అఫ్గానిస్తాన్ యుద్ధం: తాలిబాన్ల 'ట్రక్కు బాంబు' దాడిలో ధ్వంసమైన హాస్పిటల్... 20 మంది మృతి

దాడిలో దెబ్బతిన్న అంబులెన్సులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దాడిలో దెబ్బతిన్న అంబులెన్సులు
ప్రచురణ

దక్షిణ అఫ్గానిస్తాన్‌లోని ఓ హాస్పిటల్ మీద తాలిబాన్లు పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కుతో చేసిన దాడిలో 20 మంది చనిపోయారు.

ఖలాత్ నగరంలో జరిగిన ఈ దాడిలో చనిపోయినవారు, గాయపడిన వారిలో ఎక్కువ మంది డాక్టర్లు, రోగులేనని స్థానిక మీడియా తెలిపిది.

ఆ తరువాత తూర్పు ప్రాంతంతోల ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా చేసిన వైమానిక దాడిలో 16 మంది చనిపోయారని, వారిలో చాలా మంది సామాన్య పౌరులేనని అధికారులు తెలిపారు.

ఇక్కడి ఘర్షణల్లో ఒక్క గత నెలలోనే 473 మంది పౌరులు చనిపోయారని బీబీసీ గుర్తించింది.

అఫ్గాన్ యుద్ధం మీద బీబీసీ ఇటీవలే ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఆ పరిశోధన ప్రకారం ఆగస్ట్ నెలలో ఈ యుద్ధంలో చనిపోయినట్లుగా గుర్తించిన వారిలో అయిదో వంతు సామాన్య ప్రజలేనని తేలింది.

జాబుల్ రాష్ట్రంలోని ఖలాత్ నగరం
ఫొటో క్యాప్షన్, జాబుల్ రాష్ట్రంలోని ఖలాత్ నగరం

హాస్పిటల్ వద్ద బాంబు పేలుడు

ఖలాత్ నగరంలోని ఒక హాస్పిటల్ వద్దకు భారీ పేలుడు పదార్థాలతో నిండిన 'మినీ ట్రక్కు'ను తీసుకొచ్చి పేల్చేశారని రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.

జాబుల్ ప్రాంతంలో చాలా మందికి వైద్య సేవలు అందించే ఈ ఆస్పత్రి పూర్తిగా విధ్వంసమైందని గవర్నర్ రహమతుల్లా యమాల్ చెప్పారు.

తాలిబాన్లు మాత్రం, తాము హాస్పిటల్ పక్కన ఉన్న ప్రభుత్వ ఇంటలిజెన్స్ వర్గాలను టార్గెట్ చేశామని ప్రకటించారు.

గురువారం ఉదయం జరిగిన ఈ దాడిలో మొత్తం ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియలేదు. అయితే, జాబుల్ డిప్యూటీ గవర్నర్ చెప్పిన ప్రకారం 20 మంది చనిపోయారు, మరో 90 మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)