మహారాష్ట్ర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: పది మంది నవజాత శిశువులు మృతి

ఫొటో సోర్స్, Ani
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది నవజాత శిశువులు మణించారు.
నాగ్‌పుర్‌కు 62 కి.మీ. దూరంలోని భండారా జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలకు (తెల్లవారితే శనివారం) ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆసుపత్రిలోని నవజాత శిశువుల విభాగం నుంచి దట్టమైన పొగలు రావడంతో అక్కడ పనిచేస్తున్న నర్సు అధికారులకు సమాచారం అందించారు. దీంతో విభాగంలోని 17 మంది శిశువుల్లో ఏడుగురిని ప్రాణాలతో కాపాడారు.
''ఏడుగురు శిశువులను మాత్రమే కాపాడగలిగాం. దురదృష్టవశాత్తు పది మంది పిల్లలు చనిపోయారు''అని ఆసుపత్రిలో పనిచేస్తున్న సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండాటే ఏఎన్‌ఐ వార్తా సంస్థకు తెలిపారు.
అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించామని భండారా జిల్లా ఎస్సీ వసంత్ జాదవ్ తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపేతో మాట్లాడానని, తక్షణమే విచారణకు ఆదేశించామని ఆయన తెలిపారు.
మరోవైపు మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని రాజేశ్ తోపే ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''మహారాష్ట్రలోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. బాధతో నాకు మాటలు కూడా రావడం లేదు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. ఈ బాధను తట్టుకొనే శక్తివారికి దేవుడే ఇవ్వాలి''అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''భండారా జిల్లా జనరల్ హాస్పిటల్‌లో ప్రమాదం జరగడం చాలా బాధాకరం. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు సాయం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను''అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























