BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
జలుబు, ఫ్లూ మందులతో కలిపి పారాసిటమాల్ తీసుకుంటే ప్రమాదమా?
యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల రైలీ లబూస్ అనే విద్యార్థి కిందటేడాది మార్చిలో జలుబు బారిన పడ్డారు. దీంతో ఆయన సొంతంగా మందుల షాపులో ఓ రెండు టాబ్లెట్లు కొనుగోలు చేశారు. అయితే ఆ రెండు టాబ్లెట్లు పారాసిటమాల్ కాంబినేషన్‌తో ఉన్నాయని ఆయనకు తెలియదు.
‘ఆకలి తీర్చుకోవడానికి కలుపు మొక్కలు తింటున్నారు’...దిగ్బంధంలో రష్యా ఆక్రమిత ఒలెష్కీ ప్రజలు
‘‘ఏ కలుపు మొక్కలు తినొచ్చు, వాటిని ఎలా ఉడికించాలి అనే విషయాలు స్థానిక టెలిగ్రామ్ చాట్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. దుకాణాలు తెరవడం లేదు. దీంతో ప్రజలకు దుస్తులు, వ్యక్తిగత పరిశుభ్రతకు అవసరమైన వస్తువులు కూడా దొరకడం లేదు. మూడేళ్ల క్రితం కఖోవ్కా డ్యాంపై దాడి జరిగినప్పటి నుంచి ఆ పట్టణంలో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోయింది’’
ఇందిరాగాంధీకే ప్రభుత్వ వ్యతిరేకత తప్పలేదు.. మోదీ మాత్రం ఎలా ఎదుర్కొంటున్నారు, ఏదో ఉంది: రాహుల్ గాంధీ
ఇందిరా గాంధీకి ప్రజాదరణ తారస్థాయిలో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయారని పేర్కొన్న రాహుల్, ఇటీవలి కాలంలో 'ప్రభుత్వ వ్యతిరేకత' ప్రభావం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.
అయిదు రోజుల ‘గాయత్రీ జపం’ జరుగుతుండగా భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. రంగంలోకి కమాండోలు, తర్వాత ఏం జరిగింది?
"అరవింద్ ఇంటి నుంచి బయటకు రావడానికి కానీ, పిల్లలను బయటకు పంపించడానికి కానీ ఒప్పుకోలేదు. పోలీసు అధికారులతో మాట్లాడించాం. అయినప్పటికీ ప్రతిసారీ 'పిల్లలు నా దగ్గర ఉన్నారు, వాళ్లే నా రక్షణ. మీరు వెనక్కి వెళ్లిపోండి' అని ఒకే సమాధానం చెప్పాడు. అప్పటికే ఏడు గంటలయ్యాయి. తర్వాత ఇంటిని చుట్టుముట్టాలని, అతను పారిపోయేందుకు ప్రయత్నిస్తే అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాం" అని వారణాసి అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ నవీన్ అరోరా తెలిపారు.
ఎన్నికల కమిషన్‌లో విభేదాల వార్తలతో ప్రతిపక్షాలకు లక్ష్యంగా మారిన జ్ఞానేష్ కుమార్ ఎవరు? ఆయనపై మోదీ ప్రభుత్వానికి ఎంత నమ్మకం ఉంది?
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ పదవీకాలం జనవరి 26, 2029 వరకు ఉంది. ఆయన పదవీకాలంలో 20 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆయన 2027 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను కూడా నిర్వహించి, 2029 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు చేస్తారు.
గర్భ నిరోధక మాత్రలు, గర్భస్రావం మాత్రలు రెండూ ఒకటేనా? దేని ఉపయోగం ఏమిటి?
డబ్ల్యూహెచ్ఓ 2025 గర్భస్రావ మార్గదర్శకాల ప్రకారం... 12 వారాల కంటే తక్కువున్న గర్భధారణలో సరైన సమాచారం, నాణ్యమైన మందులు, అవసరమైనప్పుడు శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త సహాయం, అవసరమైతే అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్న పరిస్థితిలో వైద్యపరమైన గర్భస్రావాన్ని ఇంట్లోనే మహిళ చేసుకోవచ్చు.
వీడియో, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. పొంగుతున్న నదులు, వ్యవధి 5,22
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాయుగుండం తీరం దాటాక పరిస్థితులు ఎలా ఉన్నాయి?
దానం నాగేందర్: అనర్హత వేటు వేసిన హైకోర్ట్.. సమర్థించిన సుప్రీంకోర్ట్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ ను సెప్టెంబరు 18న అనర్హుడిగా తెలంగాణ హైకోర్టు ప్రకటించడంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అమెరికా: ఎర్రతివాచీ, యుద్ధ విమానాలతో జిన్‌పింగ్‌కు ట్రంప్ ఘనస్వాగతం
మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో 100 అడుగుల ఎర్రతివాచీ పరిచి, సైనిక విమాన విన్యాసాలతో జిన్‌పింగ్‌ను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా వైమానిక దళ బ్యాండ్ రన్‌వేపై కవాతు చేస్తుండగా అమెరికా, చైనా జెండాలు రెపరెపలాడుతుండగా, చైనా అధ్యక్షుడిని ట్రంప్ ఆహ్వానించారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































