటి అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ కూడా ట్రంప్‌పై శాశ్వతంగా నిషేధం విధించాలని రెండు రోజుల క్రితం కోరారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్ బుధవారం భేటీ అయ్యింది. అయితే ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వందల మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించారు. ఈ ఉద్రిక్తతల్లో నలుగురు పౌరులు, ఓ పోలీసు అధికారి మరణించారు.

క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన వారిని దేశ భక్తులుగా ట్రంప్ అభివర్ణించారు. దీంతో మరోసారి తమ నిబంధనలను ఉల్లంఘిస్తే శాశ్వతంగా ఖాతాను తొలగిస్తామని ట్విటర్ హెచ్చరించింది.

హింసను రెచ్చగొట్టేలా శుక్రవారం మరో రెండు ట్వీట్లను ట్రంప్ చేశారని, అందుకే ఆయన ఖాతాను తొలగిస్తున్నామని ట్విటర్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)